Horoscope | శుక్ర‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి ఆదాయానికి మించిన ఖ‌ర్చులు..!

Horoscope | చాలా మంది జ్యోతిష్యాన్ని అనుస‌రిస్తుంటారు. రోజు వారి రాశిఫ‌లాల‌కు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త ప‌నుల‌ను ప్రారంభిస్తారు. దిన ఫ‌లాలు చూడ‌నిదే కొంద‌రు ఏ ప‌ని ప్రారంభించ‌రు. మ‌రి నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

Horoscope | శుక్ర‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి ఆదాయానికి మించిన ఖ‌ర్చులు..!

మేషం (Aries)

మేషరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఉత్సాహం, ప్రయత్నలోపం తగ్గకుండా చూసుకోండి. వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఎవరినీ అతిగా నమ్మవద్దు. ఆర్థిక ఇబ్బందులు ఏర్పడకుండా ముందుచూపుతో వ్యవహరించాలి.

వృషభం (Taurus)

వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో శుభ ఫలితాలు ఉంటాయి. ఆర్థిక పరమైన అభివృద్ధి సాధిస్తారు. స్వయంకృషితో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. బంధు మిత్రులతో శుభకార్యాల్లో పాల్గొంటారు.

మిథునం (Gemini)

మిథునరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. పట్టుదలతో ఆటంకాలు అధిగమించి ముందడుగు వేస్తారు. ఇతరులు అసూయా పడేలా మీ స్థాయి పెరుగుతుంది. ధనం సమృద్ధిగా ఉంటుంది. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఖర్చులు అదుపులో ఉంచుకోండి.

కర్కాటకం (Cancer)

కర్కాటకరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. మనోబలంతో అనుకున్న కార్యాలు నెరవేర్చుకుంటారు. అనవసర కలహాలతో సమయాన్ని వృధా చేయవద్దు. వృత్తి ఉద్యోగాలలో ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారులు భాగస్వాములతో జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.

సింహం (Leo)

సింహరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చంచల బుద్ధి కారణంగా ఇబ్బందులు ఎదురవుతాయి. మీ శక్తియుక్తులు పూర్తిగా వినియోగించి వృత్తి ఉద్యోగాలలో సత్ఫలితాలు సాధిస్తారు. ప్రయాణాలు అనుకూలం. ఒక ముఖ్యమైన వ్యవహారంలో మీ మాట నెగ్గుతుంది. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి. అనారోగ్య సమస్యలు చికాకు పెడతాయి.

కన్య (Virgo)

కన్యారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనులలో పూర్తి అవగాహనతో ముందుకెళ్తే మంచిది. కుటుంబంతో అనుబంధం బలోపేతం అవుతుంది. స్నేహితులు, బంధువులతో విందువినోదాలలో పాల్గొంటారు. ముఖ్యమైన పనులు, ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది.

తుల (Libra)

తులారాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. ఇంటా బయటా ప్రతి విషయంలోనూ ఆచి తూచి వ్యవహరించాలి. ఇతరుల సహకారంతో పనులు పూర్తి చేస్తారు. కుటుంబంలో కలహాలు ఏర్పడకుండా మాట అదుపులో పెట్టుకోండి. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. ఉద్యోగులు నైపుణ్యాలు మెరుగు పరచుకోవడం మీద దృష్టి పెట్టాలి.

వృశ్చికం (Scorpio)

వృశ్చికరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. స్వల్ప ప్రయత్నంతో గొప్ప ఫలితాలు సాధిస్తారు. దైవబలం దురదృష్టకర పరిస్థితుల నుంచి రక్షిస్తాయి. వృత్తి పరంగా అశాంతి, చికాకు చుట్టుముడతాయి. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సురాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. శుభసమయం నడుస్తోంది. ఏ పని తలపెట్టినా విజయం సిద్ధిస్తుంది. వృత్తి ఉద్యోగాలు లాభదాయకంగా ఉంటాయి. మీ ప్రతిభతో అందరిని ఆకట్టుకుంటారు. ఆర్థికంగా శుభయోగాలున్నాయి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది.

మకరం (Capricorn)

మకరరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో కష్టించి పనిచేస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మనోధైర్యం కోల్పోవద్దు. ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. రుణభారం పెరిగే సూచన ఉంది. ఆర్థిక క్రమశిక్షణ పాటించండి.

కుంభం (Aquarius)

కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముందుచూపుతో ఆపదల నుంచి గట్టెక్కుతారు. వ్యాపారులు ఆచి తూచి నడుచుకుంటే నష్టభయం ఉండదు. ఉద్యోగులు పనిపట్ల శ్రద్ధ పెడితే ప్రశంసలు అందుకుంటారు. అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తే సత్ఫలితాలు ఉంటాయి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి.

మీనం (Pisces)

మీనరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. మంచికాలం. ఏ పని మొదలు పెట్టినా విజయవంతంగా పూర్తవుతుంది. మీ చాకచక్యంతో శత్రువులు మిత్రులవుతారు. ఆర్థికంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ఓ శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది.