ఆదివారం రాశిఫలాలు.. ఈ రాశివారు ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది..!
Today Horoscope | చాలా మంది జ్యోతిష్యాన్ని అనుసరిస్తుంటారు. రోజు వారి రాశిఫలాలకు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త పనులను ప్రారంభిస్తారు. దిన ఫలాలు చూడనిదే కొందరు ఏ పని ప్రారంభించరు. మరి నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మేషం
మేషరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలలో దూకుడు తగ్గించుకుంటే మంచిది. ఎవరితోనూ వాదనలకు దిగవద్దు. బంధుమిత్రులతో విందువినోదాలలో పాల్గొంటారు. వృధా ఖర్చులు తగ్గించుకోండి. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.
వృషభం
వృషభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఎదురయ్యే సమస్యలు పరిష్కరించడం కష్టతరంగా మారుతుంది. కుటుంబసభ్యులు, సన్నిహితుల సహకారంతో పరిస్థితి కొంత అదుపులోకి వస్తుంది. ఆర్థిక పరిస్థితి తలకిందులవుతుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.
మిథునం
మిథునరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. గ్రహ సంచారం బాగాలేనందున అన్ని విషయాలలో చుక్కెదురు అవుతుంది. ప్రతికూల ఆలోచనలను వీడితే మంచిది. ముఖ్యమైన పనులు, ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. అనారోగ్యం, పనుల్లో ఆటంకాలు, ప్రమాదాలు సంభవించడం, ఆర్థిక వ్యవస్థ స్థంభించిపోవడం వంటి ప్రతికూల ఫలితాలు అనుభవించాల్సి వస్తుంది.
కర్కాటకం
కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు ఈ రోజు తాము నమ్మిన సిద్ధాంతాలతో రాజీపడకుండా ఉన్నతంగా పనిచేసి విజయాన్ని సాధిస్తారు. ఆర్థికంగా సంతృప్తికరమైన ఫలితాలు అందుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది.
సింహం
సింహరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు లేకపోవడం చికాకు కలిగిస్తుంది. ప్రతికూల ఆలోచల కారణంగా కుటుంబ సభ్యులతో, సన్నిహితులతో గొడవలు పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాల కారణంగా మానసిక ప్రశాంతత లోపిస్తుంది. జలగండం ఉంది జలాశయాలకు దూరంగా ఉండండి.
కన్య
కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటారు. గతంలోని చేదు జ్ఞాపకాలను మరచి కొత్త జీవితానికి శ్రీకారం చుడతారు. ఆర్థిక ఎదుగుదలపై దృష్టి సారిస్తే ప్రయోజనం ఉంటుంది. ఆరోగ్యం కొంచెం ఇబ్బంది పెడుతుంది.
తుల
తులారాశి వారికి ఈ రోజు ఆనందంగా గడిచిపోతుంది. వృత్తి వ్యాపారాలకు సంబంధించి ఎన్నో ఆశ్చర్యాలను చూస్తారు. వృత్తిపరమైన, వ్యాపారపరమైన చర్చల్లో నిర్ణయం తీసుకోవాల్సిన వంతు మీపై ఉంటుంది. బంధు మిత్రులతో సరదాగా గడుపుతారు.ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది.
వృశ్చికం
వృశ్చికరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు వృత్తి వ్యాపారాలలో ధైర్యంతో ముందడుగు వేస్తే కార్యసిద్ధి ఉంటుంది. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. చిత్తశుద్ధితో పనిచేసి లక్ష్యాలను సాధిస్తారు. వ్యాపారులకు ఊహించని లాభాలుంటాయి. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు.
ధనుస్సు
ధనుస్సురాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. గత తప్పిదాల నుంచి నేర్చుకున్న పాఠాలతో ఏకాగ్రతతో పనిచేసి విజయం సాధిస్తారు. ఎటువంటి ప్రశంసలు రాకపోవడం మీకు నిరాశ కలిగిస్తుంది. మీ స్వధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. ఆదాయాన్ని మించిన ఖర్చులుండవచ్చు.
మకరం
మకరరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో చికాకు కలిగించే సంఘటనలు ఎదురైనా కుటుంబ జీవితం సంతోషకరంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో అండతో అన్ని కష్టాలను అధిగమిస్తారు. సన్నిహితులతో విందు వినోదాలలో పాల్గొంటారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది.
కుంభం
కుంభరాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. ఈ రాశి వారు ఈ రోజు ముఖ్యంగా ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తారు. ధార్మిక కార్యక్రమాల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు. తీర్థయాత్రలకు వెళ్తారు. సమాజంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. వృత్తి వ్యాపారాలలో పట్టిందల్లా బంగారం అవుతుంది. ఏ పని చేపట్టిన విజయం వెన్నంటే ఉంటుంది.
మీనం
మీనరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. కీలకమైన వ్యవహారాలలో వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. ఆర్థికపరమైన మోసాలకు గురి అయ్యే అవకాశం ఉంది. అందుకే జాగ్రత్తగా ఉండండి.