మేషం (Aries)
మేష రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. వ్యూహాత్మక నిర్ణయాలతో ఉద్యోగ వ్యాపారాల్లో లాభదాయకమైన ఫలితాలు సాధిస్తారు. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. కుటుంబ సభ్యులతో, సన్నిహితులతో ఈ రోజంతా సరదాగా గడుపుతారు.
వృషభం (Taurus)
వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు విజయవంతం అవుతాయి. సంపూర్ణ ఆత్మ విశ్వాసం, దృఢ సంకల్పంతో వృత్తి ఉద్యోగాల్లో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. సాహసోపేతమైన నిర్ణయాలతో వ్యాపారాల్లో నూతన శిఖరాలు అధిరోహిస్తారు. ఆర్థికంగా సర్వత్రా విజయమే!
మిథునం (Gemini)
మిథున రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో అప్రమత్తత అవసరం. కీలక వ్యవహారాల్లో పెద్దల సలహాలు పాటించడం మంచిది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించడం మంచిది. కోపావేశాలు అదుపులో ఉంచుకోండి.
కర్కాటకం (Cancer)
కర్కాటక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో ఉత్సాహంగా ముందుకు సాగాలి. ప్రారంభించిన పనుల్లో పట్టుదలతో ప్రయత్నిస్తే ఆటంకాలు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది.
సింహం (Leo)
సింహ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ధర్మసిద్ధి ఉంది. దైవబలంతో ఇష్టకార్యసిద్ధి ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో మీ శ్రమకు తగిన ఫలితాలు అందుకుంటారు. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సూచనలతో విజయం సాధిస్తారు. వివాదాలకు దూరంగా ఉంటే మంచిది.
కన్య (Virgo)
కన్య రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో అభద్రతాభావంతో ఇబ్బందులు కలుగుతాయి. మనోధైర్యంతో ముందుకెళ్తే ఆశించిన ఫలితాలు ఉండవచ్చు. పనిప్రదేశంలో విభేదాలకు దూరంగా ఉండడం మంచిది. కుటుంబ వ్యవహారాల్లో ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయి.
తుల (Libra)
తులా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. శ్రేష్టమైన సమయం నడుస్తోంది. వృత్తి పరంగా అనేక అవకాశాలు అందుకుంటారు. వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటే మంచిది. వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. మీ పనితీరుకు ప్రశంసలు, గౌరవం పెరుగుతాయి. డబ్బుకు లోటుండదు.
వృశ్చికం (Scorpio)
వృశ్చిక రాశి వారికి ఈ రోజు సానుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శుభవార్తలు వింటారు. ముఖ్యమైన పనుల్లో మనోధైర్యంతో ముందడుగు వేసి సత్ఫలితాలు అందుకుంటారు. ప్రారంభించిన ప్రతి పని విజయమార్గంలో పయనిస్తుంది. ఇతరుల సహకారంతో ప్రయోజనాలు పొందుతారు. ఆర్థికంగా బలోపేతం అవుతారు.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సు రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఉద్యోగంలో పనిభారం పెరిగినప్పటికీ ఒక ఆశ్చర్యకరమైన ఫలితాన్ని అందుకుంటారు. పనిపట్ల మీరు చూపే శ్రద్ధ, నిబద్ధత మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. లక్ష్యసాధనలో ఆటంకాలు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది.
మకరం (Capricorn)
మకర రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ఆర్థికాభివృద్ధికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోండి. వ్యాపారంలో ఆర్థికపరంగా నష్టాలు రావచ్చు. కుటుంబ వివాదాలు రాకుండా కోపాన్ని అదుపులో ఉంచుకోండి.
కుంభం (Aquarius)
కుంభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. తారాబలం అనుకూలంగా ఉంది. ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పంతో అన్నింటా విజయం సాధిస్తారు. మంచి ప్రణాళిక, ముందుచూపుతో ఖర్చులు అదుపులో ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుంది. జీవిత భాగస్వామితో విహారయాత్రలకు వెళ్తారు.
మీనం (Pisces)
మీన రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి పరంగా ఉన్నత స్థానంలో నిలవాలనుకుంటే సృజనాత్మకంగా వ్యవహరించండి. అందరినీ కలుపుకుని ముందుకు సాగితే మేలు జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృథా ఖర్చులు నివారించండి.
