Horoscope | శుక్ర‌వారం రాశిఫ‌లాలు.. మీ రాశిఫ‌లం ఎలా ఉందంటే..?

Horoscope | జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

  • By: raj |    devotional |    Published on : Aug 08, 2025 8:11 AM IST
Horoscope | శుక్ర‌వారం రాశిఫ‌లాలు.. మీ రాశిఫ‌లం ఎలా ఉందంటే..?

మేషం (Aries)

మేషరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. మీ ప్రతిభతో, తెలివితేటలతో అందరినీ ఆకర్షిస్తారు. వృత్తి ఉద్యోగాలలో శుభ యోగాలున్నాయి. ఉన్నతాధికారులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఆధ్యాత్మికంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు.

వృషభం (Taurus)

వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలకు అభివృద్ధికి సంబంధించి శుభవార్తలు వింటారు. వ్యాపార నిమిత్తం దూరప్రాంతాలకు వెళ్తారు. ఆకస్మిక ధనలాభం ఉంది. ఆస్తి విలువలు పెరుగుతాయి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు

మిథునం (Gemini)

మిథునరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. కొన్ని అనుకోని సంఘటనలు జరగడానికి అవకాశం ఉంది. గ్రహసంచారం అనుకూలంగా లేదు కాబట్టి వీలైనంత వరకు ఈ రోజు ముఖ్యమైన పనులు వాయిదా వేయండి. ఉద్యోగ వ్యాపారాలలో దూకుడుగా ఉండవద్దు.

కర్కాటకం (Cancer)

కర్కాటకరాశి వారికి ఈ రోజు సరదాగా గడిచిపోతుంది. భిన్న వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఈ పరిచయాలు భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉంటాయి. నూతన వాహన యోగం ఉంది. సన్నిహితులతో విందు వినోదాలలో పాల్గొంటారు.

సింహం (Leo)

సింహరాశి వారికి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో శ్రమ, ఒత్తిడి పెరుగుతాయి. పెద్దల సలహాలు మేలు చేస్తాయి. వ్యాపారంలో లాభాలు అంతంతమాత్రంగానే ఉంటాయి.

కన్య (Virgo)

కన్యారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ముఖ్యంగా వృత్తి నిపుణులు, విద్యార్ధులకు ఈ రోజు కఠినంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో వ్యతిరేక ఫలితాలు నిరాశ కలిగిస్తాయి. ఆర్థికాభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలకు ఆటంకాలు కలుగుతాయి.

తుల (Libra)

తులారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో సమస్యలతో మానసికంగా విపరీతమైన ఒత్తిడి వుంటుంది. ఆర్థిక వ్యవహారాలలో అనుకూలత ఉంటుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. జలగండం ఉంది కాబట్టి జలాశయాలకు దూరంగా వుండండి.

వృశ్చికం (Scorpio)

వృశ్చికరాశి వారికి ఈ రోజు అదృష్టదాయకంగా ఉంటుంది. అనేక శుభ సంఘటనలు జరుగుతాయి. కొత్త వెంచర్లు మొదలుపెట్టడానికి ఈ రోజు మంగళకరంగా ఉంది. కుటుంబ సభ్యులతో సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ముఖ్యమైన చర్చలు సఫలం అవుతాయి.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సురాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి పరమైన ఆటంకాలు, సవాళ్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటారు. ఉద్యోగ వ్యాపారాల్లో ఒత్తిడి పెరగవచ్చు. ఉద్యోగులు ఉన్నతాధికారులతో సహనం, శాంతంతో మెలగాలి. ఏకాగ్రతతో పనిచేస్తే సానుకూల ఫలితాలు ఉంటాయి.

మకరం (Capricorn)

మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగులు, వ్యాపారులకు ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఆశించిన ఆర్థిక లాభాలు అందుకుంటారు. పరపతి పెరుగుతుంది. ప్రమోషన్ లభించే సూచనలున్నాయి.

కుంభం (Aquarius)

కుంభరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. కీలకమైన సమావేశాలు, చర్చలలో మీ వాక్చాతుర్యంతో అందరిని ఆకట్టుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగ వ్యాపారాలలో సహచరుల సహకారం ఉంటుంది.

మీనం (Pisces)

మీనరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. లక్ష్మీకటాక్ష సిద్ధి ఉంది. ఊహించని విధంగా ఆర్థిక లాభాలు పొందుతారు. సంతానానికి సంబంధించి శుభవార్తను వింటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని సంతోషంగా గడుపుతారు.