Horoscope | శ‌నివారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి ప‌దింత‌లు పెర‌గ‌నున్న ఆదాయం..!

Horoscope | జ్యోతిష్యం అంటే న‌మ్మ‌కం. మ‌న‌కు అంతా మంచే జ‌ర‌గాల‌ని కోరుకుంటాం.. అందువ‌ల్ల ఈ రోజు మ‌న రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయ‌ని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

  • By: raj |    devotional |    Published on : Nov 01, 2025 6:20 AM IST
Horoscope | శ‌నివారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి ప‌దింత‌లు పెర‌గ‌నున్న ఆదాయం..!

మేషం (Aries)

మేష రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో అవరోధాలు ఎదురవుతాయి. మీ లక్ష్యంపై దృష్టి మరలకుండా జాగ్రత్త వహించండి. ఉద్యోగంలో అనిశ్చితితో అభద్రతాభావంతో ఉంటారు. కుటుంబంలో అశాంతి, ఆందోళన ఆవరించి ఉంటాయి. ముఖ్యమైన పనుల్లో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి.

వృషభం (Taurus)

వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు అందుకుంటారు. ఆర్థికాభివృద్ధి ఉంటుంది. కుటుంబసభ్యులతో కలిసి ప్రయాణం చేయాలన్న మీ చిరకాల కోరిక తీరుతుంది. ప్రయాణాలు ఆహ్లాదంగా కొనసాగుతాయి.

మిథునం (Gemini)

మిథున రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. కొత్త పనులు చేపట్టడానికి ఈ రోజు అనుకూలంగా లేదు. వృత్తిపరంగా, పరిస్థితులు మీకు అనుకూలంగా ఉండవు. చేపట్టిన పనుల్లో శ్రద్ధ ఏకాగ్రత అవసరం. అధికారులతో జాగ్రత్తగా నడుచుకోవాలి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన ప్రణాళికలు, ప్రయాణాలు వాయిదా వేయండి.

కర్కాటకం (Cancer)

కర్కాటక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఆటంకాలు, సవాళ్లను విజయవంతంగా అధిగమిస్తారు. సమయస్ఫూర్తితో క్లిష్టమైన సమస్యల నుంచి బయట పడతారు. వృత్తి వ్యాపార తీవ్రమైన పోటీ ఉండవచ్చు. సమయానుకూల నిర్ణయాలతో మేలు జరుగుతుంది. వ్యక్తిగత జీవితం ఎటువంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగిపోతుంది.

సింహం (Leo)

సింహ రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో సంక్లిష్ట పరిస్థితులు చోటు చేసుకుంటాయి. కుటుంబం వాతావరణం కూడా అశాంతిగా ఉంటుంది. జీవిత భాగస్వామితో గొడవలు చికాకు పెడతాయి. ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి. ఎవరినీ అతిగా నమ్మవద్దు. డబ్బు ఆచి తూచి ఖర్చు చేయండి.

కన్య (Virgo)

కన్య రాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. వృత్తినిపుణులకు, వ్యాపారులకు బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. ఆర్థికంగా అద్భుతమైన రోజు. అనేక మార్గాల నుంచి ధనాదాయాలు ఉంటాయి. వృత్తి పరంగా, ఆర్థికంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.

తుల (Libra)

తులా రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. కీలక చర్చలు సమావేశాల్లో మీ వాక్చాతుర్యంతో అందరినీ ఆకర్షిస్తారు. వృత్తి పరంగా మీ ప్రణాళిక, ఆలోచనా విధానం అధికారులను ఆకట్టుకుంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో కృషికి తగ్గ ఫలితం లభిస్తుంది. ఒక తీర్థయాత్రకు అవకాశముంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది.

వృశ్చికం (Scorpio)

వృశ్చిక రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. గొప్ప కృషి, పట్టుదలతో తిరుగులేని విజయాలు సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. పలు మార్గాల నుంచి ధనప్రవాహం ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో ఒత్తిడి తగ్గుతుంది. సమిష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సు రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. కొందరి కారణంగా మీ కఠిన శ్రమ, ప్రణాళిక అంతా వ్యర్ధమవుతుంది. చేపట్టిన పనుల్లో జాప్యం నిరాశ కలిగిస్తుంది. ఆర్థిక సమస్యలతో నిరుత్సాహంగా ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్య అనవసర వాదనలు విభేదాలకు దారితీస్తాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది.

మకరం (Capricorn)

మకర రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. మీ ప్రతిభకు తగిన పురస్కారాలను అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. వ్యాపారంలో లాభాలు భారీఎత్తున ఉంటాయి. దైవబలం అండగా ఉంది. కుటంబంలో ఉల్లాసభరిత వాతావరణం ఉంటుంది.

కుంభం (Aquarius)

కుంభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఏకాగ్రతతో ప్రారంభిన పనుల్లో పురోగతి సాధిస్తారు. వ్యాపారంలో చాలా లాభాలు పొందుతారు. ఉద్యోగంలో మరింత శ్రద్హ పెడితే స్థిరమైన పురోగతి ఉంటుంది. ఆర్థికంగా బలోపేతం అవుతారు. వృత్తి పరంగా మహత్తరమైన అవకాశాలు అందుకుంటారు. ప్రతికూల ఆలోచనలు వీడితే మంచిది.

మీనం (Pisces)

మీన రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. గొప్ప ఆత్మవిశ్వాసంతో ప్రారంభించిన ప్రతిపనిలోను విజయం సాధిస్తారు. వ్యాపారులకు శుభ యోగాలున్నాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉద్యోగంలో మీ సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. ప్రమోషన్ ఛాన్స్ ఉంది. కుటుంబ సౌఖ్యం ఉంది. మిత్రుల సహకారంతో కీలక వ్యవహారాల్లో పురోగతి సాధిస్తారు. ఆదాయం పదింతలు పెరుగుతుంది.