మంగ‌ళ‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి ఉద్యోగంలో ప‌దోన్న‌తులు..!

Today Horoscope | చాలా మంది జ్యోతిష్యాన్ని అనుస‌రిస్తుంటారు. రోజు వారి రాశిఫ‌లాల‌కు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త ప‌నుల‌ను ప్రారంభిస్తారు. దిన ఫ‌లాలు చూడ‌నిదే కొంద‌రు ఏ ప‌ని ప్రారంభించ‌రు. మ‌రి నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మంగ‌ళ‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి ఉద్యోగంలో ప‌దోన్న‌తులు..!

మేషం

మేష రాశివారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. విశేషమైన ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. సమాజంలో గౌరవం, ఖ్యాతి పెరుగుతాయి. వ్యాపారం బాగా రాణిస్తుంది. జీవితంలో కొత్త అధ్యాయం మొదలుపెట్టేందుకు ఎదురుచూస్తున్నవారికి శుభఘడియలు ఆసన్నమయ్యాయి. త్వరలోనే కళ్యాణ కాంతులను చూస్తారు.

వృషభం

వృషభ రాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. వ్యాపారపరంగా అద్బుతమైన రోజు. ఉద్యోగులకు సానుకూల ఫలితాలుంటాయి. మీ పని తీరుకి లభించే ప్రశంసలతో మీ ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. ఆర్థికపరమైన ప్రయోజనాలు కూడా నేడు మెండుగా ఉంటాయి. ఆరోగ్యం సహకరిస్తుంది.

మిథునం

మిథున రాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. ఉద్యోగులకు పని ప్రదేశంలో అనుకోని సమస్యలు ఎదురవుతాయి. కోపాన్ని అదుపులో ఉంచుకొని సహనంగా ఉండడం అవసరం. రాజీపడేందుకు ప్రయత్నించండి. తద్వారా పని ప్రదేశంలో అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించగలుగుతారు. విలాసవంతమైన వాటిపై అధికంగా ఖర్చు చేస్తారు.

కర్కాటకం

కర్కాటక రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. గ్రహ సంచారం అనుకూలంగా లేనందున వృత్తి వ్యాపారాలలో అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. మీకు, మీ కుటుంబానికి చెడ్డ పేరు తెచ్చే అక్రమ, అనైతిక కార్యకలాపాలకు దూరంగా ఉండండి. కోపావేశాలతో పౌరుషంగా మాట్లాడి ఇతరులకు బాధ కలిగించవద్దు. వ్యాపారంలో ఆర్ధిక నష్ట భయం ఉంది.

సింహం

సింహ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మానసికంగా, శారీరకంగా సంతోషంగా ఉంటారు. స్నేహితులు, బంధువులతో సరదాగా గడుపుతారు. ఉద్యోగంలో పదోన్నతులు పొందుతారు. నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. వ్యాపారంలో భాగస్వాముల మధ్య సత్సంబంధాలు నెలకొంటాయి. వ్యాపార ప్రయోజనాలు కోసం నూతన ఒప్పందాలు చేసుకుంటారు.

కన్య

కన్యా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని విధాలా ఈ రోజు శుభయోగాలున్నాయి. ఈ అద్భుతమైన రోజు నుంచి అత్యధిక ప్రయోజనాన్ని పొందండి. వ్యాపార భాగస్వాముల నుంచి ఆర్ధిక ప్రయోజనాలను పొందవచ్చు. చేపట్టిన అన్ని పనులు విజయవంతంగా పూర్తి కావడంతో ఉల్లాసభరితంగా ఉంటారు. బంధు మిత్రులతో విందు వినోదాలలో పాల్గొంటారు.

తుల

తులా రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీరు సృజనాత్మక రచనలు వ్రాయడం గురించి ఆలోచిస్తున్నట్లయితే ఈరోజు అలాంటి కార్యకలాపాలకు అనుకూలంగా ఉంటుంది. ఇతర రంగాల వారికి సామాన్య ఫలితాలు ఉంటాయి. ఆదాయాన్ని మించిన ఖర్చులుండవచ్చు. కుటుంబ కలహాలతో మనశ్శాంతి లోపిస్తుంది.

వృశ్చికం

వృశ్చిక రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. మీ మొండితనం, పట్టుదల కారణంగా వృత్తిపరంగా, వ్యక్తిగతంగా భారీ నష్టాలు చూస్తారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోకపోతే తరువాత చింతించాల్సి వస్తుంది. కుటుంబ కలహాలు మానసిక అశాంతిని కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో కొత్త ప్రాజెక్టులు, ముఖ్యమైన పనులు వాయిదా వేస్తే మంచిది.

ధనుస్సు

ధనుస్సు రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలుంటాయి. కుటుంబ సమస్యల పరిష్కారానికి పూనుకుంటారు. సమస్యలను పరిష్కరించడంలో విజయం సాధిస్తారు. ఆర్ధిక అంశాలపై స్పష్టమైన అవగాహనతో ఉంటారు. ఖర్చులు అదుపులోనే ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో సమస్యలు తీవ్రం కావడం వేదన కలిగిస్తుంది.

మకరం

మకర రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కుటుంబంలో గొడవలు, ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా చూసేందుకు మౌనంగా ఉండటం శ్రేయస్కరం. మనస్సును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాల కోసం పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తారు. కుటుంబ సభ్యులతో తీర్ధయాత్రలకు వెళ్తారు. ఓ శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.

కుంభం

కుంభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు. ముఖ్యమైన వ్యవహారాలలో చాలా కాలంగా ఎదురుచూస్తున్న మైలురాయిని అందుకుంటారు. వృత్తిపరమైన స్థాయి పెరగడం వల్ల సమాజంలో హోదా పెరుగుతుంది. అన్ని పనులు అనుకున్నట్లుగా జరగడంతో ప్రశాంతంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో విందు వినోదాలలో పాల్గొంటారు.

మీనం

మీన రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో విజయాలు పొందడానికి మీ పూర్తి శక్తియుక్తులను వినియోగించాల్సి ఉంటుంది. ఆర్ధికంగా ఆశించిన దానికన్నా అధిక ప్రయోజనాలుంటాయి. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం అవసరం. కుటుంబ సభ్యులు, ప్రియమైనవారితో వాగ్వివాదాలకు అవకాశం ఉంది.