Vastu Tips | వంట గదిలో చేసే ఈ 5 తప్పులే.. అప్పుల పెరుగుదలకు కారణమట..!
Vastu Tips | వాస్తు నియమాల( Vastu Tips ) ప్రకారం ప్రతి ఒక్కరు తమ ఇంటిని నిర్మించుకుంటారు. ఇంటి నిర్మాణంలో వంట గదికి( Kitchen ) కూడా అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. వంట గది విషయంలో వాస్తు నియమాలు పాటించకపోతే ఆ ఇంట్లో అప్పులు( Debts ) పెరిగిపోవడం, కుటుంబ సభ్యులందరూ అనారోగ్యానికి గురవడంతో పాటు పలు సమస్యలు తలెత్తుతాయని వాస్తు పండితులు( Vastu Experts ) హెచ్చరిస్తున్నారు. మరి ముఖ్యంగా వంట గదిలో చేసే ఈ ఐదు తప్పుల వల్ల అప్పులు పెరిగిపోతాయని పండితులు హెచ్చరిస్తున్నారు.
Vastu Tips | భారతీయ సంస్కృతిలో ఇంటి నిర్మాణంలో వాస్తు శాస్త్రం కీలక పాత్ర పోషిస్తుంది. వాస్తు నియమాలు( Vastu Tips ) ఇంట్లోని ప్రతి మూలకు వర్తిస్తాయి. ముఖ్యంగా వంటగదిని( Kitchen ) ఇంట్లో అత్యంత ముఖ్యమైన ప్రదేశంగా పరిగణిస్తారు. వంటగది నిర్మాణం విషయంలో వాస్తు నియమాలను ఉల్లంఘిస్తే పేదరికం( Poverty ), అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు( Financial Problems ) పెరుగుతాయని వాస్తు పండితులు( Vastu Experts ) హెచ్చరిస్తున్నారు. మరి ముఖ్యంగా వంట గదిలో ఈ ఐదు తప్పులు చేయకూడదని, ఒకవేళ ఈ తప్పులు చేస్తే అప్పులు పెరిగిపోతాయని పండితులు హెచ్చరిస్తున్నారు. మరి ఆ తప్పులేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
మురికి పాత్రలు
రాత్రి వేళ కుటుంబ సభ్యులందరూ భోజనం చేసిన తర్వాత మురికి పాత్రలను అలాగే సింక్‌లో ఉంచకూడదు. ఇలా చేయడం వలన లక్ష్మీదేవికి కోపం వస్తుందట. అంతేకాకుండా మురికి పాత్రల వల్ల కీటకాలు, బ్యాక్టీరియా పెరిగి కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి మురికి పాత్రలను రాత్రి వేళనే కడిగేయడం వల్ల.. శుభ్రత పెరిగి.. లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందట.
విరిగిన పాత్రలు
చాలా మంది తమ వంట గదిలో అనేక రకాల పాత్రలను ఉంచుకుంటారు. ఇందులో కొన్ని విరిగిపోయిన పాత్రలు కూడా ఉంటాయి. ఈ విరిగిన పాత్రలు కుటుంబ, ఆర్థిక శ్రేయస్సును అడ్డుకుంటాయట. తలపెట్టిన పనులకు కూడా ఆటంకం ఏర్పడుతుందట. కాబట్టి విరిగిన వస్తువుల వాడకాన్ని తగ్గించడంతో పాటు వాటిని వంట గది నుంచి బయటకు పడేయాలని పండితులు సూచిస్తున్నారు. అప్పుడే ఇంట్లో సుఖసంతోషాలు ఉంటాయని అంటున్నారు.
చెత్తబుట్ట, చీపురు
ఇక చాలా మంది మహిళలు చీపురు, చెత్తబుట్టను కిచెన్‌లోనే ఉంచేస్తుంటారు. ఈ రెండింటిని వంట గదిలో ఉంచడం మంచిది కాదని పండితులు హెచ్చరిస్తున్నారు. అప్పులు పెరిగే అవకాశం ఉందట. కాబట్టి చీపురు, చెత్తబుట్టను కిచెన్‌లో కాకుండా ఇంట్లోని ఇతర ప్రదేశాల్లో ఉంచడం మంచిదని చెబుతున్నారు పండితులు.
స్టవ్ విషయంలో శుభ్రత
కిచెన్‌లోని స్టవ్ విషయాలు చాలా మంది అనేక పొరపాట్లు చేస్తుంటారు. స్టవ్‌ను శుభ్రంగా ఉంచుకోరు. ఈ నేపథ్యంలో వంట చేసే మహిళలకు చికాకు పెరుగుతుందట. తద్వారా అప్పులు కూడా అమాంతం పెరిగిపోతాయట. కాబట్టి స్టవ్‌ను నిత్యం పరిశుభ్రంగా ఉంచుకుంటే, ఆ ఇంట కూడా ప్రశాంత వాతావరణం ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఆర్థికంగా కూడా ఉన్నత శిఖరాలకు చేరుకుంటారట.
నీటి వృధా
వంట గదిలోని నల్లా నుంచి నీరు లీకేజీ కూడా ఆర్థిక సమస్యలకు కారణమవుతుందని పండితులు పేర్కొంటున్నారు. కిచెన్‌లో నీటి వృధా జరిగితే.. డబ్బు కూడా అలానే వృధా అవుతుందట. నీటిని ఎంత పొదుపుగా వాడుకుంటే.. డబ్బు కూడా అంత సమకూరుతుందని పండితులు చెబుతున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram