Horoscope | సోమ‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశి అవివాహితుల‌కు క‌ల్యాణ యోగం..!

Horoscope | జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

  • By: raj |    devotional |    Published on : Aug 04, 2025 6:57 AM IST
Horoscope | సోమ‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశి అవివాహితుల‌కు క‌ల్యాణ యోగం..!

మేషం (Aries)

మేషరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో పనిచేసి ప్రారంభించిన పనుల్లో విజయం సాధిస్తారు. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. శత్రువులతో జాగ్రత్తగా ఉండండి. ప్రయాణంలో అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి. నూతన కార్యక్రమాలు ఈ రోజు మొదలుపెట్టకండి.

వృషభం (Taurus)

వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. శుభవార్తలు అందుకుంటారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఆర్థికంగా శుభ ఫలితాలుంటాయి. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది.

మిథునం (Gemini)

మిథున రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. స్థిరాస్తి, మార్కెటింగ్ రంగాల వారికి ఈ రోజు లాభదాయకంగా ఉంది. ప్రియమైన వారితో మంచి సమయం గడుపుతారు. విహారయాత్రలకు వెళ్తారు. విందు వినోదాలలో పాల్గొంటారు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.

కర్కాటకం (Cancer)

కర్కాటక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో శారీరక శ్రమ పెరుగుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో పరిస్థితి నిరుత్సాహం కలిగిస్తుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఎవరితోనూ వాదనలకు దిగవద్దు.

సింహం (Leo)

సింహ రాశి వారికి ఈ రోజు ఫలప్రదంగా ఉంటుంది. వ్యక్తిగతంగా, వృత్తి పరంగా సానుకూల ఫలితాలుంటాయి. ఒక శుభవార్త ఎంతో ఆనందం కలిగిస్తుంది. బంధుమిత్రులతో కీలక విషయాలు చర్చిస్తారు. వ్యాపారులు మంచి లాభాలు అందుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలు అనుకూలిస్తాయి.

కన్య (Virgo)

కన్యా రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. బుద్ధిబలంతో మంచి లాభాలు పొందుతారు. షేర్ మార్కెట్, ఇతర పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. ఆర్థికంగా బలోపేతం అవుతారు. ఉద్యోగంలో శ్రమకు తగిన ప్రతిఫలాన్ని పొందుతారు.

తుల (Libra)

తులా రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఇతరుల మాటలు గుడ్డిగా నమ్మవద్దు. ఏ విషయంలోనైనా ఆచి తూచి నడుచుకోండి. అనవసర ఖర్చులు నివారిస్తే మంచిది. భవిష్యత్ కోసం పొదుపు ప్రణాళికలపై దృష్టి సారించండి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.

వృశ్చికం (Scorpio)

వృశ్చిక రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఒత్తిడికి గురికాకుండా జాగ్రత్త పడండి. కీలక నిర్ణయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. కుటుంబ సభ్యుల నుంచి బహుమతులు అందుకుంటారు.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సు రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. మీ మాట తీరుతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉద్యోగ వ్యాపారాల్లో కొన్ని సమస్యలు ఉండవచ్చు. సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తే సమస్యల నుంచి బయట పడవచ్చు. ఒక వ్యవహారంలో ఆర్థిక నష్టం కలిగే సూచన ఉంది.

మకరం (Capricorn)

మకరరాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉండబోతోంది. పదవీయోగం ఉంది. కుటుంబ సభ్యులతో మీ ఆనందాన్ని పంచుకుంటారు. ఉద్యోగ వ్యాపారాల్లో మీ మాటకు తిరుగుండదు. ఆర్థికంగా గొప్ప శుభ యోగాలున్నాయి. అవివాహితులకు కల్యాణ యోగం ఉంది.

కుంభం (Aquarius)

కుంభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కీలక నిర్ణయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగ వ్యాపారాలలో పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. మీ పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి.

మీనం (Pisces)

మీన రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సహచరుల సహకారంతో వృత్తి ఉద్యోగాలలో రాణిస్తారు. వ్యాపారులు కొత్త ప్రాజెక్టులు వాయిదా వేస్తే మంచిది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి.