Ganesh Puja | దానిమ్మ పువ్వులతో వినాయకుడిని పూజిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయట..!
Ganesh Puja | హిందువులు ఏ పనిని ప్రారంభించినా.. ఏ శుభకార్యం తలపెట్టినా.. ముందుగా లంబోదరుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత మిగతా దేవుళ్లను పూజిస్తారు. ఎందుకంటే విఘ్నేశ్వరుడు విఘ్నాలు తొలగిస్తాడని హిందువుల నమ్మకం. బుధవారం రోజు వినాయకుడిని పూజిస్తే జీవితమంతా విజయాలే ఉంటాయనే విశ్వాసం భక్తుల్లో ఉంది.

Ganesh Puja | హిందువులు ఏ పనిని ప్రారంభించినా.. ఏ శుభకార్యం తలపెట్టినా.. ముందుగా లంబోదరుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత మిగతా దేవుళ్లను పూజిస్తారు. ఎందుకంటే విఘ్నేశ్వరుడు విఘ్నాలు తొలగిస్తాడని హిందువుల నమ్మకం. బుధవారం రోజు వినాయకుడిని పూజిస్తే జీవితమంతా విజయాలే ఉంటాయనే విశ్వాసం భక్తుల్లో ఉంది. గణనాథుడి అనుగ్రహం కోసం బుధవారం అనేక రకాల పూజలు చేస్తుంటారు. అయితే దానిమ్మ పువ్వులతో గణేశుడిని పూజిస్తే జీవితంలో కష్టాలన్నీ తొలగిపోయి, సుఖసంతోషాలతో వారి జీవితం విరాజిల్లుతుందని పండితులు చెబుతున్నారు.
బుధవారం వేకువజామునే మేల్కొని అభ్యంగ స్నానం ఆచరించాలి. అనంతరం గణనాథుడికి ఎంతో ప్రీతికరమైన దానిమ్మ పువ్వులను పెరట్లో నుంచి తెచ్చుకోవాలి. ఇక లంబోదరుడిని గరిక, దానిమ్మ పువ్వులతో అలంకరించిన అనంతరం పూజా కార్యక్రమం ప్రారంభించాలి. ఇలా దానిమ్మ పువ్వులతో పూజ చేయడం వల్ల అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.
ఇక మీ కష్టాలన్నీ తొలగిపోవడానికి వినాయకుడికి మోదక నైవేద్యాన్ని సమర్పించాలి. బుధవారం నాడు మోదక నైవేద్యాన్ని పెట్టి వినాయకుడిని ప్రార్థిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ప్రతి బుధవారం తప్పకుండా గణపతిని, లక్ష్మీదేవిని పూజించండి. ఇలా చేయడం వల్ల జాతకంలో బుధుని స్థానం బలపడుతుంది. బుధ గ్రహం యొక్క స్థానం బలంగా ఉండటం వలన, మీరు ఖచ్చితంగా సంతోషకరమైన జీవితాన్ని కలిగి ఉంటారు. బుధవారాలలో గుడికి వెళ్లి గణేశుడికి దుర్వ లేదా గరికె గడ్డి, లడ్డూను సమర్పించండి. ఇది గణపతిని సంతోషపరుస్తుంది. గణనాథుడి నుంచి ఆశీర్వాదాలను పొందవచ్చు.