Horoscope | గురువారం రాశిఫలాలు.. ఈ రాశివారికి ఆకస్మిక ధన లాభం..!
Horoscope | జ్యోతిష్యం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం.. అందువల్ల ఈ రోజు మన రాశిఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
మేషం (Aries)
మేష రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ధర్మబుద్ధితో, స్థిర చిత్తంతో వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఉద్యోగ వ్యాపారాల్లో విజయమార్గంలో పయనిస్తారు. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థికపరమైన లాభాలు ఉంటాయి. కుటుంబ వ్యవహారాల్లో పట్టు విడుపు ధోరణి పాటిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.
వృషభం (Taurus)
వృషభ రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. శ్శ్రేయోదాయకమైన కాలం నడుస్తోంది. అన్ని రంగాల వారికి వృత్తిపరమైన అభివృద్ధి ఉంటుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. ఆర్థికాభివృద్ధి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆకస్మిక ధన లాభం ఉండవచ్చు. సన్నిహితులతో విందు వినోదాలలో పాల్గొంటారు.
మిథునం (Gemini)
మిథున రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కావాలంటే సరైన ప్రణాళిక అవసరం. కీలక వ్యవహారాల్లో ఆలస్యం అసంతృప్తి కలిగిస్తుంది. ఉద్యోగులు ఉన్నతాధికారులతో జాగ్రత్తగా నడుచుకోవాలి. వృథా ఖర్చులు నివారిస్తే మంచిది. కోపం అదుపులో ఉంచుకోవాలి.
కర్కాటకం (Cancer)
కర్కాటక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. పూర్వీకుల ఆస్తులు కలిసి వస్తాయి. వ్యాపారంలో ఆర్థికలబ్ధి ఉంటుంది. ముఖ్యమైన పనుల్లో సమాచార లోపం లేకుండా జాగ్రత్త పడండి. కుటుంబ సభ్యులతో వాదోపవాదాలకు దూరంగా ఉంటే మంచిది.
సింహం (Leo)
సింహ రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. మీ ఆత్మవిశ్వాసం , దృఢ నిశ్చయం ఈ రోజు అద్భుతాలు చేస్తాయి. ప్రారంభించిన పనులు సకాలంలో విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్ ఉండవచ్చు. ఆస్తి వ్యవహారాల్లో అనుకూలత ఉంది. మీరు చేపట్టిన ధార్మిక సేవా కార్యక్రమాలు మీకు మంచి గుర్తింపు తీసుకు వస్తాయి.
కన్య (Virgo)
కన్య రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి పరమైన ప్రతికూలతలు తొలగి పోతాయి. పలు మార్గాల నుంచి ధనాదాయం పెరుగుతుంది. ఆత్మీయులతో మంచి సమయం గడుపుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆరోగ్యం సహకరిస్తుంది.
తుల (Libra)
తులా రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో ప్రోత్సాహకరమైన పరిస్థితులు ఉంటాయి. సరైన ప్రణాళికతో ఆర్థిక సమస్యలు అధిగమిస్తారు. కుటుంబంలో ఉద్రిక్తపూరిత వాతావరణం ఉంటుంది. మీ పరుష మాటలు, కోపంతో సమస్యలు పెరుగుతాయి. బంధుమిత్రులతో సంబంధాలు దెబ్బతింటాయి. ఓర్పు, సహనంతో ముందుకెళ్తే మంచిది.
వృశ్చికం (Scorpio)
వృశ్చిక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. పట్టుదల, ఓపికతో బాధ్యతలు నెరవేరుస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూల నిర్ణయాలు వెలువడుతాయి. కొన్ని సంఘటనలు ఇబ్బంది పెట్టినా, సహనంతో ఎదుర్కొని ప్రశంసలు అందుకుంటారు. దైవబలంతో ఆదాయం పెరుగుతుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సు రాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యం, సంపద, సంతోషం, అదృష్టం ఇలా అన్నీ ఒకేసారి కలిసి వస్తాయి. ఉన్నాయి. కుటుంబంలో సమన్వయ ధోరణి ఉంటుంది. చేపట్టిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో ఆర్థిక లాభాలు ఉంటాయి.
మకరం (Capricorn)
మకర రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో తరచూ ఆటంకాలు చికాకు పెడతాయి. ఆశావాదంతో ముందుకెళ్తే కాలం అనుకూలిస్తుంది. వ్యాపారంలో అస్థిర బుద్ధితో తీసుకునే నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. ముఖ్యమైన పనుల్లో ఆత్మీయుల సలహాలు పనిచేస్తాయి. ఆదాయం పెరిగినప్పటికీ ఖర్చులు కూడా పెరగడం ఆందోళన కలిగిస్తుంది.
కుంభం (Aquarius)
కుంభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో కృషికి తగిన ప్రతిఫలం ఉంటుంది. కీలక నిర్ణయాల విషయంలో ఇతరుల అభిప్రాయాలకు విలువ ఇవ్వడం మంచిది. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ పెరిగినా ఫలితాలు మాత్రం సంతృప్తికరంగా ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు రాకుండా ముందుచూపుతో వ్యవహరించాలి.
మీనం (Pisces)
మీన రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో సమిష్టి నిర్ణయాలకు ప్రాధాన్యం ఇస్తే మంచిది. ఉద్యోగంలో విజయ సూచన ఉంది. అధికారులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ఆర్థికాభివృద్ధి ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యుల సహకారం శక్తినిస్తుంది. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహించండి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram