Niagara Falls | వింటర్ వండర్ ల్యాండ్.. గడ్డకట్టిన నయాగరా అందాలు.. వీడియో చూశారా..?

అతిశీతల వాతావరణంతో నయాగరా జలపాతం గడ్డకట్టింది. వింటర్ వండర్ ల్యాండ్‌గా మారిన నయాగరా అందాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Niagara Falls | వింటర్ వండర్ ల్యాండ్.. గడ్డకట్టిన నయాగరా అందాలు.. వీడియో చూశారా..?

జలపాతం.. అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది నయాగరా ఫాల్సే (Niagara Falls). అమెరికా-కెనడా (United States and Canada) దేశాల మధ్య నయాగరా నదిపై ఉన్న నయాగరా జలపాతం అందాలు వర్ణణాతీతం. ఈ జలపాతం గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రపంచంలోనే చూడదగ్గ ప్రదేశాల్లో నయాగరా ఫాల్స్‌ ముందుంటుంది. అమెరికాలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ నయాగరా అందాలను చూడకుండా వెనుదిరిగి రాలేరు. కొండల మధ్య నుంచి నీరు అలా కిందకు దూకుతుంటే చూసేందుకు రెండు కళ్లూ చాలవు. అంతటి ప్రసిద్ధి చెందిన ఈ జలపాతం ప్రస్తుతం గడ్డకట్టుకుపోయింది (freeze).

అమెరికా వ్యాప్తంగా ప్రస్తుతం అతిశీతల వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. విపరీతంగా మంచు కురుస్తోంది. మంచు తుఫానులు బీభత్సం సృష్టిస్తున్నాయి. అక్కడ ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా ఎటుచూసినా మంచు గడ్డలే దర్శనమిస్తున్నాయి. నదులు, సరస్సుల్లోని నీరు గడ్డకట్టుకుపోయింది. దీంతో నయాగరా అందాలు సైతం గడ్డ కట్టుకుపోయి పర్యాటకులకు ఆహ్వానిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం తెగ వైరల్‌ అవుతున్నాయి. ఆ దృష్యాలను చూసిన నెటిజన్లు మంత్రముగ్దులవుతున్నారు. నయాగరా జలపాతం కాస్తా వింటర్ వండర్ ల్యాండ్ గా మారిందంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.

మరోవైపు గడ్డకట్టిన నయాగరా అందాలను చూసేందుకు పర్యాటకులు ఆ ప్రాంతానికి పోటెత్తుతున్నారు.

 

ఇవి కూడా చదవండి :

Liu Chuxi | 55 రోజులుగా కోమాలో విద్యార్థి.. ప్రాణం పోసిన స్నేహితుల వీడియో
Tamil Nadu State Film Awards | తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్ 2026 .. ‘జై భీమ్’ సినిమా హ‌వా