నా సంతకం ఫోర్జరీ చేశారు …సాహితి నిర్మాణ సంస్థపై జేసీ దివాకర్‌రెడ్డి ఫిర్యాదు

హైదరాబాద్‌లో రియల్ ఏస్టేట్ సంస్థల మోసాలకు ఇద్దరు ప్రముఖులు బాధితులుగా మారడం ఆసక్తికరంగా మారింది. ఏపీకి చెందిన తెలుగుదేశం పార్టీ అధినేత జేసీ దివాకర్‌రెడ్డి హైదరాబాద్‌కు చెందిన సాహితీ నిర్మాణ సంస్థపై పోలీసులకు ఫిర్యాదు చేశారు

  • By: Tech    crime    May 29, 2024 10:10 PM IST
నా సంతకం ఫోర్జరీ చేశారు …సాహితి నిర్మాణ సంస్థపై జేసీ దివాకర్‌రెడ్డి ఫిర్యాదు

విధాత : హైదరాబాద్‌లో రియల్ ఏస్టేట్ సంస్థల మోసాలకు ఇద్దరు ప్రముఖులు బాధితులుగా మారడం ఆసక్తికరంగా మారింది. ఏపీకి చెందిన తెలుగుదేశం పార్టీ అధినేత జేసీ దివాకర్‌రెడ్డి హైదరాబాద్‌కు చెందిన సాహితీ నిర్మాణ సంస్థపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్‌లో ఉన్న తన నివాసం లీజు విషయంలో ఒప్పంద పత్రాలను సంస్థ తారుమారు చేసి.. తన సంతకాన్ని సైతం ఫోర్జరీ చేసినట్లు పోలీసులకు ఇచ్చిన పోలీసులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సంస్థపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్‌లోని రోడ్ నెంబర్-62లోని తన ఇంటిని జేసీ దివాకర్ రెడ్డి గతంలో సాహితి నిర్మాణ సంస్థకు లీజుకు ఇచ్చారు.
జేసీ దివాకర్‌రెడ్డితో 2020లో సంస్థ నిర్వాహకుడు బూదాటి లక్ష్మీనారాయణతో మూడేళ్ల కాలానికి ఒప్పందం చేసుకున్నారు. 2023 మే నెలతో గడువు ముగిసింది. అయితే, ఇల్లు ఖాళీ చేయాలని జేసీ పలుమార్లు కోరినా లక్ష్మీనారాయణ స్పందించలేదు. దీంతో జేసీ దివాకర్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. క్రమంలో తమకు లీజు గడువు ఇంకా ఉందంటూ లక్ష్మీనారాయణ, ఆయన కుమారుడు సాత్విక్‌ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ వేయగా.. కోర్టు జేసీకి సమన్లు జారీ చేసింది. సాహితీ ర్మాణ సంస్థ యాజమాన్యం కోర్టులో దాఖలు చేసిన పత్రాలను పరిశీలించిన జేసీ.. వాటిలో ఒప్పందం 2021 మే నెలగా మార్చినట్లు గుర్తించిన ఆయన.. సంతకం ఫోర్జరీ చేసి ఆ పత్రాలను తయారుచేసినట్లు ఆరోపించారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.