ప్రేమ జంట ఆత్మహత్య

సూర్యాపేట జిల్లా ఆత్మకూరు (ఎస్) మండలం తుమ్మల పెన్ పహాడ్ గ్రామంలో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది

  • By: Subbu |    crime |    Published on : Apr 28, 2024 4:11 PM IST
ప్రేమ జంట ఆత్మహత్య

పెళ్లికి పెద్దల నిరాకరణతో అఘాయిత్యం

విధాత : సూర్యాపేట జిల్లా ఆత్మకూరు (ఎస్) మండలం తుమ్మల పెన్ పహాడ్ గ్రామంలో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. తుమ్మల పెన్ పహాడ్ గ్రామానికి చెందిన గుండగాని సంజయ్ (25), కృష్ణ సముద్రం గ్రామానికి చెందిన
సళ్లగుండ నాగ జ్యోతి(21)లు గత ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వారి పెళ్లికి ఇరువైపుల పెద్దలు నిరాకరించడంతో శనివారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.