Horoscope | సోమ‌వారం రాశిఫ‌లాలు.. మీ రాశిఫ‌లం ఎలా ఉందంటే..?

Horoscope | జ్యోతిష్యం అంటే న‌మ్మ‌కం. మ‌న‌కు అంతా మంచే జ‌ర‌గాల‌ని కోరుకుంటాం.. అందువ‌ల్ల ఈ రోజు మ‌న రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయ‌ని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Horoscope | సోమ‌వారం రాశిఫ‌లాలు.. మీ రాశిఫ‌లం ఎలా ఉందంటే..?

మేషం (Aries)

మేష రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. విశేషమైన ఆర్థిక ప్రయోజనాలు పొందగలరు. జీవితంలో కొత్త అధ్యాయం మొదలుపెట్టేందుకు ఎదురుచూస్తున్నవారి ఎదురుచూపులు ఇక ముగిసినట్టే. త్వరలోనే అభివృద్ధి పనులు చూస్తారు. అవివాహితులకు కల్యాణ యోగం ఉంది.

వృషభం (Taurus)

వృషభ రాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారపరంగా ఈ రోజు అద్బుతమైన రోజు. పట్టిందల్లా బంగారం అవుతుంది. మీ ప్రతిభకు గుర్తింపు, ప్రశంసలు అందుకుంటారు. ఆర్థికపరమైన ప్రయోజనాలు కూడా మెండుగా ఉంటాయి.

మిథునం (Gemini)

మిథున రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. గ్రహ సంచారం అనుకూలంగా లేదు కాబట్టి అన్ని రంగాల వారు తమ తమ రంగాల్లో ఆచి తూచి నడుచుకోవాలి. ముఖ్యంగా ఉద్యోగులు పని ప్రదేశంలో అప్రమత్తంగా ఉండాలి. తోటి ఉద్యోగులు, ఉన్నతాధికారులతో వివాదాలకు దూరంగా ఉండండి.

కర్కాటకం (Cancer)

కర్కాటక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. కొన్ని అనుకోని సంఘటనలు జరగడానికి అవకాశం ఉంది. గ్రహసంచారం అనుకూలంగా లేదు కాబట్టి వీలైనంత వరకు ఈ రోజు ముఖ్యమైన పనులు వాయిదా వేయండి. ఉద్యోగ వ్యాపారాల్లో దూకుడుగా ఉండవద్దు. కోపాన్ని అదుపులో ఉంచుకుని నిగ్రహాన్ని పాటించండి.

సింహం (Leo)

సింహ రాశి వారికి వారికి ఈ రోజు సరదాగా గడిచిపోతుంది. భిన్న వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఈ పరిచయాలు భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉంటాయి. వ్యాపారులు చేసుకునే నూతన ఒప్పందాలు లాభదాయకంగా ఉంటాయి. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

కన్య (Virgo)

కన్యా రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఈ అద్భుతమైన రోజు నుంచి అత్యధిక ప్రయోజనాన్ని పొందండి. వ్యాపార భాగస్వాముల నుంచి ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేసి ఉల్లాసభరితంగా ఉంటారు.

తుల (Libra)

తులా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపార పరంగా ఈ రోజు సానుకూల ఫలితాలు ఉంటాయి. దీర్ఘకాలిక, స్థిరాస్తి పెట్టుబడులకు అనువైన రోజు. ఉద్యోగులకు స్వస్తప్రాప్తి ఉండవచ్చు. మెరుగైన ఆర్థిక ప్రయోజనాలు, ఆశించిన లాభాలు అందుకుంటారు.

వృశ్చికం (Scorpio)

వృశ్చిక రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి పరమైన ఆటంకాలు, సవాళ్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటారు. ఉద్యోగ వ్యాపారాల్లో ఒత్తిడి పెరగవచ్చు. ఉద్యోగులు ఉన్నతాధికారులతో సహనం, శాంతంతో మెలగాలి. ఏకాగ్రతతో పనిచేస్తే సానుకూల ఫలితాలు ఉంటాయి.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సు రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో సమస్యలతో మానసికంగా విపరీతమైన ఒత్తిడి వుంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. జలగండం ఉంది కాబట్టి జలాశయాలకు దూరంగా వుండండి.

మకరం (Capricorn)

మకర రాశి వారికి ఈ రోజు అదృష్టదాయకంగా ఉంటుంది. అనేక శుభ సంఘటనలు జరుగుతాయి. ముఖ్యమైన చర్చలు సఫలం అవుతాయి. ఆర్థిక సంబంధమైన విజయం ఉంటుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి.

కుంభం (Aquarius)

కుంభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆధ్యాత్మిక సాధనతో ప్రశాంతత పొందుతారు. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. కుటుంబంలో శుభ కార్యాలు జరగడంతో ఈ రోజు సంతృప్తికరంగా, సంతోషంగా ఉంటుంది. ప్రతికూల ఆలోచనలు విడిచి పెడితే మంచిది.

మీనం (Pisces)

మీన రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. గ్రహస్థితి సామాన్యంగా ఉన్నప్పటికీ పట్టుదలతో ముందుకు సాగితే సత్ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో ముందు జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి.