Horoscope | మంగ‌ళ‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి ఇవాళ ప‌ట్టింద‌ల్లా బంగార‌మే..!

Horoscope | జ్యోతిష్యం అంటే న‌మ్మ‌కం. మ‌న‌కు అంతా మంచే జ‌ర‌గాల‌ని కోరుకుంటాం.. అందువ‌ల్ల ఈ రోజు మ‌న రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయ‌ని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

  • By: raj |    devotional |    Published on : Nov 25, 2025 6:52 AM IST
Horoscope | మంగ‌ళ‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి ఇవాళ ప‌ట్టింద‌ల్లా బంగార‌మే..!

మేషం (Aries)

మేష రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. బంధు మిత్రులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. కాలం ఆనందంగా గడిచిపోతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచి తూచి అడుగేయాలి. ఖర్చులు పెరగవచ్చు.

వృషభం (Taurus)

వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి పరంగా నూతన అవకాశాలు ఎదురవుతాయి. వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటే మంచిది. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. కుటుంబంతో దూరప్రాంతాలకు తీర్థయాత్రలకు వెళ్తారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి.

మిథునం (Gemini)

మిథున రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది. కాలం సంపూర్ణంగా సహకరిస్తోంది. శుభవార్తలు వింటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. నూతన వాహన యోగం ఉంది. ప్రయాణాలు లాభకరంగా ఉంటాయి. అర్థలాభం ఉంది. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి.

కర్కాటకం (Cancer)

కర్కాటక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి పరంగా ఈ రోజు చాలా మంచి రోజు. ఆశించిన ఫలితాలు అందుకుంటారు. ధనలాభాలు కూడా మెండుగా ఉంటాయి. ప్రయాణాల్లో సరదా, సంతోషం ఉంటుంది. కీలక వ్యవహారాల్లో పెద్దల సూచనలు మేలు చేస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

సింహం (Leo)

సింహ రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. పెద్దల ఆశీర్వాద బలంతో కీలక సమస్యలు పరిష్కరిస్తారు. కుటుంబ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. ప్రయాణాలు ఆనందదాయకంగా ఉంటాయి.

కన్య (Virgo)

కన్య రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి పరంగా కృషికి తగిన ఫలితాలు ఉంటాయి. సమయాన్ని సక్రమంగా నియోగించుకుంటే సత్ఫలితాలు ఉంటాయి. వ్యాపార విస్తరణకు అనుకూలమైన రోజు. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. కుటుంబంలో ప్రశాంతత కోసం కోపాన్ని అదుపులో ఉంచుకోండి.

తుల (Libra)

తులా రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కొన్ని ఊహించని సంఘటనలతో మానసికంగా విపరీతమైన ఒత్తిడికి గురవుతారు. ఉద్యోగ వ్యాపారాల్లో ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. ఒక వ్యవహారంలో డబ్బు నష్టపోయే ప్రమాదం ఉంది. కుటుంబ సభ్యులతో కలహాలతో మనశ్శాంతి లోపిస్తుంది. ముఖ్యమైన పనులు, ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది.

వృశ్చికం (Scorpio)

వృశ్చిక రాశి వారికి ఈ రోజు అదృష్టదాయకంగా ఉంటుంది. తారాబలం బ్రహ్మాండంగా ఉన్నందున పట్టిందల్లా బంగారం అవుతుంది. కొత్త ప్రాజెక్టులు, వెంచర్లు మొదలు పెట్టడానికి మంగళకరమైన రోజు. ఆర్థికంగా బలోపేతం అవుతారు. కుటుంబ సభ్యులతో మంచి సమయం గడుపుతారు.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సు రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. గ్రహ సంచారం పూర్తి అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో గౌరవ ప్రశంసలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో ధనలాభం సూచనలు ఉన్నాయి. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి.

మకరం (Capricorn)

మకర రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో శుభయోగాలున్నాయి. ఉద్యోగులు పదోన్నతులు అందుకుంటారు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. సరైన ప్రణాళికతో వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. సంపదను వృద్ధి చేస్తారు. చేపట్టిన పనులన్నీ సజావుగా సాగిపోతాయి.

కుంభం (Aquarius)

కుంభ రాశి వారికి ఈ రోజు సానుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. సహచరుల సహకారం లభిస్తుంది. బుద్ధిబలంతో కీలక సమస్యలు పరిష్కరిస్తారు. వృత్తి పరంగా నూతన అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో కుటుంబసభ్యుల సహకారం లభిస్తుంది.

మీనం (Pisces)

మీన రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఒక శుభవార్త అందుకుంటారు. ఆర్థికంగా స్థిరమైన ప్రగతి సాధిస్తారు. కుటుంబ వాతావరణం ఉత్సాహభరితంగా ఉంటుంది. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఖర్చులు పెరగకుండా చూసుకోండి.