Rain Alert | తెలంగాణలో ఇవాళ, రేపు మోస్తరు వర్షాలు..! ఎల్లో అలర్ట్ జారీ..!!
Rain Alert | తెలంగాణ వ్యాప్తంగా నిన్నటి నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తోన్న సంగతి తెలిసిందే. మంగళ, బుధవారాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.
Rain Alert | తెలంగాణ వ్యాప్తంగా నిన్నటి నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తోన్న సంగతి తెలిసిందే. మంగళ, బుధవారాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. చాలా జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలులు 40 నుంచి 50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో పంటలకు, తోటలకు నష్టం వాటిళ్లే ప్రమాదముందని అధికారులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ వ్యాప్తంగా పసుపు రంగు హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం మహారాష్ట్ర నుంచి తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతుందని వెల్లడించింది. ఈ నెల 21వ తేదీ నాటికి రాష్ట్రంలో ఎండ తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టనున్నట్లుగా అధికారులు చెబుతున్నారు.
సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, నిజామాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మహబూబ్‌నగర్, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజిగిరి, నారాయణపేట, వికారాబాద్ తదితర జిల్లాల్లో సోమవారం పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి. సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 6.4 సెం.మీ. వర్షపాతం నమోదైంది. వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా దిగువకు పడిపోయాయి.
సికింద్రాబాద్, మోతీనగర్, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో సోమవారం మోస్తరు వర్షం కురిసింది. బాలానగర్ ప్రాంతంలో అత్యధికంగా 3.3 మిల్లీమీటర్ల వర్షం పడగా ముషీరాబాద్‌లో అత్యల్పంగా 0.5 మి.మీ వర్షం కురిసింది. అల్వాల్‌లో 2.5, మూసాపేట్, తిరుమలగిరి 2, ఖైరతాబాద్ 1.8, హిమాయత్‌నగర్ 1.3, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరిలో 1 మి.మీల వర్షం పడింది. మంగళ, బుధవారాల్లో కూడా ఆకాశం మేఘావృతమై తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram