Daughter Murdered Mother With Iron Rod | తల్లిని రాడ్డుతో కొట్టి చంపిన కూతురు

హైదరాబాద్‌ ఎస్‌ఆర్ నగర్‌లో 42 ఏళ్ల కుమార్తె రాడ్‌తో తన 82 ఏళ్ల తల్లిని కొట్టి హత్య. మాదవి అరెస్ట్, దర్యాప్తు కొనసాగుతోంది.

Daughter Murdered Mother With Iron Rod | తల్లిని రాడ్డుతో కొట్టి చంపిన కూతురు

విధాత, హైదరాబాద్ : హైదరాబాద్‌లోని ఎస్ఆర్ నగర్‌లో దారుణం చోటు చేసుకుంది. స్థానిక లీలానగర్‌ కాలనీలో ఓ కుమార్తె తన తల్లిని ఇనుప రాడ్డుతో కొట్టి హత్య చేసింది. సోమవారం రాత్రి ఈ ఘటన జగినట్లు తెలుస్తోంది. తల్లి లక్ష్మి (82), ఆమె కుమార్తె మాధవి (42) మధ్య సోమవారం రాత్రి గొడవ జరిగింది. తల్లి టాబ్లెట్ లు వేసుకోలేదంటూ కోపోద్రిక్తురాలైన మాధవి రాడ్డుతో తన తల్లిని కొట్టి చంపేసింది. వారిద్దరికీ మతిస్థిమితం లేదని స్థానికులు చెబుతున్నారు.

పోలీసులు నిందితురాలిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఎస్ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.