Lakshmi Devi | సాయంత్రం వేళ ఈ పనులు చేస్తున్నారా..? లక్ష్మీదేవికి కోపం వస్తుందట..!
Lakshmi Devi | ప్రతి ఇల్లు( House ) సిరిసంపదలతో( Money ) కళకళలాడాలని అందరూ కోరుకుంటారు. కానీ అది కొందరి నివాసాల్లో మాత్రమే సాధ్యమవుతుంది. లక్ష్మీదేవి( Lakshmi Devi )ని ఎవరైతే పరిపూర్ణంగా పూజిస్తారో వారికి మాత్రమే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

Lakshmi Devi | హిందువులందరూ లక్ష్మీ దేవి( Lakshmi Devi )ని సంపదల దేవతగా భావించి, ప్రత్యేక భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఇలా ఎంతో భక్తితో పూజించే వారు అప్పుడప్పుడు తప్పులు చేస్తుంటారు. ఏంటంటే.. సాయంత్రం( Evening ) వేళ ఇంట్లో చేయకూడని పనులు చేస్తుంటారు. అలా చేయడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుందట. దీంతో జీవితం దుఃఖంతో నిండిపోతుందని పండితులు చెబుతున్నారు. పొరపాటున ఈ పనులు చేస్తే.. భారీ నష్టాలు కలిగే అవకాశం ఉందట. మరి సాయంత్రం వేళ చేయకూడని పనులు ఏంటో తెలుసుకుందాం..
సాయంత్రం వేళ చేయకూడని పనులు ఇవే..
సాయంత్రం పూట నిద్రపోవడం సరైనది కాదు. సాయంత్రం వేళలో మంచం మీద పడుకోవద్దట.
వంట గదిలో ఉన్న పాత్రలను సాయంత్రం వేళ ఇతరులకు ఇవ్వొద్దు.
సాయంత్రం చీపురుతో ఇంటిని శుభ్రం చేయడం అశుభం.
సాయంత్రం వేళ ఇంట్లో గోర్లు కత్తిరించకూడదు.
సంధ్యా సమయంలో తులసి ఆకులను కూడా తెంపకూడదట.
సాయంత్రం పూట ఇంటిపై కూడా కూర్చోవద్దట.
రాత్రిపూట లేదా సూర్యాస్తమయం తర్వాత మీ జుట్టును ఎప్పుడు దువ్వొద్దట.
పైవన్నీ సాయంత్రం వేళ చేయడం వల్ల.. ఆ ఇంట్లో దురదృష్టం వెంటాడుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఇవన్నీ ఇంట్లో ప్రతికూల శక్తులను ఆకర్షించడంతో.. ఆర్థిక అస్థిరత, కష్టాలకు దారితీస్తుందని పండితులు చెబుతున్నారు. సో సాయంత్రం వేళ పొరపాటున కూడా ఇలాంటి పనులు చేయకండి.