Numerology | ఈ ఏడు తేదీల్లో జన్మించిన వారు.. 2026లో ప్రభుత్వ కొలువు కొట్టేయడం ఖాయం..!
Numerology | మీరు బాగా చదివినా నిరుద్యోగిగా( Un Employee ) మిగిలిపోతున్నారా..? అయినా బాధ పడాల్సిన అవసరం లేదు. ఈ ఏడు తేదీల్లో జన్మించారా..? ఒక్కసారి చెక్ చేసుకోండి. ఈ ఏడు తేదీల్లో జన్మించిన వారు 2026 ఏడాదిలో ప్రభుత్వ కొలువు( Government Job ) కొట్టడం ఖాయమని న్యూమరాలజీ( Numerology ) నిపుణులు చెబుతున్నారు.
Numerology | జ్యోతిష్య శాస్త్రంలో సంఖ్యా శాస్త్రానికి( Numerology ) అత్యంత ప్రాధాన్యత ఉంది. పుట్టిన తేదీ, రోజు, సమయం బట్టి ఒక వ్యక్తి యొక్క భవిష్యత్‌ను అంచనా వేయొచ్చు. అయితే న్యూమరాలజీ ప్రకారం ఈ ఏడు తేదీల్లో జన్మించిన వారు తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగం( Government Job ) సాధించే అవకాశం ఉన్నదని న్యూమరాలజీ నిపుణులు చెబుతున్నారు.
కారణం ఇదే..
కొత్తగా రాబోయే 2026 ఏడాది సూర్యుడితో ముడిపడి ఉందని సంఖ్యా శాస్త్ర నిపుణులు పేర్కొంటున్నారు. ఈ కారణంగా సూర్య, శని, గురు గ్రహాల ప్రభావం అధికంగా ఉంటుందట. ఈ క్రమంలో ఈ ఏడు తేదీల్లో పుట్టిన వారి విషయంలో ఈ గ్రహాలు అనుకూలంగా పని చేస్తాయకట. దాంతో 2026లో తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తారట. ఇంతకీ ఆ ఏడు తేదీలు ఏవో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఆ ఏడు తేదీలు ఇవే..
12 నెలల్లో ఏ నెలతో కూడా సంబంధం లేకుండా.. 1,4,10,13,19,22,28 తేదీల్లో జన్మిస్తారో వారికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉందని న్యూమరాలజీ ఎక్స్‌పర్ట్ చెబుతున్నారు.
1, 10 తేదీల్లో జన్మించిన వారిపై సూర్యుడి అనుగ్రహం..
ముఖ్యంగా సూర్యుడి అనుగ్రహం వలన 1వ తేదీ, 10వ తేదీల్లో జన్మించిన వారు తప్పకుండా పోటీ పరీక్షల్లో విజయం సాధించి, మంచిమంచి ఉద్యోగాన్ని పొందుతారట. వీరు ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలంగా మలుచుకొని, కష్టపడి చదువుతారు. నిరంతరం కఠోరంగా శ్రమించి, ఉద్యోగాన్ని పొందే అవకాశం ఉందని సంఖ్యా శాస్త్ర నిపుణులు పేర్కొంటున్నారు.
4, 22 తేదీల్లో పుట్టిన వారిపై రాహు అనుగ్రహం..
ఇక 4, 22వ తేదీల్లో జన్మించిన వారిపై రాహు అనుగ్రహం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. అందువలన వీరు ఏ పని ప్రారంభించినా ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతుందట. చదువుపై శ్రద్ధ పెరుగుతుందట. చదువుకోవాలనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ప్రతి అంశం గురించి అవగాహన పెంచుకుంటారు. ఇతరుల కంటే భిన్నంగా ఆలోచించి, ప్రభుత్వ ఉద్యోగాన్ని తమ ఖాతాలో వేసుకుంటారని నిపుణులు పేర్కొంటున్నారు.
13, 19 తేదీల్లో జన్మించిన వారికి ఉద్యోగం సులభం..
13,19వ తేదీల్లో జన్మించిన వారు కొత్త ఏడాదిలో సులభంగా ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తారట. గవర్నమెంట్ కొలువు కోసం ఎంతో కాలం నుంచి కష్టపడుతున్న వీరిపై శని, సూర్య గ్రహాల అనుకూల దృష్టి ఉండడం మూలంగా ఈజీగా జాబ్ కొట్టేస్తారట. మొత్తానికి ఈ రెండు తేదీల్లో జన్మించిన వారికి అన్ని విధాలా కలిసి వస్తుందని న్యూమరాలజీ నిపుణులు చెబుతున్నారు.
28వ తేదీలో జన్మించిన వారిపై కూడా గురు గ్రహం అనుకూలత..
28వ తేదీలో జన్మించిన వారిపై గురు అనుకూలత ఎక్కువగా ఉంటుందట. వీరికి కష్టపడే తత్వం చాలా ఎక్కువగా ఉంటుంది. అందువలన న్యూమరాలజీ ప్రకారం ఈ తేదీల్లో జన్మించిన వారు 2026లో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించే అవకాశం ఎక్కువగా ఉందని న్యూమరాలజీ నిపుణులు చెబుతున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram