Woman Suicide | రైల్వే ఎస్ఐ భార్య ఆత్మహత్య.. ఉద్రిక్తత

  • By: TAAZ |    crime |    Published on : Jun 30, 2025 2:11 PM IST
Woman Suicide | రైల్వే ఎస్ఐ భార్య ఆత్మహత్య.. ఉద్రిక్తత

Woman Suicide | ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలోని రాములు తండా గ్రామానికి చెందిన వివాహిత కేలోతు రాజేశ్వరి అలియాస్‌ బేబీ(28) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాలతో మూడు రోజుల క్రితం జూలూరుపాడులో రాజేశ్వరి ఆత్మహత్యకు పాల్పడింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ తరలించారు. చికిత్స పొందుతూ రాజేశ్వరి చనిపోయింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాజేశ్వరి మరణానికి భర్త..రైల్వే ఎస్ఐ రాణాప్రతాప్, అతని కుటుంబం వేధింపులే కారణమంటూ మృతురాలి బంధువులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తతకు దారితీసింది. కొన్నేళ్ల నుంచి రాణాప్రతాప్ వేధిస్తున్నాడని.. రాజేశ్వరి కుటుంబీకుల ఆరోపించారు. రాణా ప్రతాప్ సింగ్ కొన్ని రోజుల క్రితం వరకు జూలూరుపాడు ఎస్సైగా పనిచేశారు.

రాజేశ్వరి మరణవాంగ్మూలం నేపథ్యంలో ఆమె భర్త రైల్వే ఎస్ఐ రాణప్రతాప్, మహబూబాబాద్ జిల్లాలో పనిచేస్తున్న వీఆర్ ఎస్ఐగా పనిచేస్తున్న మహేష్, కుటుంబ సభ్యులపై పలు సెక్షన్ క్రింద పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి రిమాండ్ చేశారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.