Atla Tadde Festival | కళ్యాణం, సంతాన ప్రాప్తి కలిగించే ‘అట్ల తద్ది’ పండుగ నేడే.. పూజా విధానం ఇదే..!
Atla Tadde Festival | హిందూ సంప్రదాయం( Hindu Tradition )లో నిర్వహించుకునే ప్రతి పండుగకు( Festival ) ఒక ప్రత్యేక విశిష్టత ఉంది. ఈ పండుగలు హిందువుల కుటుంబాల్లో గొప్ప సహృద్భవ వాతావరణాన్ని తీసుకొస్తాయి. ఇక ఆ ఇంట సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. పండుగల సందర్భంగా చేసే వ్రతాలు( Vratham ), నోములు( Nomu ) కొన్ని సమస్యలకు పరిష్కారం కూడా చూపిస్తాయి.
Atla Tadde Festival | హిందూ సంప్రదాయం( Hindu Tradition )లో నిర్వహించుకునే ప్రతి పండుగకు( Festival ) ఒక ప్రత్యేక విశిష్టత ఉంది. ఈ పండుగలు హిందువుల కుటుంబాల్లో గొప్ప సహృద్భవ వాతావరణాన్ని తీసుకొస్తాయి. ఇక ఆ ఇంట సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. పండుగల సందర్భంగా చేసే వ్రతాలు( Vratham ), నోములు( Nomu ) కొన్ని సమస్యలకు పరిష్కారం కూడా చూపిస్తాయి. మరి ముఖ్యంగా యువతులు భర్తలను( Husbands ) పొందడానికి, పెళ్లైన తర్వాత సంతానం పొందేందుకు ఎన్నో రకాల వ్రతాలు, నోములు ఉన్నాయి. అయితే కళ్యాణం, సంతాన ప్రాప్తి కలిగించేందుకు ఒక ప్రత్యేక పండుగ ఉంది. మరి ఆ పండుగ ఏంటి..? ఎప్పుడు నిర్వహించాలో తెలుసుకుందాం.
హిందూ సంప్రదాయంలో అట్ల తద్ది పండుగకు( Atla Tadde Festival ) ఎంతో ప్రత్యేకత ఉంది. కళ్యాణం( Marriage ), సంతాన( Childrens ) ప్రాప్తి కోసం ఈ పండుగను నిర్వహిస్తారు. ప్రతి ఏడాది ఆశ్వయుజ బహుళ తదియ రోజున అట్ల తద్ది( Atla Tadde ) పండుగ జరుపుకుంటారు. ఈ ఏడాది అక్టోబర్ 20న అట్ల తద్ది పండుగ వచ్చింది. ఆదివారం ఉదయం సూర్యోదయంతో ఈ పండుగ ప్రారంభమవుతుంది. ఇక అట్ల తద్ది పండుగ రోజున ఆడపిల్లలు అందరూ ఒకచోటకు చేరుకుంటారు. చేతుల గోరింటాకు పెట్టుకుని పండుగ కార్యక్రమాల్లో నిమగ్నమైపోతారు.
కన్నెపిల్లలు జరుపుకునే పండుగల్లో అట్లతద్ది ఒకటి..
కన్నెపిల్లలు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో అట్లతద్ది ఒకటి. ఎందుకంటే.. మంచి భర్త దొరకాలని, పెళ్లాయ్యక భర్త ఆయురారోగ్యాలతో ఉండాలని, సంతానం కలగాలని అవివాహిత యువతులు అట్ల తద్ది వ్రతాన్ని ఆచరిస్తారు. ఒకసారి ఈ పూజ మొదలు పెట్టి వివాహమైన తర్వాత పదేళ్లపాటు తప్పనిసరిగా ఈ పూజను చేసి, పది సంవత్సరాల తర్వాత ఉద్యాపన చేస్తారు. అంటే చివరి సారి పూజ చేసి ముత్తైదువులను పిలిచి వాయనాలిచ్చి కన్నుల పండువగా ముగిస్తారు.
కుజదోషాన్ని పోగొట్టే అట్లతద్ది
జాతకం ప్రకారం కుజ దోషం ఉంటే వివాహం ఆలస్యం కావడం, సంతానం కలగక పోవడం, గర్భదోషాలు వంటివి ఏర్పడతాయి. అట్లతద్ది వ్రతం చేసుకోవడం వలన కుజ దోషం తొలుగుతుంది. అట్లతద్ది పండగలో అట్లను అమ్మవారికి నైవేద్యంగా పెట్టడంలో ఒక అంతరార్థం ఉంది. నవ గ్రహాలలో కుజుడుకీ అట్లంటే మహాప్రీతి. అట్లను నైవేద్యంగా పెడితే కుజ దోషం పరిహారమై సంసారంలో ఎలాంటి ఆటంకాలు రావని నమ్ముతారు. అంతేకాదు కుజుడు రజోదయానికి కారకుడు. రుతు చక్రం సక్రమంగా ఉంచి రుతు సమస్యలు రాకుండా కాపాడుతాడు. దీంతో గర్భధారణలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని శాస్త్రవచనం.
అట్ల తద్ది పూజా విధానం
అట్ల తద్ది రోజున తెల్లవారుజామునే మేల్కొని తలంటి స్నానమాచరించాలి. ఉపవాసం ఉండి ఇంట్లో తూర్పు దిక్కున మండపాన్ని ఏర్పాటు చేసి గౌరీదేవిని పూజించాలి. ముందుగా ధూప, దీప, నైవేద్యాలు సమర్పించి, వినాయక పూజ తర్వాత గౌరీ స్తోత్రం, శ్లోకాలు పఠించాలి. సాయంత్రం చంద్ర దర్శనం అనంతరం తిరిగి గౌరీ పూజ చేసి 10 అట్లు నైవేద్యంగా పెట్టాలి. అనంతరం ముత్తైదువులను సుమంగళి ద్రవ్యాలతో అలంకరించి పది అట్లు, పది పండ్లు వాయినంగా సమర్పిస్తారు. అట్లతద్ది నోము కథ చెప్పుకుని, అక్షతలు వేసుకోవాలి. ముత్తైదువులకు నల్లపూసలు, లక్కకోళ్ళు, రవిక గుడ్డలు, దక్షిణ తాంబూలాలు ఇచ్చి భోజనాలు పెట్టి తామూ భోజనం చేయాలి.
అట్లతద్ది వెనుక ఉన్న పురాణగాథ
అట్ల తద్ది వెనుక ఉన్న పురాణం విశేషమేమిటంటే త్రిలోక సంచారి నారదుడి ప్రోద్బలంతో శివుని తన పతిగా పొందడానికి పార్వతీదేవి తొలుత చేసిన విశిష్టమైన వ్రతమే ఈ అట్లతద్ది పండుగ అని, స్త్రీలు తమ సౌభాగ్యం కోసం చేసుకునే వ్రతం అట్లతద్ది వ్రతం అని నారద పురాణం ద్వారా మనకు తెలుస్తుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram