Horoscope | సోమ‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారు ఏ ప‌ని త‌ల‌పెట్టినా విజ‌యం వెన్నంటే..!

Horoscope | జ్యోతిష్యం అంటే న‌మ్మ‌కం. మ‌న‌కు అంతా మంచే జ‌ర‌గాల‌ని కోరుకుంటాం.. అందువ‌ల్ల ఈ రోజు మ‌న రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయ‌ని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

  • By: raj |    devotional |    Published on : Nov 10, 2025 6:31 AM IST
Horoscope | సోమ‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారు ఏ ప‌ని త‌ల‌పెట్టినా విజ‌యం వెన్నంటే..!

మేషం (Aries)

మేష రాశి వారికి ఈ రోజు ఆనందదాయకంగా ఉంటుంది. చక్కని ప్రణాళికతో చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి పరంగా శుభవార్తలు వింటారు. కుటుంబ వేడుకల్లో బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. అనుకోని సంఘటన ఒకటి ఆనందం కలిగిస్తుంది.

వృషభం (Taurus)

వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ పెరిగినప్పటికీ మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. కీలక వ్యవహారాల్లో పెద్దల సలహాలు మేలు చేస్తాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది.

మిథునం (Gemini)

మిథున రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో ఎన్ని కష్టాలు ఎదురైనా ఇష్టపడి పనిచేస్తే సత్ఫలితాలు పొందవచ్చు. ఉద్యోగంలో ఉన్నతాధికారుల మద్దతు పొందుతారు. ఆర్థిక పరమైన లావాదేవీలు లాభదాయకంగా ఉంటాయి. వ్యాపారంలో విజయం ఉంటుంది.

కర్కాటకం (Cancer)

కర్కాటక రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతి లోపిస్తుంది. ఎంత కష్టపడినా సమయానికి పనులు పూర్తి కాకపోవడంతో నిరాశ చెందుతారు. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలకు ఆస్కారం ఉంది. కోపావేశాలు అదుపులో ఉంచుకుంటే మంచిది. ఖర్చులు పెరగకుండా చూసుకోండి.

సింహం (Leo)

సింహ రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో మీ ప్రాధాన్యత పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో క్లిష్టమైన పనులు కూడా సునాయాసంగా పూర్తి చేస్తారు. ఆర్థికంగా శుభ యోగాలున్నాయి. కొన్ని శుభవార్తలు సంతోషం కలిగిస్తాయి. వ్యాపారులు పెద్ద కాంట్రాక్టులు చేజిక్కించుకుంటారు.

కన్య (Virgo)

కన్యా రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రద్ధ తగ్గకుండా చూసుకోండి. ప్రారంభించిన పనుల్లో పట్టుదల, దీక్ష ఉంటే సానుకూల ఫలితాలు ఉంటాయి. కుటుంబంతో అనుబంధం బలోపేతం అవుతుంది. స్నేహితులు, బంధువులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి.

తుల (Libra)

తులా రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో అనుకోని సమస్యలు ఎదురవుతాయి. కుటుంబంలో ప్రతికూల పరిస్థితులు ఆందోళన కలిగిస్తాయి. డబ్బు మంచినీళ్లలా ఖర్చవుతుంది. జీవిత భాగస్వామితో విబేధాలు చికాకు పెడతాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి, శ్రమ పెరుగుతాయి. ఉన్నతాధికారులు మీ పనితీరు పట్ల అసంతృప్తితో ఉంటారు.

వృశ్చికం (Scorpio)

వృశ్చిక రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఆటంకాలు నిరుత్సాహపరుస్తాయి. కొన్ని సంఘటనలు విచారం కలిగిస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో మనోబలం తగ్గకుండా చూసుకోండి. దైవబలంపై విశ్వాసం మాత్రమే దురదృష్టకర పరిస్థితుల నుంచి రక్షించగలవు. కుటుంబంలో అశాంతి, కలహాలు చికాకు పెడతాయి.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సు రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. లక్ష్య సాధనలో ఆటంకాలు బుద్ధిబలంతో అధిగమిస్తారు. ప్రారంభించిన పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోండి. కుటుంబంలో చిన్న చిన్న కలహాలు మనశ్శాంతిని దూరం చేస్తాయి. ఉద్యోగ వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు అందుకుంటారు. ఖర్చులు పెరగడం ఆందోళన కలిగిస్తుంది.

మకరం (Capricorn)

మకర రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అదృష్టయోగం ఉంది. దైవబలం సంపూర్ణంగా రక్షిస్తుంది. ఏ పని తలపెట్టినా విజయం వెన్నంటే ఉంటుంది. కుటుంబ సభ్యుల మద్దతుతో కీలక వ్యవహారాల్లో ముందంజ వేస్తారు. ఆర్థికంగా బలోపేతం అవుతారు.

కుంభం (Aquarius)

కుంభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో చిన్న చిన్న సమస్యలు మనోబలంతో ఎదుర్కొంటారు. ప్రారంభించిన పనుల్లో ఉత్సాహం తగ్గకుండా చూసుకోండి. సమయానుకూల నిర్ణయాలు మేలు చేస్తాయి. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. మీ ప్రతిభకు ఉన్నతాధికారుల ప్రసంశలు అందుకుంటారు.

మీనం (Pisces)

మీన రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అనవసర ఆందోళనలు మీ పనిని ఆలస్యం చేస్తాయి. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో సందిగ్దత నెలకొంటుంది. భూములు, స్థిరాస్తులకు సంబంధించిన పనులు వాయిదా వేయండి. అవమానకర పరిస్థితులకు దూరంగా ఉండండి. ఖర్చులు పెరగడం ఆందోళన కలిగిస్తుంది.