నెల్లూరు సూపరిండెంట్ లైంగిక వేధింపులపై మహిళా కమిషన్ ఆగ్రహం
విధాత:నెల్లూరు జిల్లా GGH సూపరిండెంట్ లైంగిక వేధింపుల ఆరోపణలపై తక్షణం సమగ్ర దర్యాప్తు జరపాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్-పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆదేశించారు. శుక్రవారం నెల్లూరు జిల్లా కలెక్టర్ తో ఆమె ఇటువంటి కామాంధుల ను ఉపేక్షించరాదని కోరారు. వైద్య విద్యార్థినుల పట్ల అసభ్య ప్రవర్తన పై బాధితులు వాట్సాప్ నెంబరు 9394528968 కు స్వయంగా సంప్రదించవచ్చని తెలిపారు. కరోనా సమయంలో ప్రత్యక్షదైవంగా చూస్తున్న వైద్య వృత్తికి మచ్చ తెచ్చే విధంగా నెల్లూరు సూపరిండెంట్ వ్యవహరించటం […]
విధాత:నెల్లూరు జిల్లా GGH సూపరిండెంట్ లైంగిక వేధింపుల ఆరోపణలపై తక్షణం సమగ్ర దర్యాప్తు జరపాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్-పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆదేశించారు. శుక్రవారం నెల్లూరు జిల్లా కలెక్టర్ తో ఆమె ఇటువంటి కామాంధుల ను ఉపేక్షించరాదని కోరారు. వైద్య విద్యార్థినుల పట్ల అసభ్య ప్రవర్తన పై బాధితులు వాట్సాప్ నెంబరు 9394528968 కు స్వయంగా సంప్రదించవచ్చని తెలిపారు.
కరోనా సమయంలో ప్రత్యక్షదైవంగా చూస్తున్న వైద్య వృత్తికి మచ్చ తెచ్చే విధంగా నెల్లూరు సూపరిండెంట్ వ్యవహరించటం బాధాకరమని పద్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఇతని తప్పుడు ప్రవర్తన కు మానసికంగా కృంగిపోయిన బాధితులు అందరూ నిర్భయంగా వివరాలు మహిళా కమిషన్ కు వెల్లడించాలని పద్మ కోరారు. ఇతని పై ఫిర్యాదు చేసిన బాధితుల వివరాలు రహస్యంగా ఉంచబడతాయని అందరూ ధైర్యంగా ఫిర్యాదు చేయాలని విచారణలో అన్ని విషయాలు వెల్లడించాలని వాసిరెడ్డి పద్మ విజ్ఞప్తి చేశారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరపాలని వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ని కూడా మహిళా కమిషన్ ను కోరింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram