ఈరోజు అంత అనుకూలంగా లేదు. శుభకార్యాల్లో కొన్ని అనుకోని సంఘటనల వలన మానసిక అశాంతికి గురవుతారు. ఆరోగ్యం సహకరించదు. నవగ్రహ ధ్యానం మేలు చేస్తుంది.
మేషం
మేష రాశి వారికి ఈరోజు అంత అనుకూలంగా లేదు. శుభకార్యాల్లో కొన్ని అనుకోని సంఘటనల వలన మానసిక అశాంతికి గురవుతారు. ఆరోగ్యం సహకరించదు. నవగ్రహ ధ్యానం మేలు చేస్తుంది.
వృషభం
వృషభ రాశి వారికి ఈరోజు అనుకూలంగా లేదు. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. విశ్రాంతి లోపిస్తుంది. ప్రయాణాలు అనుకూలించవు. కొత్త పనులు మొదలు పెట్టడానికి ఈరోజు సరైన సమయం కాదు. శివారాధన మేలు చేస్తుంది.
మిథునం
మిథున రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. రోజంతా సంతోషంగా గడిచిపోతుంది. సమాజంలో మీ పరపతి పెరుగుతుంది. విందువినోదాల్లో పాల్గొంటారు. లక్ష్మీధ్యానం మేలు చేస్తుంది.
కర్కాటకం
కర్కాటక రాశి వారికి ఈరోజు అదృష్టయోగం ఉంది. తలపెట్టిన అన్ని పనులు విజయవంతం అవుతాయి. వ్యాపారులకు కలిసివచ్చే రోజు. ఖర్చులు అదుపులో ఉంచుకోండి. దుర్గా ధ్యానం శుభప్రదం.
సింహం
సింహరాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. వివాదాలకు దూరంగా ఉంటే మంచిది. ముఖ్యమైన పనుల మీద దృష్టి పెట్టాలి. సూర్య ఆరాధన మేలు చేస్తుంది.
కన్య
కన్యా రాశి వారికి ఈరోజు అనుకూలంగా లేదు. బద్ధకంతో వ్యవహరిస్తారు. పనుల్లో ఆలస్యం చికాకు తెప్పిస్తుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. శివారాధన మేలు చేస్తుంది.
తుల
తుల రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. విహారయాత్రలకు వెళ్తారు. దైవచింతన కలిగి ఉంటే మేలు. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. శత్రుజయం ఉంటుంది.
వృశ్చికం
వృశ్చిక రాశి వారికి ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఖర్చులను అదుపులో ఉంచుకోండి. మాటలు జాగ్రత్తగా మాట్లాడండి. ఇంట్లో శాంతి నెలకొంటుంది.
ధనుస్సు
ధనుస్సురాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి అవుతాయి. కుటుంబంలో శుభకార్య సంబంధ చర్చలు జరుగుతాయి. వినాయకుని ఆలయ సందర్శనం మేలు చేస్తుంది.
మకరం
మకర రాశి వారికి ఈరోజు అంత అనుకూలంగా లేదు. ఆచితూచి అడుగు వేస్తే మంచిది. ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. బంధువులతో కలహాలు ఏర్పడవచ్చు. కోపాన్ని అదుపులో పెట్టుకుంటే మంచిది.
కుంభం
కుంభరాశి వారికి ఈరోజు శుభప్రదమైన రోజు. వృత్తివ్యాపారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది.
మీనం
మీన రాశి వారికి ఈరోజు చాలా అనుకూలమైన రోజు. వ్యాపారస్థుల ప్రయత్నాలు విజయానికి దారి తీస్తాయి. పై అధికారుల ప్రశంసలు పొందుతారు. పదోన్నతికి కూడా అవకాశం ఉంది.