Horoscope | మంగళవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
Today Horoscope | చాలా మంది జ్యోతిష్యాన్ని అనుసరిస్తుంటారు. రోజు వారి రాశిఫలాలకు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త పనులను ప్రారంభిస్తారు. దిన ఫలాలు చూడనిదే కొందరు ఏ పని ప్రారంభించరు. మరి నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మేషం
అదృష్ట యోగం ఉంది. ప్రతిభతో పనిచేసే లక్ష్యాలను చేరుకుంటారు. ఉద్యోగంలో అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో లాభాలుంటాయి. బుద్ధిబలంతో సమయానుకూలంగా వ్యవహరించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా శుభ ఫలితాలు ఉంటాయి.
వృషభం
వృషభరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో పనిచేసి అద్భుతమైన విజయాలను సాధిస్తారు. కీలక వ్యవహారాల్లో ఆచి తూచి నడుచుకుంటే మంచిది. వ్యాపారంలో పోటీ, సవాళ్లు ఉన్నప్పటికినీ అధిగమిస్తారు. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు.
మిథునం
మిథునరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి. కీలక విషయాలలో నిర్ణయాలు తీసుకొనే శక్తి లోపిస్తుంది. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు.
కర్కాటకం
ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కష్టించి పనిచేసి లక్ష్యాలను సాధిస్తారు. ఇతరులకు స్ఫూర్తిదాయకంగా ఉంటారు. ఓ శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. వ్యాపారంలో పెట్టుబడులు పెరుగుతాయి. లాభాలు వృద్ధి చెందుతాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.
సింహం
సింహరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. ఉద్యోగులకు పనిభారం పెరగడంతో ఒత్తిడికి లోనవుతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఎదురయ్యే సవాళ్ళను ముందుచూపుతో అధిగమిస్తారు. ఆరోగ్యం పట్ల అధిక శ్రద్ధ అవసరం. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం అవసరం.
కన్య
కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి, వ్యాపారాలలో తీవ్ర ప్రతికూలతలు ఉన్నప్పటికీ మనోబలంతో అన్నింటిని అధిగమిస్తారు. ఆర్థికంగా ఓ మెట్టు పైకి ఎదుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో గత కొంతకాలంగా అపరిష్కృతంగా ఉన్న వివాదాలకు ముగింపు పలుకుతారు.
తుల
మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీలోని అంతర్గత శక్తిని మేల్కొల్పాల్సిన సమయం ఆసన్నమైంది. అన్ని కష్టాలను తట్టుకొని జీవితంలో అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. ఉద్యోగులకు నూతన అవకాశాలు ఎదురవుతాయి. అనవసర ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి.
వృశ్చికం
వృశ్చికరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి, వ్యాపారంలో శుభయోగాలున్నాయి. ఆర్థికంగా శుభయోగం ఉంది. ఆకస్మిక ధనలాభాలు ఉండే అవకాశాలున్నాయి. విమర్శకుల మాటలకు ప్రాధాన్యత ఇవ్వొద్దు. కుటుంబ వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తారు.
ధనుస్సు
ఈ రోజు శుభకరంగా ఉంటుంది. అన్ని రంగాల వారు మొక్కవోని దీక్షతో, పట్టుదలతో పనిచేసి అద్భుతమైన విజయాలను సాధిస్తారు. మీ పనితీరుకు ఉన్నతాధికారుల ప్రశంసలు లభిస్తాయి. సంపద వృద్ధి చెందుతుంది. బంధుమిత్రులతో విందు వినోదాలలో పాల్గొంటారు.
మకరం
మకరరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలలో ఆశించిన ఫలితాలు ఉంటాయి. న్యాయ సంబంధ అంశాలు, కోర్టు వ్యవహారాల్లో వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో ఆర్థికపరంగా నష్టాలు సంభవిస్తాయి.
కుంభం
కుంభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. వృధా ఖర్చులు ఉండవచ్చు. ప్రయాణాలు అనుకూలించవు. వివాదాలకు, కలహాలకు దూరంగా ఉంటే మంచిది. వ్యాపారులు రుణభారం పెరగకుండా చూసుకోవాలి.
మీనం
మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారంలో అద్భుతంగా రాణిస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. అనవసర ఖర్చులను తగ్గించుకుంటే మంచిది. బంధువుల ఇంట్లో శుభకార్యాలకు హాజరవుతారు.