09.06.2024 ఆదివారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి అనుకోని ఖ‌ర్చులు..!

చాలా మంది జ్యోతిష్యాన్ని అనుస‌రిస్తుంటారు. రోజు వారి రాశిఫ‌లాల‌కు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త ప‌నుల‌ను ప్రారంభిస్తారు. దిన ఫ‌లాలు చూడ‌నిదే కొంద‌రు ఏ ప‌ని ప్రారంభించ‌రు. మ‌రి నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

  • Publish Date - June 9, 2024 / 06:10 AM IST

మేషం

మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపార రంగాలవారు చక్కని ప్రణాళికతో ముందుకెళ్తే విజయం మీదే. అన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. విందువినోదాల్లో పాల్గొంటారు. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది.

వృషభం

వృషభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఆశించిన ప్రయోజనాలు పొందాలంటే కఠినశ్రమ అవసరం. ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. అనుకోని ఖర్చులు ఉండవచ్చు. కొత్తగా మొదలు పెట్టాలనుకున్న పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి.

మిథునం

మిథునరాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తిలో పురోగతి ఉండకపోవచ్చు. ఉద్యోగులు కోపావేశాలను అదుపులో ఉంచుకుంటే మంచిది. పదోన్నతికి సంబంధించిన విషయాలు నిరాశజనకంగా ఉంటాయి. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న శుభవార్త మీకు ఆనందాన్ని కలిగిస్తుంది.

కర్కాటకం

కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. ఆదాయాన్ని మించిన ఖర్చులతో ఆర్ధిక పరిస్థితి దిగజారుతోంది. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మంచిది. కోపాన్ని, మాటలను అదుపులో పెట్టుకోండి, లేదంటే కుటుంబంలో వివాదాలు రావచ్చు.

సింహం

సింహరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగ రంగాల వారు శుభవార్తలు అందుకుంటారు. ఆదాయం బ్రహ్మాండంగా ఉంటుంది. అనుకోని ధనలాభం కూడా ఉండవచ్చు. మీ మొండి వైఖరి కారణంగా సన్నిహితులతో వివాదాలు ఏర్పడవచ్చు.

కన్య

కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కళారంగాల వారికి, రచయితలకు అనుకూలమైన సమయం. మీ ప్రతిభకు సన్మానసత్కారాలను అందుకుంటారు. వ్యాపారులు లాభాలను అందుకుంటారు. ఉద్యోగులు ప్రమోషన్, జీతం పరుగుదల వంటి ప్రయోజనాలు ఉండవచ్చు.

తుల

తులారాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్ధిక నష్టం సూచితం. ఆరోగ్యం సహకరించదు. కుటుంబంలో కలహాలతో మనశాంతి లోపిస్తుంది. ఉద్యోగుల పనితీరుపట్ల ఉన్నతాధికారులు అసంతృప్తితో ఉంటారు.

వృశ్చికం

వృశ్చికరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. పరోపకారం వీడి మీ కోసం మీరు పనిచేస్తే మంచి విజయాలు అందుకుంటారు. వ్యాపారులు మంచి లాభాలు అందుకుంటారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఆదాయం కూడా వృద్ధి చెందుతుంది.

ధనుస్సు

ధనుస్సురాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సమాజంలో ముఖ్య వ్యక్తులను ఈ రోజు కలుసుకుంటారు. వ్యాపారులకు భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. మంచి లాభాలను గడిస్తారు. ఆదాయవృద్ధి ఉంటుంది.

మకరం

మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. సమయస్ఫూర్తితో, సహనంతో వ్యవహరించి ఇంటా బయటా అన్ని సమస్యలను పరిష్కరిస్తారు. పలు మార్గాల ద్వారా ఆదాయం వృద్ధి చెందుతుంది. గృహంలో శాంతి నెలకొంటుంది. వ్యాపారులకు ఆర్ధిక లాభాలు ఆర్థికంగా ఉంటాయి.

కుంభం

కుంభరాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. ఈ రోజు అందరి దృష్టంతా మీపైనే ఉంటుంది. మీ పనితీరు ఉన్నతాధికారులను ఆకట్టుకుంటుంది. ఆదాయం బాగా పెరుగుతుంది. వ్యాపారులకు కార్యసిద్ధి, ఆర్థికవృద్ధి ఉంటాయి. ఓ శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది.

మీనం

మీనరాశి వారికి ఈ రోజు ఆనందకరంగా ఉంటుంది. ఈ రోజంతా పూర్తి ఉత్సాహంగా ఉంటారు. ఏకాగ్రతతో, చిత్తశుద్ధితో పనిచేసి మంచి విజయాలను సాధిస్తారు. అన్ని రంగాల వారికి ఈ రోజు ఆదాయం మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగులు, వృత్తి నిపుణులు పనికి సంబంధించి శుభవార్తలు అందుకుంటారు.

Latest News