Pumpkin | ఇంట్లో నెగిటివ్ ఎన‌ర్జీ అయినా.. ఒంట్లో అనారోగ్య‌మైనా.. ఆ ఒక్క కాయ‌తో ప‌రార్..!

Pumpkin | మ‌నం నివాస‌ముంటున్న ఇంటి మీద న‌ర‌దృష్టి ప‌డ‌కుండా చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటాం. ఒక‌వేళ ఇంటి మీద న‌ర‌దృష్టి ప‌డితే మ‌నం ఎంత క‌ష్ట‌పడి సంపాదించినా అదంతా వృథా అయిపోతుంది. రాత్రింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డ‌డంతో అనారోగ్యానికి కూడా గుర‌వుతుంటాం. కొన్ని సంద‌ర్భాల్లో న‌ర‌దృష్టి వ‌ల్ల జ‌ర‌గ‌రాని సంఘ‌ట‌ల‌ను కూడా జ‌రుగుతుంటాయి. అందుకే ఇలాంటి ప్ర‌తికూల ప‌రిస్థితులు ఏర్ప‌డ‌కుండా.. ముఖ్యంగా ఇంటి ప్రధాన ద్వారానికి గుమ్మడికాయ కడతారు.

Pumpkin | ఇంట్లో నెగిటివ్ ఎన‌ర్జీ అయినా.. ఒంట్లో అనారోగ్య‌మైనా.. ఆ ఒక్క కాయ‌తో ప‌రార్..!

Pumpkin | మ‌నం నివాస‌ముంటున్న ఇంటి మీద న‌ర‌దృష్టి ప‌డ‌కుండా చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటాం. ఒక‌వేళ ఇంటి మీద న‌ర‌దృష్టి ప‌డితే మ‌నం ఎంత క‌ష్ట‌పడి సంపాదించినా అదంతా వృథా అయిపోతుంది. రాత్రింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డ‌డంతో అనారోగ్యానికి కూడా గుర‌వుతుంటాం. కొన్ని సంద‌ర్భాల్లో న‌ర‌దృష్టి వ‌ల్ల జ‌ర‌గ‌రాని సంఘ‌ట‌ల‌ను కూడా జ‌రుగుతుంటాయి. అందుకే ఇలాంటి ప్ర‌తికూల ప‌రిస్థితులు ఏర్ప‌డ‌కుండా.. ముఖ్యంగా ఇంటి ప్రధాన ద్వారానికి గుమ్మడికాయ కడతారు. గుమ్మడికాయ గుమ్మానికి ఉంటే వుంటే కాలభైరవుడు రక్షణగా ఉన్నట్టేనని.. ఎలాంటి ప్రతకూల శక్తి లోనికి ప్రవేశించద‌ని న‌మ్మ‌కం. అలా ఒక్క గుమ్మ‌డి కాయ‌తో ఇంట్లో నెగిటివ్ ఎన‌ర్జీ.. ఒంట్లో అనారోగ్యం ప‌రార్ అయిపోతాయ‌నేది భ‌క్తుల విశ్వాసం.

ఇంట్లో నెగిటివ్ ఎన‌ర్జీని త‌రిమేసేందుకు..

ఇక కొత్తిల్లు గృహ ప్ర‌వేశం స‌మ‌యంలో గుమ్మ‌డికాయ‌ను ఆ ఇంటి ప్ర‌ధాన ద్వారం వ‌ద్ద కడుతుంటారు. లేదంటే అమావాస్య‌, మంగ‌ళ‌వారం, బుధ‌వారం రోజుల్లో కూడా ప్ర‌త్యేక పూజ‌లు చేసి గుమ్మ‌డికాయ‌ను క‌డుతుంటారు. బూడిద గుమ్మడికాయను తీసుకొచ్చి కడిగి పసుపు రాసి కుంకుమబొట్టు పెట్టి దానిపై ఓంకారం, స్వస్తిక్ గుర్తును దిద్దుతారు. అనంత‌రం పూజామందిరంలో పెట్టి పూజచేసి మంచి సమయం చూసి ఇంటి ద్వారం వ‌ద్ద‌ కడతారు. ఇలా కట్టేటప్పుడు ఓం కాలభైరవాయ నమ: అని అంటారు. నిత్యం ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత ఆ బూడిద గుమ్మడికాయకు ధూపం వేస్తే చెడు దృష్టి ఇంట్లో అడుగుపెట్టదని పండితులు చెబుతారు. గుమ్మడికాయ కుళ్లిపోతే దాన్ని వెంటనే తీసేసి మరొకటి తీసుకొచ్చి పూజచేసి కట్టుకోవచ్చు. గ్రహణాలు, ఇంట్లో పురుడు, మైల వచ్చిన సందర్భాల్లో గుమ్మడికాయ తన శక్తిని కోల్పోతుందని ఆ సమయంలో కూడా పాతది తీసేసి మరొకటి తీసుకొచ్చి కట్టాలంటారు. ఇలా చేయ‌డం వ‌ల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎన‌ర్జీ వెళ్లిపోయి.. ఎవ‌రి న‌ర‌దృష్టి ఆ ఇంటి మీద ప‌డ‌కుండా ఆ ఇల్లు సుఖ‌సంతోషాల‌తో విరాజిల్లుతుంది.

ఒంట్లో అనారోగ్యానికి ఎంతో మేలు..

గుమ్మడికాయ ప్రతికూల శక్తులను , దృష్టి దోషాలను తరిమేసేందుకు మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదంటారు ఆరోగ్య నిపుణులు. శతాబ్దాలుగా ఆయుర్వేదంలో ఔషధంగా వాడుతున్న బూడిద గుమ్మడికాయలో 96 శాతం నీరు, 4 శాతం ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, జింక్, కాల్షియమ్, ఐరన్, విటమిన్ బి1, బి 2, బి3, బి5, బి6, విటమిన్ సి ఉంటాయి. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించే శక్తి, శరీరంలో వ్యర్థ్యాలను బయటకు తొలగించే శక్తి బూడిదగుమ్మడికాయకు ఉందని చెబుతారు. లివర్ పనితీరు మెరుగుపచ్చి జీవక్రియను మెరుగుపరుస్తుంది. గుమ్మ‌డి కాయ ఫ్రీ రాడికల్స్‌తో పోరాడే శక్తినిస్తుంది.. ఫలితంగా క్యాన్సర్ లాంటి దీర్ఘకాలిన వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది. సంతానానికి సంబంధించిన సమస్యలు కూడా నివారించే శక్తి బూడిదగుమ్మడికాయకు ఉంది. అనారోగ్యాన్ని మాత్రమే కాదు చర్మ సౌందర్యాన్ని పెంచడంలోనూ బూడిదగుమ్మడికాయ ఉపయోగపడుతుంది.