Horoscope | గురువారం రాశిఫలాలు.. ఈ రాశి ఉద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి..!
Horoscope | జ్యోతిష్యం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం.. అందువల్ల ఈ రోజు మన రాశిఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

మేషం (Aries)
మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. భూములు, ఆస్తులకు సంబంధించిన ఒప్పందాలకు అనువైన సమయం. వ్యాపారులకు శ్రేష్ఠమైన కాలం నడుస్తోంది. బుద్ధిబలంతో కీలక వ్యవహారాల్లో ముందంజ వేస్తారు. ఉద్యోగంలో ఉన్నత యోగం ఉండవచ్చు.
వృషభం (Taurus)
వృషభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కీలక వ్యవహారాలు ఇబ్బందికరంగా, సంక్లిష్టంగా మారుతాయి. ఉద్యోగ వ్యాపారాలలో సవాళ్లు ఉండవచ్చు. బుద్ధిబలంతో క్లిష్టమైన సమస్యలు కూడా పరిష్కరిస్తారు. కొత్త అవకాశాలను స్వాగతించండి.
మిథునం (Gemini)
మిథునరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. గ్రహబలం శుభప్రదంగా ఉంది. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో శుభ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో పదోన్నతులు ఉండవచ్చు. మీ ప్రతిభకు గుర్తింపు, ప్రశంసలు అందుకుంటారు. లక్ష్మీకటాక్ష యోగంతో సంపదలు వృద్ధి చెందుతాయి.
కర్కాటకం (Cancer)
కర్కాటకరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో శ్రద్ధ అవసరం. ఆర్థిక వ్యవహారాల్లో నిర్లక్ష్యంతో నష్టపోతారు. వ్యాపారంలో ఏకాగ్రత అవసరం. ఉద్యోగులకు స్థానచలనం సూచన ఉంది. కుటుంబ కలహాలతో మనశ్శాంతి లోపిస్తుంది.
సింహం (Leo)
సింహరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం వలన నష్టం కలుగుతుంది. ఎప్పటి పనులు అప్పుడే చేయడం మంచిది. కీలక నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచన చేయండి. న్యాయపరమైన వివాదాలకు దూరంగా ఉండండి.
కన్య (Virgo)
కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా అనేక ప్రయోజనాలు అందుకుంటారు. ఊహించని సంపదలు సిద్ధిస్తాయి. ప్రయాణాలు ప్రశాంతంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో తీర్థయాత్రలకు వెళ్తారు.
తుల (Libra)
తులారాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి కృషికి తగిన ఫలితాలు ఉంటాయి. మీ శక్తియుక్తులతో ఉన్నతాధికారులను మెప్పిస్తారు. ప్రమోషన్ కోసం చూస్తున్నవారు శుభవార్తలు అందుకుంటారు. ఇంట్లో ఆనందకరమైన వాతావరణం వెల్లివిరుస్తుంది.
వృశ్చికం (Scorpio)
వృశ్చికరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పనిప్రదేశంలో పరిస్థితులు కొంత వ్యతిరేకంగా ఉన్నప్పటికీ సమయానుకూలంగా వ్యవహరిస్తే సత్ఫలితాలు ఉంటాయి. మానసిక ఆందోళనకు గురి కాకుండా ప్రశాంతంగా ఉండండి.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సురాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగంలో ఒత్తిడి ఉండవచ్చు. చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కాకపోవడంతో ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. మొహమాటంతో ఖర్చులు పెరుగుతాయి.
మకరం (Capricorn)
మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారులకు ఈ రోజు బాగా కలిసి వస్తుంది. నూతన ఒప్పందాలు, భాగస్వామ్య వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. వ్యాపార అవకాశాలు మెరుగుపడతాయి. పెట్టుబడులు, లాభాలు ఆదాయాన్ని పెంచుతాయి.
కుంభం (Aquarius)
కుంభరాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. అన్ని రంగాల వారు ఈ రోజు స్వల్ప ప్రయత్నంతోనే గొప్ప విజయాలను అందుకుంటారు. మీ సమర్ధతకు, ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. కుటుబ సభ్యులతో గడిపే సమయం సంతృప్తి, ఆనందాన్ని ఇస్తుంది. అన్ని అనుకున్నట్లుగా జరగడంతో ఈ రోజంతా ఉత్సాహంగా ఉంటారు.
మీనం (Pisces)
మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులకు ఈ రోజు శుభసూచకంగా ఉంది. తారాబలం అనుకూలంగా ఉంది. కాబట్టి ఏ పని ప్రారంభించినా సత్వర విజయాన్ని అందుకుంటారు. ఉద్యోగులు కొత్త అవకాశాలు అందుకుంటారు.