Horoscope | ఆదివారం రాశిఫలాలు.. ఈ రాశివారికి వాహన ప్రమాదానికి ఆస్కారం.. బీ కేర్‌ఫుల్..!
Horoscope | జ్యోతిష్యం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం.. అందువల్ల ఈ రోజు మన రాశిఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

మేషం (Aries)
మేషరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ముందస్తు ప్రణాళికతో ఉద్యోగ వ్యాపారాలలో విజయానికి బాటలు వేసుకుంటారు. స్థిరమైన నిర్ణయాలతో ఆర్థిక స్థిరత్వం సాధిస్తారు. వ్యాపారంలో నూతన అవకాశాలు ఆహ్వానం పలుకుతాయి.
వృషభం (Taurus)
వృషభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు తగ్గించుకుని నిదానం వహించాలి. సమయాన్ని వృథా చేయకుండా సద్వినియోగం చేసుకుంటే సత్ఫలితాలు ఉంటాయి. కీలక వ్యవహారాల్లో రాజీ ధోరణి అవలంబించాలి. శాంతి మంత్రంతో కుటుంబ కలహాలు దూరమవుతాయి. కళాకారులు, రచయితలకు కలిసి వస్తుంది.
మిథునం (Gemini)
మిథునరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో శుభ ఫలితాలు ఉంటాయి. ప్రియమైన వారు, స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. విందు వినోదాలలో పాల్గొంటారు.ఆర్థికంగా చాలా లాభాలు వచ్చే అవకాశం ఉంది. అనవసర ఖర్చులను తగ్గించి పొదుపు చేయడానికి ప్రయత్నించండి.
కర్కాటకం (Cancer)
కర్కాటకరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు ఉండకపోవచ్చు. కీలక నిర్ణయాల విషయంలో అయోమయం, సందిగ్దత నెలకొంటాయి. ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేస్తే మంచిది. పెద్దలతో, అధికారులతో జాగ్రత్తగా మాట్లాడండి. కుటుంబ సభ్యులతో వాదనలకు దిగవద్దు. ఖర్చులు అదుపులో ఉంచుకోండి.
సింహం (Leo)
సింహరాశి వారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో ఊహించని ధనలాభాలు ఆనందం కలిగిస్తాయి. వ్యాపారంలో పట్టినదల్లా బంగారం అవుతుంది. ఉద్యోగంలో పదవీయోగం ఉంది. ఆస్తులు కూడబెడుతారు. జీవిత భాగస్వామితో విహారయాత్రలకు వెళ్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది.
కన్య (Virgo)
కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో మంచి యోగం ఉంది. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి శుభ సమయం. వృత్తి జీవితంలో ఆటంకాలు తొలగిపోతాయి. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఆదాయం పెరుగుదలకు ఆస్కారముంది. ఉద్యోగంలో పదోన్నతి లభించవచ్చు.
తుల (Libra)
తులారాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. శ్రేష్టమైన శుభ సమయం కొనసాగుతోంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఆర్థిక లాభాలు ఉంటాయి. సహోద్యోగుల నుంచి ఆశించిన సహకారం లభిస్తుంది. కుటుంబంతో తీర్థయాత్రలకు వెళ్తారు. విదేశాల నుంచి అందిన శుభవార్తలతో ఈ రోజంతా ఆనందంగా ఉంటారు.
వృశ్చికం (Scorpio)
వృశ్చికరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారు తమ తమ రంగాల్లో ఆచి తూచి అడుగేయాలి. కీలక వ్యవహారాల్లో అశ్రద్ధ వద్దు. ఆర్థికంగా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉండవచ్చు. ప్రారంభించిన పనులు అనుకున్నట్టుగా సాగవు కాబట్టి ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవడం మంచిది.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సురాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. గ్రహసంచారం అనుకూలంగా ఉన్నందున అన్ని పనులు సాఫీగా సాగిపోతాయి. ఆర్థికాభివృద్ధికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. సంపద వృద్ధి చెందుతుంది. పిత్రార్జితంతో లాభపడతారు. కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి.
మకరం (Capricorn)
మకరరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ వ్యవహారాలు అనుకూలిస్తాయి. వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు. మొహమాటానికి పోయి చిక్కుల్లో పడే ప్రమాదముంది. వాహనప్రమాదాలకు ఆస్కారం ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండండి.
కుంభం (Aquarius)
కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. ఇంటా బయట వ్యతిరేక పరిస్థితులు ఉన్నందున ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. కొత్త ప్రాజెక్టులు వాయిదా వేస్తే మంచిది. ప్రయాణాలు చేయకూడదు. కుటుంబ కలహాలతో అశాంతి, ఆందోళనతో ఉంటారు. మిమ్మల్ని రెచ్చగొట్టే వ్యక్తులను పట్టించుకోకుండా ఉంటే మంచిది.
మీనం (Pisces)
మీనరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తిలో ఆశించిన ఫలితాల కోసం శ్రమించాలి. చేపట్టిన పనుల్లో శ్రమ పెరగడంతో శక్తి, ఉత్సాహం కొరవడుతుంది. కొన్ని సంఘటనలు మిమ్మల్ని కలతకు గురి చేయవచ్చు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. వీలైనంత వరకు శాంతంగా ఉండండి. కుటుంబ సభ్యులతో వాదనల్లోకి దిగవద్దు.