Nagole Woman Suicide : ప్రియుడి ఇంట్లో వివాహిత ఆత్మహత్య
హైదరాబాద్ నాగోల్‌లో ప్రియుడి ఇంట్లో వివాహిత ఆత్మహత్య, కుటుంబ కలహాల నేపథ్యంలో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 23(విధాత): ప్రియుడి ఇంట్లో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్, నాగోల్ పరిధిలో సంచలనంగా మారింది. నాగోల్‌లో నివాసముంటున్న బానోత్ అనిల్ నాయక్ (24) అనే యువకుడితో పరచియం ఏర్పరుచుకున్న మహబూబాబాద్ జిల్లా రెడ్యాల గ్రామనికి చెందిన మహిళ(38) తనతో గడిపేందుకు నాగోల్ వచ్చింది. తన మూడేళ్ల కుమారుడికి చికిత్స చేయిస్తానని వచ్చిన మహిళ అనిల్ ఇంట్లో రెండు రోజులు ఉంది. అయితే కూరగాయల కోసం బయటకు వెళ్లిన అనిల్ ఇంట్లోకి వచ్చేసరికి సదరు మహిళ బాత్‌రూంలోని హ్యంగర్‌కు ఉరివేసుకోవడం కనిపించింది. దీంతో సహాయం కోసం ఎవరినైనా పిలిస్తే పరువు పోతుందని భావించిన అనిల్ బాత్ రూం తలుపును తానే బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్లే సరికి మహిళ మరణించింది. దీంతో భయంతో చేతు కోసుకుని తాను కూడా ఆత్మహత్య చేసుకుందాని ప్రయత్నించగా ఎదురుగా ఉన్న బాలుడిని చూసి తన చేతికి గుడ్డ కట్టుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. విషయం తెలుసుకున్న మహిళ బంధువులు నాగోల్ చేరుకుని అనిల్‌ను కఠినంగా శిక్షించాలని పోలీసులను డిమాండ్ చేశారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram