నేటి రాశిఫ‌లాలు.. ఈ రాశివారు ఏ పని తలపెట్టినా విజయం వెన్నంటే..!

Today Horoscope | చాలా మంది జ్యోతిష్యాన్ని అనుస‌రిస్తుంటారు. రోజు వారి రాశిఫ‌లాల‌కు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త ప‌నుల‌ను ప్రారంభిస్తారు. దిన ఫ‌లాలు చూడ‌నిదే కొంద‌రు ఏ ప‌ని ప్రారంభించ‌రు. మ‌రి నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

నేటి రాశిఫ‌లాలు.. ఈ రాశివారు ఏ పని తలపెట్టినా విజయం వెన్నంటే..!

మేషం

మేషరాశి వారికి ఈ రోజు సరదాగా గడిచిపోతుంది. ఈ రోజు మీ జీవితాంతం గుర్తుంచుకునేలా మిగిలిపోతుంది. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన ప్రయోజనాలను అందుకుంటారు. బుద్ధిబలంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఎవరితోనూ వాదనలకు దిగవద్దు.

వృషభం

వృషభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఏ పనిలోనూ తొందరపాటు పనికిరాదు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆచితూచి నడుచుకోవాలి. మొండి పట్టుదలతో సమయం వృథా అవుతుంది. అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలు వినియోగించుకుని వృత్తిపరంగా ఎదిగేందుకు శ్రీకారం చుట్టండి. ముఖ్యమైన పనులు, ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది.

మిథునం

మిథునరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సామాజిక సంబంధాలు మెరుగు పరుచుకోవడంపై దృష్టి సారిస్తారు. స్నేహితులతో, సన్నిహితులతో మంచి సమయాన్ని గడుపుతారు. విందు, వినోదాలలో పాల్గొంటారు. ఆర్థిక అంశాలలో మంచి లాభాలు అందుకుంటారు. ఖర్చులు అదుపు తప్పుతాయి.

కర్కాటకం

కర్కాటకరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో ఎదురయ్యే సమస్యల కారణంగా గందరగోళంగా, అయోమయంగా ఉంటారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. అదనపు ఆదాయ వనరుల కోసం ప్రయత్నిస్తారు. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం అవసరం.

సింహం

సింహరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. గొప్ప ఆత్మవిశ్వాసంతో పనిచేసి నిర్దేశించుకున్న లక్ష్యాలను సునాయాసంగా సాధిస్తారు. పనిప్రదేశంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో హోదా పెరగడంతో నూతన బాధ్యతలను స్వీకరిస్తారు. సన్నిహితులతో విహారయాత్రలకు వెళ్తారు.

కన్య

కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగులకు ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. చేపట్టిన అన్ని పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగంలో పదోన్నతులు, సహోద్యోగుల సహకారం ఉంటాయి. వ్యక్తిగత జీవితం ఉత్సాహభరితంగా ఉంటుంది.

తుల

తులారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చిత్ర లేఖనం, శిల్పకళ వంటి అంశాలలో ఆసక్తి కనబరుస్తారు. కొత్త ప్రాజెక్టులు, అసైన్‌మెంట్లు మొదలు పెట్టడానికి శుభసమయం. వృత్తిపరంగా ఉన్నతంగా ఎదుగుతారు. వ్యాపారులకు సమయం కలిసి వస్తుంది. ఊహించని లాభాలను అందుకుంటారు.

వృశ్చికం

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో హోదా పెరగడం వల్ల నూతన బాధ్యతలను స్వీకరిస్తారు. దృఢ సంకల్పంతో, కార్యదీక్షతో కొన్ని ముఖ్య వ్యవహారాలలో విజయం సాధిస్తారు. మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని చూసి గర్వ పడే స్థాయికి ఎదుగుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది.

ధనుస్సు

ధనుస్సురాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన అన్ని పనులు సకాలంలో పూర్తి కావడం వల్ల సంతోషంగా ఉంటారు. పిత్రార్జితం కలిసి రావడం వల్ల ఆనందంగా ఉంటారు. ఉద్యోగులకు స్థానచలనం జరిగే సూచన ఉంది. కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. ఓ శుభవార్త మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది.

మకరం

మకరరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారవేత్తలు, వృత్తి నిపుణులు, ఉద్యోగులు, విద్యార్థులు అందరికీ ఈ రోజు విశేషంగా యోగిస్తుంది. ఏ పని తలపెట్టినా విజయం వెన్నంటే ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ వ్యవహారాలు, వృత్తిపరమైన జీవితంలో అంతటా ఆనందమే.

కుంభం

కుంభరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. గ్రహ సంచారం అనుకూలంగా లేనందున ఈ రోజు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించకూడదు. ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి. వృత్తిపరంగా ఎదురయ్యే సమస్యలతో ఈ రోజు మొత్తం అశాంతితో, ఆందోళనతో ఉంటారు. మిమ్మల్ని రెచ్చగొట్టే వ్యక్తులను పట్టించుకోకుండా ఉంటే మంచిది.

మీనం

మీనరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి చేపట్టిన పనుల్లో ఆలస్యం, ఆర్థిక నష్టాలు ఉంటాయి. ఎటు చూసినా సమస్యలే ఉండడం వల్ల చాలా నిరాశగా ఉంటారు. మానసిక, శారీరక ఉత్సాహం కొరవడుతుంది. కొన్ని ఘటనల కారణంగా కలత చెందుతారు. ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఎవరితోనూ వాదనల్లోకి దిగవద్దు.