Horoscope | శనివారం రాశిఫలాలు.. మీ రాశిఫలం ఎలా ఉందంటే..?
Horoscope | జ్యోతిష్యం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం.. అందువల్ల ఈ రోజు మన రాశిఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

మేషం (Aries)
మేష రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో ఆచి తూచి నడుచుకోవాలి. కీలక వ్యవహారాల్లో పట్టుదలకు పోకుండా రాజీధోరణి అవలంభిస్తే మంచిది. కుటుంబ సభ్యుల అవసరాలకు ప్రాధాన్యత ఇస్తే మంచిది. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఎవరితోనూ వాదనలకు దిగవద్దు.
వృషభం (Taurus)
వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో శుభవార్తలు ఆనందం కలిగిస్తాయి. ప్రారంభించిన పనులు రెట్టించిన ఉత్సాహంతో పూర్తి చేస్తారు. మీ ప్రతిభకు గుర్తింపు, ప్రశంసలు దక్కుతాయి. ధనప్రాప్తి ఉంటుంది.
మిథునం (Gemini)
మిథున రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. వృత్తి పరంగా సానుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగులకు సహోద్యోగుల సహకారం, అధికారుల మద్దతు ఉంటుంది. వ్యాపారంలో ఆశ్చర్యకరమైన లాభాలు అందుకుంటారు. వృత్తిపరమైన చర్చలు సానుకూల ఫలితాన్నిస్తాయి. బంధుమిత్రులతో వేడుకల్లో ఆనందంగా పాల్గొంటారు.
కర్కాటకం (Cancer)
కర్కాటక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో ఆటంకాలు సునాయాసంగా అధిగమిస్తారు. చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. కలహాలకు దూరంగా ఉండాలి. సన్నిహితులతో శాంతంగా, సౌమ్యంగా మాట్లాడడం అవసరం. వృథా ఖర్చులు నివారిస్తే మంచిది.
సింహం (Leo)
సింహ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి పరమైన ఆటంకాలకు ఆందోళన చెందవద్దు. మీ మనోధైర్యమే మీ విజయానికి మార్గం. సహనం, ఓర్పుతో పనిచేస్తే విజయం సిద్ధిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండండి. డబ్బును ఆచి తూచి ఖర్చు చేయండి.
కన్య (Virgo)
కన్యా రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. మనోధైర్యంతో, నూతనోత్సాహంతో బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకుంటారు. లక్ష్య సాధనలో ఎన్ని అవరోధాలు వచ్చినా పట్టుదలతో అధిగమిస్తారు. అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తారు. బద్దకాన్ని దరిచేరనీయకండి. కీలక వ్యవహారాల్లో బంధుమిత్రుల సలహాలు మేలు చేస్తాయి.
తుల (Libra)
తులా రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో విశిష్ట ఫలితాలు అందుకుంటారు. భవిష్యత్తు ప్రణాళికలు ఫలిస్తాయి. ఆర్థికంగా బలోపేతం అవుతారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రశాంతతనిస్తుంది. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహించండి.
వృశ్చికం (Scorpio)
వృశ్చిక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా మనోబలాన్ని కోల్పోవద్దు. ఉద్యోగ వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ స్థిరమైన బుద్ధితో వ్యవహరిస్తే విజయం సిద్ధిస్తుంది. కీలక నిర్ణయాల్లో చంచల బుద్ధిని పక్కన పెట్టి వివేకంతో ఆలోచించండి.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సు రాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంది. అదృష్టం అవకాశాలుగా మారనున్నాయి. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే సత్ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమకు తగిన ఫలితాలు తప్పకుండా ఉంటాయి. ఆర్థికంగా శుభయోగాలున్నాయి. శుభకార్యాల్లో బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు.
మకరం (Capricorn)
మకర రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఆశించిన ఫలితాల కోసం తీవ్రంగా కృషి చేయాలి. ప్రారంభించిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. అనారోగ్యం పనులకు ఆటంకంగా మారుతుంది. కొందరి ప్రవర్తన మనస్థాపం కలిగిస్తుంది. కీలక వ్యవహారాల్లో పెద్దల సలహాలు మేలు చేస్తాయి.
కుంభం (Aquarius)
కుంభ రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. ఉద్యోగ వ్యాపారాల్లో ప్రతికూల పరిస్థితులు ఆందోళన కలిగిస్తాయి. అధికారులతో సౌమ్యంగా వ్యవహరించాలి. కుటుంబ వ్యవహారాల్లో మొండి పట్టుదల వీడి రాజీ ధోరణి అవలంభిస్తే మంచిది. సామాజిక పరపతికి భంగం కలిగే పనులకు దూరంగా ఉంటే మంచిది.
మీనం (Pisces)
మీన రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. కీలక వ్యవహారంలో ఆశించిన పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. స్వస్థానప్రాప్తి కూడా ఉండవచ్చు.