Aries Astrology | ఉగాది తర్వాత మేషరాశివారికి మిశ్రమ ఫలితాలే..! స్థిరాస్తి విషయాల్లో గొడవలు తప్పవు..!!
Aries Astrology | మేషరాశి( Aries ) వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం( sri viswavasu nama samvatsara )లో మిశ్రమ ఫలితాలు ఉండబోతున్నాయి. కొంతకాలం జయాలు.. కొంతకాలం అపజయాలు.. కొంతకాలం కష్టాలు.. కొంతకాలం నష్టాలు సంభవించనున్నాయి. తెలుగు కాలమాన సంవత్సరం( Telugu Calendar ) ప్రకారం.. గురు గ్రహం వలన అంత అనుకూల ఫలితాలు ఏర్పడవు.

Aries Astrology | మేషరాశి( Aries ) వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం( sri viswavasu nama samvatsara )లో మిశ్రమ ఫలితాలు ఉండబోతున్నాయి. కొంతకాలం జయాలు.. కొంతకాలం అపజయాలు.. కొంతకాలం కష్టాలు.. కొంతకాలం నష్టాలు సంభవించనున్నాయి. తెలుగు కాలమాన సంవత్సరం( Telugu Calendar ) ప్రకారం.. గురు గ్రహం వలన అంత అనుకూల ఫలితాలు ఏర్పడవు. మార్చి 30 నుంచి అక్టోబర్ 19 వరకు కుటుంబ పరమైన విషయాల వలన అధిక ధన వ్యయం ఎదుర్కొంటారు. తండ్రి వర్గం వారితో స్థిరాస్థి సంబంధ విషయాలలో గొడవలు తప్పవు. కోర్టు తీర్పులు మీకు వ్యతిరేకంగా ఉంటాయి. ధన వ్యయాన్ని ఎంతగా అదుపులో ఉంచుకోవటానికి ప్రయత్నించినా తప్పనిసరి భాద్యతలకు ధనం ఖర్చు పెట్టవలసి వస్తుంది. ప్రైవేటు రంగంలో ఉద్యోగ జీవనం చేయువారికి ఆకస్మిక నష్టములు ఎదురవడానికి సూచనలు అధికంగా ఉన్నాయి.
20 అక్టోబర్ 2025 నుండి 5 డిసెంబర్ 2025 వరకు మేషరాశి వారికి గురువు కొంత అనుకూల ఫలితాలు ప్రసాదిస్తారు. ముఖ్యంగా విద్యార్దులకు, ప్రభుత్వ ఉద్యోగులకు, రాజకీయ రంగం వారికి, విదేశాల్లో నివాస ప్రయత్నములు చేయువారికి కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. ఈ కాలంలో ఉద్యోగస్తులు ప్రమోషన్లు అశించవచ్చు. నూతన పదవులు, సన్మానాలు పొందుతారు. 6 డిసెంబర్ 2025 నుండి 18 మార్చి 2026 వరకు గురు గ్రహం యొక్క ప్రతికూల ప్రభావం వలన కుటుంబ జీవనంలో సమస్యలు ఎదురగును. భాత్రు వర్గీయులతో మనస్పర్ధలు ఎదురగును. నిరుద్యోగుల ప్రయత్నాలకు అదృష్టం అవసరం. మొత్తం మీద శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మేషరాశి వారికి గురువు అధిక భాగం ప్రతికూల ఫలితాలు ఏర్పరచును. వ్యక్తిగత జాతకంలో గురు గ్రహ బలం పూర్తిగా లోపించిన వారు జాగ్రత్తగా ఉండవలెను.
మేషరాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో శని గ్రహం వలన సంవత్సరం అంతా ప్రతికూల ఫలితాలు ఎదురగును. ఏలినాటి శని ప్రభావం వలన ఆరోగ్య సమస్యలు, అధిక ధనవ్యయం, వ్యాపార వర్గం వారికి నష్టములు, రియల్ ఎస్టేట్ రంగం వారికి తీవ్ర ప్రతికూలత ఎదురగును. చేతికి రావలసిన ధన లాభములు ఆఖరి నిముషములో చేజారి పోవును. ముఖ్యంగా ఈ సంవత్సరంలో మే మాసంలో శని యొక్క ప్రతికూల ప్రభావం అధికంగా ఉంటుంది. వ్యక్తిగత జాతకంలో కుజ గ్రహ మరియు శని గ్రహ దోషం ఉన్న వారికి కోర్టు వ్యవహారాలలో లేదా చట్ట రీత్యా బంధన యోగం ఎదురగు సూచనలు అధికంగా ఉన్నవి. తగవులందు రాజీ పడడం మంచిది. మొత్తం మీద మేషరాశి వారు ఈ సంవత్సరం తరచుగా శనికి తైలాభిషేకములు, జపములు జరిపించుకోనుట మంచిది.
మేషరాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో రాహు గ్రహం వలన 18 మే 2025 వరకు వ్యతిరేక ఫలితాలు ఎదురగును. మానసికంగా బాధ పడవలసిన, అవమానములు పొందవలసిన పరిస్టితులు ఎదురగును. 19 మే 2025 నుండి అతి చక్కటి అనుకూల ఫలితాలు ప్రసాదించును. రాబడి కొంత పెరుగుతుంది. వ్యయాన్ని ఒక వంతు తగ్గించుకోనగలుగుతారు. రాహు గ్రహ అనుగ్రహం వలన సంతాన దోషాలు తొలగి సంతాన ప్రయత్నాలు ఫలిస్తాయి. మొత్తం మీద మేషరాశి వారు ఈ సంవత్సరం రాహు గ్రహం వలన అధిక భాగం అనుకూల ఫలితాలనే పొందుతారు.
మేషరాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో కేతు గ్రహం వలన సంవత్సరం అంతా అనుకూల ఫలితాలు ఏర్పడును. ముఖ్యంగా సెప్టెంబర్ నుండి నవంబర్ మధ్య కాలంలో దీర్గకాళిక రుణాలు తీర్చివేస్తారు. అవివాహితుల వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. భరణీ నక్షత్ర జాతకులకు కుటుంబ సమస్యలు తగ్గుతాయి. వ్యక్తిగత విషయాలలో ఆనందకర సంఘటనలు ఎదురగును. మొత్తం మీద మేషరాశి వారికి ఈ సంవత్సరం కేతు గ్రహం వలన చక్కటి లాభములు ఎదురగును. ఈ సంవత్సరం మేషరాశి కి చెందిన కాల సర్ప దోష జాతకులకు సర్ప దోష ప్రభావం కూడా కొంత తగ్గును.
అశ్విని నక్షత్రం 1,2,3,4 పాదములు లేదా భరణి నక్షత్రం 1,2,3,4 పాదములు లేదా కృత్తిక నక్షత్రం 1వ పాదములో జన్మించినవారు మేషరాశికి చెందును.
2025 – 2026 శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మేషరాశి వారికి ఆదాయం – 02, వ్యయం – 14 , రాజ పూజ్యం – 05, అవమానం – 07.
పూర్వ పద్దతిలో మేషరాశి వారికి వచ్చిన శేష సంఖ్య “7” . ఇది శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మీరు ఎదుర్కోనబోయే మిశ్రమ ఫలితాలు అనగా కొంత కాలం విజయాలు, కొంత కాలం అపజయాలు … కొంత కాలం లాభములు, కొంత కాలం నష్టములు పొందుటను సూచించుచున్నది.