Diwali 2024 | దీపావళికి ముందు ఈ వస్తువులు అసలు కొనకూడదు..! కొంటే అరిష్టమే.. జర జాగ్రత్త..!!
Diwali 2024 | హిందువులు దీపావళి( Diwali ) పండుగను గొప్పగా జరుపుకుంటారు. ఇక లక్ష్మీపూజ( Lakshmi Puja ), గౌరమ్మ వత్రాలను( Nomu ) చేస్తుంటారు. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త కాంతులు తీసుకువస్తుందని నమ్మకం.
Diwali 2024 | అక్టోబర్ 31న దీపావళి( Diwali ) పండుగ నేపథ్యంలో చాలా మంది కొత్త వస్తువులు కొంటారు. కొత్త దుస్తులు, పూజలకు, వ్రతాలకు కావాల్సిన వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. అంతేకాకుండా ఇంట్లోకి అవసరమైన ఫ్రిజ్, టీవీ, బెడ్, వాహనాలు వంటికి కూడా కొంటుంటారు. అయితే కొన్ని వస్తువులను మాత్రం దీపావళి ముందు కొనుగోలు చేయకూడదని, అసలు ఇంట్లోకి తీసుకురావొద్దని జ్యోతిష్య పండితులు హెచ్చరిస్తున్నారు. ఆ వస్తువులను ఇంట్లోకి తీసుకొని అరిష్టమని పండితులు చెబుతున్నారు.
ఈ వస్తువులను అసలు కొనుగోలు చేయొద్దు..
- విరిగిన గాజులు, ఫర్నీచర్, పాడైపోయిన వస్తువులు.. ఇలాంటి వాటిని దురదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లోకి తీసుకురాకూడదని చెబుతారు.
- ఇక నలుపు రంగు వస్తువులు అసలు కొనకూడదు. ఇవి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయట. అందుకే నలుపు లేదా దానికి సమానంగా ఉండే ఏదైనా రంగు వస్తువులను ఇంటికి తీసుకురావద్దని హెచ్చరిస్తున్నారు.
- ఇప్పటికే ఉపయోగించిన లేదా సెకండ్ హ్యాండ్ వస్తువులను కూడా కొనుగోలు చేయకూడదట. ఎందుకంటే అవి మీ ఇంటికి అశుభం కలిగించే శక్తిని కలిగి ఉండవచ్చు అని అంటారు.
- కత్తులు లేదా కత్తెర వంటి పదునైన వస్తువులను ఇంట్లోకి తీసుకురావద్దు, అలాంటి వస్తువులు సంఘర్షణకు దారితీస్తాయి. సంబంధాలను విచ్ఛిన్నం చేస్తాయి. ప్రతికూలతను పెంచుతాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram