Horoscope | బుధవారం రాశిఫలాలు.. ఈ రాశివారు ప్రయాణాలు వాయిదా వేస్తే బెటర్..!
Horoscope | జ్యోతిష్యం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం.. అందువల్ల ఈ రోజు మన రాశిఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
మేషం (Aries)
మేష రాశి వారికి ఈ రోజు ఆనందదాయకంగా ఉంటుంది. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా ఆనందం కలిగించే అనేక సంఘటనలు జరుగుతాయి. అధికారులతో ముఖ్యమైన చర్చలు ఫలిస్తాయి. ఆర్థికంగా బలోపేతం అవుతారు. ఒక శుభవార్త ఆనందం కలిగిస్తుంది. వృత్తిరీత్యా చేసే ప్రయాణాలు ఫలవంతం అవుతాయి.
వృషభం (Taurus)
వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి కృషికి తగిన ఫలితం లభిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రత్యేక గుర్తింపు పొందుతారు. ఆర్థిక స్థితి మెరుగు పడుతుంది. విదేశాలకు, దూర దేశాలకు ప్రయాణాలు చేసే సూచన ఉంది. ఉద్యోగంలో నూతన అవకాశాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది.
మిథునం (Gemini)
మిథున రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. గ్రహ సంచారం అంత అనుకూలంగా లేనందున ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో అనుకోని సంఘటనలు జరగడానికి అవకాశం ఉంది. కీలక వ్యవహారాల్లో దూకుడు తగ్గించుకుని నిదానంగా వ్యవహరిస్తే మంచిది. ఆర్థిక వ్యవహారాల్లో అజాగ్రత్త పరువు నష్టానికి దారితీయవచ్చు, కనుక జాగ్రత్తగా ఉండండి.
కర్కాటకం (Cancer)
కర్కాటక రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఉద్యోగంలో నూతనోత్సాహంతో పనిచేసి ప్రశంసలు అందుకుంటారు. ఆర్థికంగా శుభ యోగాలున్నాయి. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.
సింహం (Leo)
సింహ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. మనోధైర్యంతో ఉద్యోగ వ్యాపారాల్లో సత్ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగంలో స్వల్ప ఆటంకాలు, అధికారులతో ఒత్తిడి ఉండవచ్చు. సహనంతో ఉండడం అవసరం. శత్రు భయం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికాభివృద్ధి ప్రయత్నాలకు ఆటంకం కలగవచ్చు.
కన్య (Virgo)
కన్య రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఊహించని సవాళ్లు ఎదురవుతాయి. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటే సమస్యలు అధిగమించవచ్చు. విద్యార్ధులకు ఈ రోజు కొంత కఠినంగా ఉంటుంది. కృషికి తగిన ఫలితాలు ఉండకపోవచ్చు. వ్యాపారంలో ఆశించిన లాభాలు ఉంటాయి.
తుల (Libra)
తులా రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. వృత్తి ఉద్యోగాల్లో వ్యతిరేక పరిస్థితులతో మానసికంగా విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. వ్యాపారంలో నష్టాలు ఆందోళన కలిగిస్తాయి. వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఏర్పడుతాయి. జీవిత భాగస్వామితో కలహాలు రాకుండా జాగ్రత్త వహించండి. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది.
వృశ్చికం (Scorpio)
వృశ్చిక రాశి వారికి ఈ రోజు అదృష్టదాయకంగా ఉంటుంది. గ్రహబలం విశేషంగా అనుగ్రహిస్తోంది. ఆర్థికంగా బలోపేతం అవుతారు. నూతన ఆదాయ వనరులు వృద్ధి చెందుతాయి. వ్యాపారులు కొత్త వెంచర్లు మొదలుపెట్టడానికి ఈ రోజు మంగళకరమైనది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సు రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో ఆటంకాలు తొలగి అభివృద్ధి సాధిస్తారు. ఆర్థిక విజయాలు మనోబలాన్ని పెంచుతాయి. రుణ సమస్యలు తగ్గుతాయి. కోపాన్ని తగ్గించుకుంటే కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. ఎవరితోనూ వివాదాలకు దిగవద్దు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.
మకరం (Capricorn)
మకర రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు, వ్యాపారులకు ఈ రోజు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. గతంలో ఉన్న సమస్యలు, ఆటంకాలు తొలగిపోతాయి. సమాజంలో పరపతి పెరుగుతుంది.
కుంభం (Aquarius)
కుంభ రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. వృత్తి పరంగా అభివృద్ధి ఉంటుంది. నూతన ప్రాజెక్టులు లభిస్తాయి. ఉద్యోగంలో పదోన్నతులకు అవకాశం ఉంది. కీలక సమావేశాలు చర్చల్లో మీ వాక్చాతుర్యంతో అందరినీ ఆకర్షిస్తారు. అధికారుల ప్రశంసలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి. డబ్బుకు లోటు ఉండదు.
మీనం (Pisces)
మీన రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఊహించని ఆర్థిక లాభాలు పొందుతారు. సంతానానికి సంబంధించి శుభవార్తను వింటారు. చిన్ననాటి స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. సన్నిహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి పరంగా, ఆర్థిక లాభాలకు అవకాశం ఉంది. నూతన ప్రదేశాలలో పర్యటిస్తారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram