Nail Biting | గోళ్లు కొరికే అలవాటు ఉందా..? అప్పుల ఊబిలో చిక్కుకుపోయినట్టేనట..!
Nail Biting | చాలా మందికి గోళ్లను కొరకడం( Nail Biting ), తినడం అలవాటుగా ఉంటుంది. కానీ ఇది పెద్ద ప్రమాదాన్ని కొని తెస్తుందని గ్రహించాలి. గోళ్లను కొరకడం, తినడం వల్ల గ్రహా దోషాలు( Graha Dosham ) ఏర్పడి జీవితాంతం ఆర్థిక కష్టాలు( Finance Problems ) ఏర్పడి, అప్పుల( Debts ) ఊబిలో చిక్కుకుపోతారట. తస్మాత్ జాగ్రత్త.

Nail Biting | గోళ్లు కొరకడం( Nail Biting ) అనేది కొందరికి సాధారణ అలవాటుగా ఉంటుంది. నిత్యం నోట్లోనే వేలు పెట్టి గోళ్లను కొరుకుతుంటారు. ఇది వెరీ బ్యాడ్ హ్యాబిట్( Very Bad Habbit ) అయినప్పటికీ.. అలానే గోళ్లను కొరికి నమిలి మింగుతుంటారు. ఇది అనేక అనారోగ్య సమస్యలకు( Health Issues ) దారి తీయడమే కాదు.. మన జాతక చక్రంలో గ్రహాల అశాంతికి కూడా కారణమవుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. గ్రహాల అశాంతి కారణంగా అప్పుల( Debts ) ఊబిలో చిక్కుకు పోయినట్టే అని పండితులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో గోళ్లను కొరికి తినడం వల్ల కలిగే నష్టాలు ఏంటో తెలుసుకుందాం..
- చాలా మంది ఒత్తిడికి, ఆందోళనకు గురై గోళ్లను తరుచుగా కొరుకుతుంటారు.. ఇంకొందరు ఆ గోళ్లను కొరికి నమిలి మింగేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తడమే కాదు.. మన జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుందట.
- ఇలా నిత్యం గోళ్లను కొరకడం వల్ల గ్రహాలు అశాంతి చెందుతాయట. దీని ప్రభావం సదరు వ్యక్తి జాతకంపై పడుతుందట. గోళ్లు కొరకడం వల్ల సూర్య గ్రహం ప్రభావితమైతే మీలో ఆత్మవిశ్వాసం లేకుండా పోతుందట. జీవితంలో అనేక అడ్డంకులను ఎదుర్కోవడం వంటి సమస్యల బారిన పడుతారట.
- గోళ్లను కొరకడంతో.. జాతకంలో సూర్యుడు బలహీనంగా మారుతాడట. దీంతో నిర్ణయాలు తీసుకోవడంలో కూడా సమస్యలను ఎదుర్కొంటారట. మరి ముఖ్యంగా తండ్రితో విబేధాలు ఏర్పడే అవకాశం ఉంటుందట.
- గోళ్లు కొరికే వ్యక్తులు జీవితంలో ఆర్ధిక సమస్యలను ఎదుర్కొంటూ అప్పుల ఊబిలో చిక్కుకుపోతారట. దీంతో వడ్డీలకు చక్ర వడ్డీలు చెల్లించే పరిస్థితి తలెత్తుతుందట.
- అలాగే నిత్యం గోళ్లు కొరికే వ్యక్తి ఎప్పుడూ డబ్బుకి అష్ట కష్టాలు పడుతారట. కాబట్టి గోళ్లు కొరికే అలవాటును వెంటనే మానుకోవాలని పండితులు హెచ్చరిస్తున్నారు.
- గోళ్ళు కొరకడం వలన సూర్య దోషం మాత్రమే కాదు శని దోషం కూడా ఏర్పడే అవకాశం ఉంటుందట. గోర్లు కొరకడం శని దోషం లక్షణం కావచ్చు. అంటే శనీశ్వర చెడు దృష్టి మీపై ఉందని అర్థం. వీలైనంత త్వరగా ఈ అలవాటును వదులుకోవాలని పండితులు సూచిస్తున్నారు.