West Bengal | బాణసంచా పేలి.. ఎనిమిది మంది దుర్మరణం
West Bengal | విధాత: పశ్చిమ బెంగాల్ ఉత్తర 24 పరగణ జిల్లాలో దత్తపుతూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోష్‌పోల్‌లో ఓ బాణసంచా ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో ఎనిమిది దుర్మరణం చెందగా, మరికొందరు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఆదివారం ఉదయం 10గంటల సమయంలో కార్మికులు పనిలో ఉండగా పేలుడు సంభవించడంతో ఏడుగురు చనిపోయారు. మృతుల్లో మహిళా కార్మికులు కూడా ఉన్నారు. ప్రమాద తీవ్రతకు వారి మృతదేహాలు చిత్రమై శరీర భాగాలు వేర్వేరు ప్రాంతాలకు ఎగిరిపడ్డాయి. […]

West Bengal |
విధాత: పశ్చిమ బెంగాల్ ఉత్తర 24 పరగణ జిల్లాలో దత్తపుతూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోష్‌పోల్‌లో ఓ బాణసంచా ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో ఎనిమిది దుర్మరణం చెందగా, మరికొందరు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.
ఆదివారం ఉదయం 10గంటల సమయంలో కార్మికులు పనిలో ఉండగా పేలుడు సంభవించడంతో ఏడుగురు చనిపోయారు. మృతుల్లో మహిళా కార్మికులు కూడా ఉన్నారు. ప్రమాద తీవ్రతకు వారి మృతదేహాలు చిత్రమై శరీర భాగాలు వేర్వేరు ప్రాంతాలకు ఎగిరిపడ్డాయి.
ప్రమాద మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు. అధికారులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి.
చట్ట విరుద్దంగా సాగుతున్న బాణసంచా ఫ్యాక్టరీలో ఈ పేలుడు చోటుచేసుకుందని తెలుస్తుంది. పేలుడు తీవ్రతకు చుట్టుపక్కల భవనాలు కూడా దెబ్బతినగా ప్రజలు భయంతో పరుగులు తీశారు.