Ugadi Rasi Phalau 2025 | కర్కాటక రాశి వారికి ఈ నాలుగు నెలలు ప్రతికూలమే..! జర జాగ్రత్త..!!
Ugadi Rasi Phalau 2025 | కర్కాటక రాశి( Cancer ) వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం( Sri Viswavasu Nama Samvatsara )లో అనగా 30 మార్చి 2025 నుండి 18 మార్చి 2026 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరం( Telugu Calendar )లో గురు గ్రహం వలన మిశ్రమ ఫలితాలు ఎదురగును.

Ugadi Rasi Phalau 2025 | కర్కాటక రాశి( Cancer ) వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం( Sri Viswavasu Nama Samvatsara )లో అనగా 30 మార్చి 2025 నుండి 18 మార్చి 2026 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరం( Telugu Calendar )లో గురు గ్రహం వలన మిశ్రమ ఫలితాలు ఎదురగును. మధ్య మధ్య యోగ వంతమైన అనుకూల ఫలితాలు, మధ్య మధ్య ప్రతికూల ఫలితాలు పొందుతారు.
15 మే 2025 వరకు ఆర్ధిక పరంగా అనుకూలత ఉంటుంది. వ్యాపార పరంగా భారీ పెట్టుబడులు పెట్టుటకు ఇది అనుకూలమైన కాలం. కోర్టు విషయాల్లో న్యాయ పరమైన అడ్డంకులు అన్ని తొలగును. శత్రువులపై విజయం లభిస్తుంది. ఈ కాలంలో మిక్కిలి న్యాయవంతంగా విశేష ధనార్జన చేయగలుగుతారు.
16 మే 2025 నుండి 19 అక్టోబర్ 2025 వరకు గురు గ్రహం వలన తీవ్ర ప్రతికూల ఫలితాలు పొందుతారు. ధర్మ కార్య సంబంధ వ్యయం అధికం అవుతుంది. పితృ వర్గానికి కూడా మంచిది కాదు. వారసత్వ పరంగా పొందిన సంపదల విషయంలో జాగ్రత్తగా ఉండవలెను. అనవసరమైన శత్రుత్వాలు ఎదుర్కొనవలసి వస్తుంది.
20 అక్టోబర్ 2025 నుండి 5 డిసెంబర్ 2025 వరకు కర్కాటక రాశి వారు తిరిగి అనుకూల ఫలితాలు పొందుతారు. ఈ కాలం సంపూర్ణంగా యోగవంతమైన జీవితాన్ని ప్రసాదించును. విద్య పరంగా, ఉద్యోగ పరంగా స్థిరత్వానికి ప్రయత్నిస్తున్న వారికి ఈ కాలం అత్యంత అనుకూల కాలం.
6 డిసెంబర్5 202 నుండి 18 మార్చ్ 2026 వరకు ప్రతికూల ఫలితాలు పొందుతారు. ఏ విధంగానూ గురు గ్రహం యొక్క బలం జాతకులకి లభించదు. జాతకంలో గురు గ్రహ బలం పూర్తిగా లోపించిన వారు పైన తెలియచేసిన ప్రతికూల కాలములలో గురు గ్రహ శాంతులు జరిపించుకోనుట మంచిది.
కర్కాటక రాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో శని గ్రహం వలన సంవత్సరం అంతా ప్రతికూల ఫలితాలు ఎదురగును. ఆరోగ్య పరంగా, వైవాహిక సంతాన విషయ పరంగా, పితృ వర్గ పరంగా ఈ సంవత్సరం శనైచ్చారడు కర్కాటక రాశి వారికి ఇబ్బందులు కలుగ చేస్తారు. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఏలినాటి శని లేనప్పటికీ గోచార రీత్యా తీవ్ర వ్యతిరేక స్థానంలో ఉండడం వలన తరచుగా శనికి నల్ల నువ్వుల తైలాభిషేకం చేయించుకొనుట మంచిది. శనివారములు పగటి పూట ఉపవాశం ఆచరించుట మంచిది. కర్కాటక రాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఏలినాటి శని దశ లేదు.
కర్కాటక రాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో రాహు గ్రహం వలన 18 మే 2025 వరకు అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. వైద్య రంగంలోని వారికి ఈ కాలం చక్కటి ఆర్ధిక లాభాలను కలుగచేస్తుంది. వాహన క్రయ విక్రయాలు లాభిస్తాయి. 19 మే 2025 నుండి ప్రతికూల ఫలితాలు ప్రారంభం అవుతాయి. తలపెట్టిన ప్రతీ కార్యక్రమం కోసం మిక్కిలి శ్రమించవలసి వస్తుంది. ఆరోగ్య ధృడత్వం తగ్గుతుంది. అనవసర శత్రుత్వాలు, ఆర్ధిక సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది.
కర్కాటక రాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో కేతు గ్రహం వలన కూడా మిశ్రమ ఫలితాలు ఎదురగును. 18 మే 2025 వరకు పూర్తి అనుకూల ఫలితాలు పొందుతారు. అన్ని విధములా బాగుండును. 19 మే 2025 నుండి రాహు గ్రహం వలనే ప్రతికూల ఫలితాలు ప్రసాదించును. ముఖ్యంగా వ్యక్తిగత జాతకంలో కాల సర్ప దోషం కలిగి ఉన్నవారు అధికంగా ఇబ్బందులు ఎదుర్కొనవలసి రావచ్చు. కాల సర్ప దోషం కలిగిన వారు తరచుగా శ్రీ సుభ్రమన్యస్వామి వారి ఆరాధన – అభిషేకములు జరిపించుకోనుట సమస్యలను తగ్గించును.