తిరుమల భక్తులకు బిగ్‌ షాక్‌..! ఆన్లైన్ టికెట్‌ ప్రయాణాలు వాయిదా..

విధాత: తిరుమల భక్తులకు టీటీడీ పాలక మండలి బిగ్‌ షాక్‌ ఇచ్చింది. ఆన్లైన్ లో టిక్కెట్లు బుక్ చేసుకున్న భక్తులు తమ ప్రయాణాన్ని వారం రోజులు వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేస్తు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ప్రకటన చేశారు. దర్శన టిక్కెట్లు రీ షేడ్యూల్ చేసుకునే వెసులుబాటును త్వరలోనే కల్పిస్తామని హామీ ఇచ్చారు. 20 సంవత్సరాలలో ఎన్నడు లేని విధంగా తిరుమలలో గత 15 రోజులుగా వర్షాలు కురిశాయని.. కొండ చరియలు విరిగిపడడంతో నాలుగు ప్రాంతాల్లో […]

తిరుమల భక్తులకు బిగ్‌ షాక్‌..! ఆన్లైన్ టికెట్‌ ప్రయాణాలు వాయిదా..

విధాత: తిరుమల భక్తులకు టీటీడీ పాలక మండలి బిగ్‌ షాక్‌ ఇచ్చింది. ఆన్లైన్ లో టిక్కెట్లు బుక్ చేసుకున్న భక్తులు తమ ప్రయాణాన్ని వారం రోజులు వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేస్తు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ప్రకటన చేశారు. దర్శన టిక్కెట్లు రీ షేడ్యూల్ చేసుకునే వెసులుబాటును త్వరలోనే కల్పిస్తామని హామీ ఇచ్చారు.

20 సంవత్సరాలలో ఎన్నడు లేని విధంగా తిరుమలలో గత 15 రోజులుగా వర్షాలు కురిశాయని.. కొండ చరియలు విరిగిపడడంతో నాలుగు ప్రాంతాల్లో రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయని ఆయన వెల్లడించారు. కొండ చరియలు విరిగి పడే ప్రాంతాలను గుర్తించేందుకు ఢిల్లీ నుంచి ఐఐటీ నిపుణులను రప్పిస్తున్నామని తెలిపారు.

ఇటువంటి ఘటనలు పునరావృతం కాకూండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే రెండో ఘాట్ రోడ్డులో మరమ్మతు పనులుకు సమయం పట్టే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం మొదటి ఘాట్ రోడ్డులోనే వాహన రాకపోకలకు అనుమతిస్తామని వెల్లడించారు.