Teenmar Mallanna| తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి..గన్ మెన్ కాల్పులు

Teenmar Mallanna| తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి..గన్ మెన్ కాల్పులు

కవితపై వ్యాఖ్యలను నిరసిస్తూ జాగృతి కార్యకర్తల విధ్వంసం

విధాత, హైదారాబాద్ :

తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి..గన్ మెన్ కాల్పులు
కవితపై వ్యాఖ్యలను నిరసిస్తూ జాగృతి కార్యకర్తల విధ్వంసం
మల్లన్నపై మండలి చైర్మన్, డీజీపీలకు కవతి ఫిర్యాదు

విధాత, హైదారాబాద్ : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(చింతపండు నవీన్) చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఆయన కార్యాలయం(క్యూన్యూస్ )పై దాడికి పాల్పడ్డారు. ఆదివారం గుంపులుగా మల్లన్న కార్యాలయంలోకి చొరబడిన జాగృతి కార్యకర్తలు ఆఫీస్ లోని కంప్యూటర్లు, కెమెరాలు, ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. కార్యాలయంలోని తన ఛాంబర్ లో తన మద్దతుదారులతో సమావేశంలో ఉన్న మల్లన్నపైన, కార్యాలయ సిబ్బందిపైన దాడులు చేశారు. మల్లన్న వెంట ఉన్న గన్ మెన్ వెంటనే గాలిలోకి 5రౌండ్ల కాల్పులు జరిపారు. దీంతో అక్కడున్న వారు తలోవైపు పారిపోయారు. కాల్పుల అనంతరం జాగృతి కార్యకర్తలు కవితకు మద్దతుగా..మల్లన్నను హెచ్చరిస్తూ నినాదాలు చేస్తూ వెళ్లిపోయారు. జాగృతి కార్యకర్తల దాడిలో మల్లన్న సహా, మద్దతుదారులు, కార్యాలయ సిబ్బంది గాయపడినట్లుగా తెలుస్తుంది. సమాచారం ఎందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు.

ఆ వ్యాఖ్యలతోనే జగడం

సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు 42శాతం రిజర్వేషన్ అర్డినెన్స్ ఇవ్వగానే కల్వకుంట్ల కవిత రంగులు, గులాబ్ లు పూసుకుంటుందన్నారు. దున్నపోతు ఈనీందంటే దూడను కట్టేయమన్నట్లుగా కవిత వ్యవహారం ఉందని..బీసీలకు ఏమొస్తే నీకెందుకు.. నువ్వేమన్న బీసీవా.. బీసీలతో నీకు కంచం పొత్తు ఉందా.. మంచం పొత్తు ఉందా అంటూ వ్యాఖ్యానించారు. నీవు పండుగ చేసుకోవడం ఎందో మాకు అర్ధం కావడం లేదన్నారు. మా బీసీలకు 42శాతం రిజర్వేషన్ వస్తే మా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు పండుగ చేసుకోవాలన్నారు. 70ఏండ్ల నుంచి బీసీలను తొక్కిన మీ జాతీ మా రిజర్వేషన్లపై పండుగ చేసుకోవడం ఏమిటని చూసినోళ్లంతా నవ్వుకుంటున్నారన్నారు. కవితపై మల్లన్న చేసిన ఈ వ్యాఖ్యలే జాగృతికి, మల్లన్ననకు మధ్య ఘర్షణకు దారితీసింది.

మల్లన్నపై మండలి చైర్మన్ కు కవిత ఫిర్యాదు

తనపై తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత మండలి చైర్మన్ కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. మధ్యాహ్నం 3 గంటలకు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నివాసానికి వెళ్లి తనపై మల్లన్న చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయనున్నారు. అలాగే మధ్యాహ్నం 3.30 గంటలకు డీజీపీని కలిసి ఫిర్యాదు చేయనున్నారు.