Horoscope | శనివారం రాశిఫలాలు.. ఈ రాశివారికి ఆదాయానికి మించిన ఖర్చులు..!
Horoscope | జ్యోతిష్యం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం.. అందువల్ల ఈ రోజు మన రాశిఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

మేషం (Aries)
మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆత్మవిశ్వాసంతో పనిచేసి వృత్తిలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది.
వృషభం (Taurus)
వృషభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అవసరానికి డబ్బు అందుతుంది. వృత్తి ఉద్యోగాల్లో మధ్యమ ఫలితాలు ఉంటాయి. ఈ రోజు మొదలుపెట్టిన పనులు అసంపూర్ణంగా మిగులుతాయి. ఖర్చులు అదుపులో ఉంచుకోండి.
మిథునం (Gemini)
మిథునరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మానసికంగా ప్రశాంతంగా, శారీరకంగా దృఢంగా ఉంటారు. మిత్రుల ద్వారా ఆర్థిక లబ్ది ఉండవచ్చు. వృత్తిపరంగా ప్రశంసలు అందుకునే అవకాశం ఉంది. కొన్ని శుభవార్తలతో మీ ఉత్సాహం పెరుగుతుంది.
కర్కాటకం (Cancer)
కర్కాటకరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా కీలకమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో అధిక పనిభారం ఉండవచ్చు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.
సింహం (Leo)
సింహరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. కీలక వ్యవహారంలో ఆశించిన ఫలితాలు లభిస్తాయి. సంతానాభివృద్ధికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఉద్యోగులు తమ పనితీరుకు ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు.
కన్య (Virgo)
కన్యారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. చంచల బుద్ధితో తీసుకునే నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. వృత్తి పరంగా, ఆర్థికంగా శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో దైవారాధన మానవద్దు. తీర్థయాత్రలతో మానసిక ప్రశాంతత దొరుకుతుంది.
తుల (Libra)
తులారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ పెరుగుతుంది. సమయానుకూలంగా నడుచుకుంటే చేపట్టిన పనుల్లో పురోగతి ఉంటుంది. కొన్ని సంఘటనలు విచారం కలిగిస్తాయి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి.
వృశ్చికం (Scorpio)
వృశ్చికరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పట్టుదలతో ఆటంకాలు అధిగమిస్తారు. ఉద్యోగులకు సహోద్యోగుల సహకారం లభిస్తుంది. వ్యాపారులు వ్యాపారంలో పోటీని సమయస్ఫూర్తితో అధిగమిస్తారు. ఆర్థికంగా మధ్యమ ఫలితాలు ఉంటాయి.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సురాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఆశించిన ఫలితాల కోసం తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. ఆర్థికంగా చూసుకుంటే, కృషికి తగిన ఫలితాలు ఆలస్యం కావచ్చు. సహనంతో ఉండండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి.
మకరం (Capricorn)
మకరరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. లక్ష్య సాధన కోసం తీవ్రంగా శ్రమించినా పనులు సకాలంలో పూర్తి కాకపోవడం నిరాశ కలిగిస్తుంది. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోండి. చేపట్టిన పనుల్లో శ్రద్ధ పెట్టడం అవసరం.
కుంభం (Aquarius)
కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. అవసరానికి సరిపడా ధనం చేతికి అందుతుంది. కీలక నిర్ణయాల్లో తొందరపాటు తగదు.
మీనం (Pisces)
మీనరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. స్వబుద్ధితో ఆలోచించి చేసే పనులు సత్వర విజయాలను అందిస్తాయి. లక్ష్య సాధన కోసం మీరు చేసే కృషి మీకు మంచి పేరు తెచ్చి పెడుతుంది. వృత్తి పరంగా సహచరుల సహకారం లభిస్తుంది.