Astrology Tips | యాలకులతో కుబేరులు అయిపోవచ్చు..! అదేలాగో తెలుసా..?
Astrology Tips | ప్రతి ఒక్కరి జీవితం ఆర్థికాంశాలతో( Financial Issues ) ముడిపడి ఉంటుంది. ప్రధానంగా చాలా మందిని అప్పులు( Debts ) పీడిస్తుంటాయి. తద్వారా మానసికంగా కుంగిపోయి.. క్షణికావేశంలో ఆత్మహత్యలకు( Suicides ) పాల్పడుతుంటారు. అలాంటి వారు కాస్త ఆధ్యాత్మికత( Spiritual ) వైపు దృష్టి సారిస్తే అప్పుల నుంచి విముక్తి పొంది సంపద సమకూరి కుబేరులు( Richest People ) అయిపోవచ్చు అని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అది కూడా మనం నిత్యం ఇంట్లో ఉపయోగించే యాలకులతో. మరి యాలకులతో( Cardamom ) ఎలా కుబేరులు అయిపోవచ్చు ఈ కథనంలో తెలుసుకుందాం.

Astrology Tips | ప్రతి వంటింట్లో యాలకులు( Cardamom ) ఉంటాయి. ఈ యాలకులను ఆయుర్వేదానికి ఉపయోగించడమే కాకుండా.. రుచి కోసం అన్ని వంటకాల్లో వినియోగిస్తుంటారు. వంటింట్లో ఎంతో ప్రాధాన్యత కలిగిన ఈ యాలకులకు అప్పుల( Debts ) నుంచి విముక్తి చేసే శక్తి ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఆర్థిక సమస్యలతో( Financial Issues ) సతమతమవుతూ.. అప్పులతో బాధపడేవారు యాలకులతో ఈ చిన్న పరిహారం చేస్తే.. అష్టైశ్వరాలు, సంపద సమకూరి కుబేరులు( Richest People ) అయిపోవడం ఖాయమని అంటున్నారు పండితులు. ఆ పరిహారం ఏంటంటే.. త్రికోణ యాలకుల దీప ఉపాయం( Trikona Yalakula Deepa Upayam ). ఈ ఉపాయం ఆర్థిక ఇబ్బందులను దూరం చేస్తుందని నమ్ముతారు. దీనిని శుక్రవారం నాడు చేస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని పండితులు చెబుతున్నారు.
యాలకులే ఎందుకు వినియోగించాలి..?
ఆయుర్వేదంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన యాలకులను శుక్ర గ్రహానికి సంబంధించినవిగా భావిస్తారు. అంటే శుక్రుడు సుఖం, సంపద, ప్రేమ, ఐశ్వర్యానికి కారకుడు. శుక్రుడికి ఎంతో ఇష్టమైన యాలకులతో పరిహారం చేస్తే.. మనం కుబేరులం అయిపోవచ్చని పండితుల నమ్మకం. ఈ ఉపాయం కోసం సరిగ్గా 108 యాలకులు వాడాలని.. తద్వారా శుక్ర గ్రహం వల్ల కలిగే దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
ఉపాయం చేసే విధానం ఇలా..
ఒక పరిశుభ్రమైన పాత్ర అనగా వెండి పళ్లెంను తీసుకోవాలి. అందులో కుంకుమ పువ్వుతో ఒక త్రికోణం గీయాలి. త్రికోణం మధ్యలో బియ్యంతో ‘శ్రీం’ అనే అక్షరం రాయాలి. ఆ తర్వాత మరో పాత్రలో 108 యాలకులు తీసుకోవాలి. ఇక త్రికోణం పక్కన మూడు దీపాలను ఆవు నెయ్యితో వెలిగించాలి. దీపం వెలిగించిన అనంతరం.. ఒక్కో యాలకును తీసుకుంటూ ‘శ్రీం’ అక్షరంపై పెట్టాలి. అదే సమయంలో “ఓం శ్రీం దైన్య భేదన్య స్వాహా:” అనే మంత్రాన్ని జపించాలి. ఇదే మంత్రాన్ని 108 సార్లు జపిస్తూ, 108 యాలకులను ‘శ్రీం’ అక్షరంపై ఉంచాలి. తరువాత హారతి ఇవ్వాలి.
మళ్లీ మరుసటి రోజు కూడా..
ఈ యాలకులను ఒక ఎర్రటి గుడ్డలో మూటగా కట్టండి. దానిని ఒక గాజు పాత్రలో దాచి ఉంచండి. మరుసటి రోజు అదే విధంగా పూజ చేయండి. ఇలా వరుసగా 21 రోజులు చేయాలి. 21 రోజుల తర్వాత ఆ యాలకులను ఒక సంవత్సరం పాటు గాజు పాత్రలో దాచి ఉంచండి. ఒక సంవత్సరం తర్వాత ఆ యాలకులను ప్రవహించే నది నీటిలో వేయండి. ఈ ఉపాయం ఆర్థిక సమస్యలను దూరం చేస్తుందని పండితులు చెబుతున్నారు.