EAGLE Team Busts Drug Racket In School : స్కూల్ ముసుగులో మత్తు పదార్థాల దందా!
సికింద్రాబాద్ మేధా స్కూల్‌లో అక్రమ డ్రగ్స్ తయారీ దందా Eagle టీమ్ ఆపరేషన్‌లో పట్టివేయబడింది; కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం.

విధాత, హైదరాబాద్ : సికింద్రాబాద్ బోయిన్ పల్లిలోని మేధా స్కూల్(Medha School) లో అక్రమ డ్రగ్స్ తయారీ దందాఈగల్ టీమ్(EAGLE Team) ఆపరేషన్ లో బట్టబయలైంది. పాత స్కూల్లో మత్తు మందు తయారు చేస్తున్నారని ఈగల్ టీమ్ ఆపరేషన్ లో వెల్లడైంది. పాఠశాల డైరెక్టరే స్కూల్ ను డ్రగ్స్ తయారీ కేంద్రంగా మార్చారని..స్కూల్ ఆఫీస్ రూమ్ తో పాటు మరో రెండు రూములలో మత్తు పదార్దాల తయారీ చేస్తున్నారని గుర్తించారు. పెద్ద ఎత్తున రియాక్టర్లు పెట్టి మత్తు మందు తయారీ దందా సాగిస్తున్నారు.
తయారు చేసిన మత్తు మందును తీసుకెళ్తుండగా ఈగల్ టీం పట్టుకుంది. కోటి రూపాయల విలువైన మత్తుమందు సీజ్ చేశారు. 7 కేజీల ఆల్ఫాజోలం, రూ. 20 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవలే చర్లపల్లిలో సైతం కోట్లాది రూపాయాల అక్రమ డ్రగ్స్ తయారీ వ్యవహారానికి ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ఆపరేషన్ లో చెక్ పెట్టిన సంగతి తెలిసిందే. అయితే చర్లపల్లిలో రూ.12వేల కోట్ల డ్రగ్స్ దొరకలేదని..అక్కడ పట్టుబడిన డ్రగ్స్ విలువ రూ.3నుంచి 4కోట్లు మాత్రమే ఉంటుందని మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు.