Horoscope | మంగ‌ళ‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి ఈ రోజంతా అద్భుతంగా ఉంటుంది..!

Horoscope | జ్యోతిష్యం అంటే న‌మ్మ‌కం. మ‌న‌కు అంతా మంచే జ‌ర‌గాల‌ని కోరుకుంటాం.. అందువ‌ల్ల ఈ రోజు మ‌న రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయ‌ని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

  • By: raj |    devotional |    Published on : Aug 12, 2025 6:24 AM IST
Horoscope | మంగ‌ళ‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి ఈ రోజంతా అద్భుతంగా ఉంటుంది..!

మేషం (Aries)

మేష రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. విశేషమైన ఆర్థికపరమైన ప్రయోజనాలు పొందుతారు. సమాజంలో మీకు గౌరవం, ఖ్యాతి పెరుగుతాయి. కొత్త ప్రాజెక్టులు, కార్యక్రమాలు ప్రారంభించడానికి అనువైన సమయం. అవివాహితులకు కల్యాణ యోగం ఉంది.

వృషభం (Taurus)

వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. లాభాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులకు అవకాశం ఉంది. మీ ప్రతిభకు ప్రశంసలు, గుర్తింపు దొరుకుతుంది.

మిథునం (Gemini) 

మిథున రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. గ్రహ సంచారం అనుకూలంగా లేదు కాబట్టి పని ప్రదేశంలో ఆచి తూచి నడుచుకోవాలి. తోటి ఉద్యోగులు, ఉన్నతాధికారులతో సహనంతో మెలగాలి. కుటుంబ వ్యవహారాల్లో పట్టుదలకు పోకుండా రాజీపడేందుకు ప్రయత్నించండి.

కర్కాటకం (Cancer)

కర్కాటక రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. గ్రహ సంచారం వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఇంటా బయట వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. ఉద్యోగులు ఉన్నతాధికారులతో వినయంగా నడుచుకోవాలి. చేపట్టిన పనుల్లో ఉత్సాహం తగ్గకుండా చూసుకోండి.

సింహం (Leo)

సింహ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరగడంతో సంతోషంగా ఉంటారు. ఉద్యోగ వ్యాపారాలలో ధనలాభాలు ఆనందం కలిగిస్తాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్నేహితులు, బంధువులతో సరదాగా గడుపుతారు.

కన్య (Virgo)

కన్యా రాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. గ్రహాలు అనుకూలిస్తున్నాయి. అన్ని వైపుల నుంచి శుభ ఫలితాలు ఉంటాయి. వ్యాపార భాగస్వాముల నుంచి ప్రయోజనాలు పొందుతారు. చేపట్టిన అన్ని పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు.

తుల (Libra)

తులా రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముఖ్యమైన చర్చలు, సమావేశాల్లో మీ వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. ఒక వ్యవహారంలో ధననష్టం కలగవచ్చు. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉండవచ్చు. కోపావేశాలు అదుపులో ఉంచుకోండి.

వృశ్చికం (Scorpio)

వృశ్చిక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్ని సంఘటనలు విచారం కలిగిస్తాయి. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. ఏ విషయంలోనూ మొండి పట్టుదలకు పోకుండా సర్దుబాటు ధోరణితో ఉంటే మంచిది. కుటుంబ కలహాలు మానసిక అశాంతికి గురి చేస్తాయి.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సు రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. కుటుంబంలో శుభ కార్యాలు జరుగుతాయి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు.

మకరం (Capricorn)

మకర రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఇంటా బయట వ్యతిరేక పరిస్థితులు ఉండవచ్చు. ఘర్షణలు, కలహాలు రాకుండా మాటను అదుపులో ఉంచుకోండి. వృత్తి ఉద్యోగాల్లో ఆటంకాలు ఉండవచ్చు. అనవసర ఖర్చులు పెరుగుతాయి.

కుంభం (Aquarius)

కుంభ రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. సకాలంలో అన్ని పనులు పూర్తవుతాయి. ఆర్థికాభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ వ్యాపారాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. నూతన గృహ యోగం ఉంది.

మీనం (Pisces)

మీన రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆచి తూచి అడుగేయాలి. ప్రారంభించిన పనుల్లో సమస్యలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి. బంధు మిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అనవసర కలహాలతో సమయాన్ని వృథా చేయవద్దు.