Vastu Tips | బెడ్ కింద డ‌బ్బులు, బంగారం దాచుతున్నారా..? అయితే ద‌రిద్రం వెంటాడిన‌ట్టే..!

Vastu Tips | ప్ర‌తి ఒక్క‌రూ ఎంతోకొంతో.. న‌గ‌దు( Money ), బంగారం( Gold ) కూడ‌బెట్టుకుంటారు. ఇలా సంపాదించిన వారు.. డ‌బ్బు, బంగారాన్ని కంటికి రెప్ప‌లా కాపాడుకుంటారు. ఎల్ల‌ప్పుడూ త‌మ‌వ‌ద్ద ఉండాల‌నే ఆలోచ‌న‌తో.. వాటిని ద‌గ్గ‌ర్లోనే ఉంచుకుంటారు. కానీ అలా చేయ‌డం స‌రికాదు అంటున్నారు జ్యోతిష్య పండితులు.

Vastu Tips | బెడ్ కింద డ‌బ్బులు, బంగారం దాచుతున్నారా..? అయితే ద‌రిద్రం వెంటాడిన‌ట్టే..!

Vastu Tips | ఒక స‌గ‌టు మ‌నిషి కూడా త‌న కుటుంబాన్ని గొప్ప‌గా పోషించుకునేందుకు క‌ష్ట‌ప‌డుతుంటాడు. వ‌చ్చే ఆదాయంలో కొంత దాచి.. బంగారం( Gold ), వెండి( Silver ) ఆభ‌ర‌ణాల‌ను కొనుగోలు చేస్తుంటారు. ఎప్పుడు ఏ అవ‌స‌రం వ‌స్తుందోన‌ని కొంత న‌గ‌దు( Money ) కూడా దాచి పెడుతుంటారు. ఇలా కూడ‌బెట్టిన న‌గ‌దుతో పాటు బంగారు ఆభ‌ర‌ణాల‌ను బీరువాలో కాకుండా.. త‌మ మంచం బెడ్( Bed ) కింద దాచి పెడుతుంటారు. ఇలా దాచిపెట్ట‌డం స‌రికాద‌ని జ్యోతిష్య పండితులు హెచ్చ‌రిస్తున్నారు. పరుపుల కింద న‌గ‌దు, బంగారం దాచిపెట్ట‌డం కార‌ణంగా ఆ ఇంటి య‌జ‌మానిని ద‌రిద్రం వెంటాడుతుంద‌ని చెబుతున్నారు.

న‌గ‌దు, బంగారంతో పాటు బెడ్ కింద ఏం ఉంచ‌కూడ‌దు..?

  • ఇంకా కొంతమంది తెలియక మంచం కింద కొన్ని వస్తువులు పెడుతుంటారు. అలా ఉంచడం వల్ల లక్ష్మీ దేవత చూపు మీపైన ప్రసరించకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోతుందని చెబుతున్నారు. డబ్బులను మంచం, పరుపులు, దిండుల కింద పెడితే లక్ష్మీ దేవి అనుగ్రహం తగ్గిపోతుందంటున్నారు. బంగారు ఆభరణాలను కూడా దిండు, మంచం కింద పెట్టకూడదని తెలుపుతున్నారు.
  • మంచం కింది భాగంలో చెప్పులు( Chappal ), షూలు( Shoes ), సాక్సులు లాంటివి ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడదన్నారు.
  • దేవత చిత్రపటాలు, పితృదేవతల ఫొటోలు మంచం కింద పెట్టకూడదని చెబుతున్నారు. ఇలా చేస్తే వారి అనుగ్రహం తగ్గిపోతుందని వివరిస్తున్నారు.
  • గాజు సీసాలను మంచం కింద పెట్టడం వల్ల లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుందని చెబుతున్నారు.
  • ఇనుప వస్తువులు మంచం కింద పెడితే శని దేవుడు ఆగ్రహించి.. దోషాలు చుట్టుకుంటాయని హెచ్చరిస్తున్నారు.
  • నూనె సీసాలు కూడా ఎట్టి పరిస్థితుల్లో మంచం కింద పెట్టకూడదని చెబుతున్నారు. ఇలా పెట్టడం వల్ల జాతక శని, రాశి శని దోషాలు పెరిగి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని అంటున్నారు.