చాలా మంది జ్యోతిష్యాన్ని అనుసరిస్తుంటారు. రోజు వారి రాశిఫలాలకు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త పనులను ప్రారంభిస్తారు. దిన ఫలాలు చూడనిదే కొందరు ఏ పని ప్రారంభించరు. మరి నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
మేషం
మేషరాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. ఈ రాశివారికి ఈ రోజు సువర్ణావకాశం తలుపు తట్టవచ్చు. ఆదాయం వృద్ధి చెందుతుంది. అన్ని రంగాల వారికి ఊహించని శుభఫలితాలు ఉంటాయి. లక్ష్మీకటాక్షం విజయసిద్ధి ఉంటాయి.
వృషభం
ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు ఈ రోజు పూర్తి చేస్తే తప్పకుండా విజయం ఉంటుంది. సరదాగా కాలక్షేపం చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది.
మిథునం
సామాన్యంగా ఉంటుంది. మీ మాటతీరు, ప్రవర్తన ఇతరులను ఆకట్టుకునేలా ఉంటేనే మంచిది. ఆవేశంతో, తొందరపాటుతో తీసుకునే నిర్ణయాలు చేటు చేస్తాయి. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మంచిది. అనారోగ్య సమస్యలు ఉంటాయి.
కర్కాటకం
ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఇబ్బందికర పరిస్థితులు, ప్రతికూలతలు ఉంటాయి కానీ మీ కృషి, కఠిన శ్రమ కారణంగా చక్కని ఫలితాలు అందుకుంటారు. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి.
సింహం
సింహరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వ్యాపారులు ఆర్ధిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. అనారోగ్య సమస్యల కారణంగా ఈ రోజంతా చికాకుగా ఉంటుంది. ఉద్యోగులకు అధిక పనిభారంతో ఒత్తిడికి లోనవుతారు.
కన్య
అన్ని రంగాల వారికి ఈ రోజు కార్యసిద్ధి, ఆర్ధికలబ్ధి ఉంటాయి. అదృష్టకరంగా ఉంటుంది. లబ్ది పొందే అవకాశం ఉంది. వ్యాపారులకు పెట్టుబడులు, లాభాల రూపంలో ధనప్రవాహం ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది.
తుల
ఉద్యోగులు అధిక పని వత్తిడి వల్ల మానసిక ఆందోళనకు గురవుతారు. అనుకున్న సమయంలో పనులన్నీ పూర్తవుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. శుభవార్తలు ఆనందం కలిగిస్తాయి. వ్యాపారస్తులకు వ్యాపారంలో మంచి ఆర్థికాభివృద్ధి కలిగే అవకాశం ఉంది.
వృశ్చికం
వృశ్చిక రాశి వారికి ఈ రోజు శుభ ఫలితాలు ఉంటాయి. ఈ రోజంతా తీరికలేని పనులతో ఉన్నప్పటికినీ అన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారస్తులు భాగస్వాములతో కీలకమైన చర్చలు జరుపుతారు. ఆదాయ వృద్ధి ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది.
ధనుస్సు
ధనుస్సు రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈ రోజున మీరు ఏర్పరచుకునే బంధాలు జీవితాంతం ఉంటాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. ధనదాయం వృద్ధి చెందుతుంది.
మకరం
ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులకు అనుకూలమైన రోజు. ఆర్ధికంగా బలోపేతం అవుతారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు వేధిస్తాయి.
కుంభం
ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చిత్తశుద్ధితో పనిచేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యమైన పనుల విషయంలో అశ్రద్ధ కూడదు. నిర్ణయాల విషయంలో తెలివిగా వ్యవహరించాలి.
మీనం
మీన రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కొత్త వ్యక్తులను కలుస్తారు. సమాజంలో పరపతి పెరుగుతుంది. ఉద్యోగులు వ్యక్తిగత జీవితం, పనిలో కొత్త బాధ్యతలు చేపడతారు. ఆదాయం వృద్ధి చెందుతుంది.