Horoscope | శుక్ర‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి ప్ర‌యాణాల్లో ప్ర‌మాదాలు.. జ‌ర జాగ్ర‌త్త‌..!

Horoscope | జ్యోతిష్యం అంటే న‌మ్మ‌కం. మ‌న‌కు అంతా మంచే జ‌ర‌గాల‌ని కోరుకుంటాం.. అందువ‌ల్ల ఈ రోజు మ‌న రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయ‌ని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

  • By: raj |    devotional |    Published on : Dec 19, 2025 6:12 AM IST
Horoscope | శుక్ర‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి ప్ర‌యాణాల్లో ప్ర‌మాదాలు.. జ‌ర జాగ్ర‌త్త‌..!

మేషం (Aries)

మేష రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధించాలంటే మనోబలం అవసరం. కీలక వ్యవహారాల్లో పెద్దల సలహాలు అద్భుతంగా ఉపయోగపడతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థికంగా మేలైన సమయం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాలకు అనుకూలం కాదు.

వృషభం (Taurus)

వృషభ రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ప్రారంభించిన పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. శారీరక, మానసిక ఆరోగ్యాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో కృషికి తగిన ఫలితాలు ఉంటాయి. సమాజంలో మంచి కీర్తి ప్రతిష్ఠలు సంపాదిస్తారు. కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. గొప్పవారితో పరిచయాలు ఏర్పడుతాయి.

మిథునం (Gemini)

మిథున రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. అద్బుతమైన పనితీరుతో, సమయస్ఫూర్తితో ఉద్యోగంలో ఆటంకాలు అధిగమిస్తారు. వ్యాపారులకు ప్రభుత్వ సంబంధిత ప్రయోజనాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. ఖర్చులు పెరగడం ఆందోళన కలిగిస్తుంది. ఆరోగ్యం స్వల్పంగా ఇబ్బంది పెడుతుంది.

కర్కాటకం (Cancer)

కర్కాటక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో చురుగ్గా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. వృత్తి పరంగా గతంలో ఉన్న కొన్ని ఇబ్బందులు తొలగిపోతాయి. అపజయాలకు భయపడి సమయం వృథా చేయవద్దు. ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. డబ్బు ఆచి తూచి ఖర్చు చేయండి. అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోండి.

సింహం (Leo)

సింహ రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఆటంకాల వల్ల శ్రమ పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. కుటుంబ సభ్యులతో అనవసరమైన వాదనలు వస్తాయి. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉంటే మంచిది. మీ తల్లిగారి అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ప్రయాణాల్లో ప్రమాదాలు ఉండవచ్చు కాబట్టి జాగ్రత్త వహించండి.

కన్య (Virgo)

కన్య రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆధ్యాత్మిక పరమైన జ్ఞానాన్ని సంపాదిస్తారు. ధార్మిక పరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కీలక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఒక వార్త బాధ కలిగిస్తుంది. ఉద్యోగంలో సహచరుల సహకారాలు లభిస్తాయి. అవసరానికి సరిపడా ధనం అందుతుంది. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.

తుల (Libra)

తులా రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి పరమైన ఆందోళనలు ఇబ్బంది పెడతాయి. మీ మొండి వైఖరితో ఇంటా బయట సమస్యలు ఎదురవుతాయి. గ్రహ సంచారం అంత అనుకూలంగా లేదు కాబట్టి ముఖ్యమైన పనులు, ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. ఆర్థిక పరంగా అనుకూలత ఉంటుంది. ఆరోగ్య పరమైన జాగ్రత్తలు తీసుకోవాలి.

వృశ్చికం (Scorpio)

వృశ్చిక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి చేపట్టిన పనుల్లో విజయాలు సాధిస్తారు. వ్యాపారంలో లాభాలు గణనీయంగా పెరుగుతాయి. ఉద్యోగంలో అధికారుల అండదండలు ఉంటాయి. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా బలోపేతం అవుతారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సు రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. సమయస్ఫూర్తి, చాకచక్యంతో ఉద్యోగ వ్యాపారాల్లో అనూహ్యమైన విజయాన్ని సాధిస్తారు. ఆర్థికంగా విశేషమైన యోగాలున్నాయి. పలు మార్గాల నుంచి ధనలాభాలు పెరుగుతాయి. మానసిక ప్రశాంతతకు భంగం కలిగించే సంఘటనలకు దూరంగా ఉంటే మంచిది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

మకరం (Capricorn)

మకర రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. కీలక సమావేశాలు, చర్చల్లో మీ వాక్చాతుర్యంతో అందరినీ మెప్పిస్తారు. అందరికీ ఆమోదయోగమైన నిర్ణయాలు తీసుకుని ప్రశంసలు అందుకుంటారు. ఉద్యోగ వ్యాపారాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి.

కుంభం (Aquarius)

కుంభ రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలను మనోబలంతో అధిగమిస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో కొన్ని ప్రతికూల పరిస్థితులు ఉండవచ్చు. ఓర్పు, సహనంతో ఆశించిన ఫలితాలు పొందవచ్చు. ఆర్థికంగా మిశ్రమ సమయం. ఆదాయం పెరిగినా ఖర్చులు కూడా సమానంగా పెరుగుతాయి. అనవసర భయాందోళనలు దరిచేరనీయకండి.

మీనం (Pisces)

మీన రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో అందరినీ కలుపుకుని ముందుకు పోవడం వల్ల ఆశించిన ఫలితాలు అందుకోవచ్చు. ముఖ్య విషయాల్లో ఆత్మీయుల సలహాలు పనిచేస్తాయి. కొందరి ప్రవర్తన విచారం కలిగిస్తుంది. సమయానుకూల నిర్ణయాలతో మేలు కలుగుతుంది. అనవసర ఖర్చులు నియంత్రించండి.