Horoscope | శనివారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి నూతన గృహ, వాహన యోగాలున్నాయి..!
Horoscope | జ్యోతిష్యం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం.. అందువల్ల ఈ రోజు మన రాశిఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
మేషం (Aries)
మేష రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ పెరగకుండా ఎప్పటి పనులు అప్పుడే చేసుకోవడం మంచిది. కీలక అంశాల్లో అజాగ్రత్త నష్టం కలిగిస్తుంది. సమయపాలన, క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇవ్వడం అవసరం. వ్యాపారులు వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. డబ్బు మంచినీళ్లలా ఖర్చవుతుంది.
వృషభం (Taurus)
వృషభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో ఉత్సాహం తగ్గకుండా చూసుకోండి. కొన్ని సంఘటనలతో కలత చెందుతారు. వ్యాపారంలో ముందుచూపు తప్పనిసరి. సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆర్థిక నష్టాలకు అడ్డుకట్ట వేయవచ్చు. కుటుంబంలో వేడుకలు జరుగుతాయి. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు.
మిథునం (Gemini)
మిథున రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో మేలైన ఫలితాలు ఉంటాయి. వ్యాపారాన్ని దూరప్రాంతాలకు విస్తరిస్తారు. పెట్టుబడుల విషయంలో అనుభవజ్ఞుల సలహాలు మేలు చేస్తాయి. సరైన ప్రణాళికతో వృథా ఖర్చులు నివారించవచ్చు. ప్రయాణాల్లో తగిన జాగ్రత్తలు అవసరం.
కర్కాటకం (Cancer)
కర్కాటక రాశి వారికి ఈ రోజు ప్రతికూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. గ్రహబలం అనుకూలంగా లేదు. ఉద్యోగ వ్యాపారాల్లో జాగ్రత్తగా నడుచుకోవాలి. పరపతి, పలుకుబడికి భంగం కలిగే సంఘటనలకు దూరంగా ఉంటే మంచిది. ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకోండి. బంధువుల్లో కొందరి ప్రవర్తన మనస్థాపం కలిగిస్తుంది. చంచల బుద్ధితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి.
సింహం (Leo)
సింహ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో తోటివారి ప్రోత్సాహంతో ముందడుగు వేస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆర్థిక స్థిరత్వం సాధిస్తారు. దైవబలంతో కీలక వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆరోగ్యం సహకరిస్తుంది.
కన్య (Virgo)
కన్య రాశి వారికి ఈ రోజు సరదాగా గడిచిపోతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. సాహసోపేతమైన నిర్ణయాలతో ఉద్యోగ వ్యాపారాల్లో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. ఆర్థికంగా విశేషమైన ఫలితాలు ఉంటాయి. అవసరానికి సరిపడా ధనం అందుతుంది. బంధుమిత్రుల్లో ఆదరాభిమానాలు పెరుగుతాయి.
తుల (Libra)
తులా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. గ్రహాలు విశేషంగా అనుకూలిస్తున్నాయి. ముందస్తు ప్రణాళికతో ఉద్యోగ వ్యాపారాల్లో ఆటంకాలు దూరమవుతాయి. ఉద్యోగంలో కృషికి తగిన ఫలితాలు లభిస్తాయి. నూతన గృహ, వాహన యోగాలున్నాయి. కీలక విషయాల్లో సర్దుబాటు ధోరణితో విజయం సాధిస్తారు. ఆర్థిక సమస్యలు తొలుగుతాయి.
వృశ్చికం (Scorpio)
వృశ్చిక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో అధిక శ్రమ ఉండవచ్చు. నిరంతర కృషితో సత్ఫలితాలు సాధిస్తారు. మీ కర్తవ్య నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. అనవసర వివాదాలు, కలహాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఆర్థిక వ్యవహారాల్లో ప్రణాళిక అవసరం. కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండండి.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సు రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో గత అనుభవాల ఆధారంగా పనిచేయడం వల్ల ఆశించిన ఫలితాలు పొందవచ్చు. లక్ష్య సాధనలో ఉత్సాహం తగ్గకుండా చూసుకోండి. ఉద్యోగులకు స్థానచలనం ఉండవచ్చు. అధికారులతో జాగ్రత్తగా మెలగండి. మొహమాటంతో ఖర్చులు పెరగవచ్చు.
మకరం (Capricorn)
మకర రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. అభీష్టసిద్ధి ఉంది. లక్ష్మీకటాక్షంతో ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. ఉద్యోగంలో ఆశించిన పదోన్నతులు అందుకుంటారు. క్లిష్ట సమస్యలు సునాయాసంగా పరిష్కరించి అందరి ప్రశంసలు పొందుతారు. వ్యాపారులకు పెట్టుబడులు మంచి లాభాలను అందిస్తాయి. కుటుంబంతో విహారయాత్రలకు వెళ్తారు.
కుంభం (Aquarius)
కుంభ రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. శ్రేష్ఠమైన శుభ సమయం నడుస్తోంది. కాలం అన్నివిధాలా సహకరిస్తోంది. ప్రారంభించిన పనుల్లో మీ కృషికి దైవబలం కూడా తోడవడంతో అద్భుత ఫలితాలు సాధిస్తారు. వ్యాపారంలో సమష్టి కృషితో విజయం సాధించవచ్చు. బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆర్థిక పరమైన ఇబ్బందులు తొలగుతాయి.
మీనం (Pisces)
మీన రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో బాధ్యతాయుతంగా పని చేయడం వల్ల ఆశించిన ఫలితాలు పొందవచ్చు. ఒక వ్యవహారంలో నిందలు పడాల్సి వస్తుంది. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహం కలిగిస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో శాంతంగా నిర్ణయాలు తీసుకోవాలి. విలాసాల కోసం అధికంగా డబ్బు ఖర్చవుతుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram