Horoscope | బుధవారం రాశిఫలాలు.. ఈ రాశివారికి ప్రయాణాల్లో ఆటంకాలు.. జర జాగ్రత్త..!
Horoscope | జ్యోతిష్యం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం.. అందువల్ల ఈ రోజు మన రాశిఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

మేషం (Aries)
మేషరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో నూతన అనుభవాలు ఎదురవుతాయి. ఉన్నతాధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. పని ప్రదేశంలో కొంత కఠినమైన పరిస్థితులు ఉండవచ్చు. ధైర్యం, సమయస్ఫూర్తితో ముందుకుసాగితే ఆశించిన ఫలితాలు ఉంటాయి.
వృషభం (Taurus)
వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. స్వల్ప ప్రయత్నంతోనే కార్యసిద్ధి లభిస్తుంది. ఉద్యోగ వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఇంటా బయటా స్నేహపూరిత వాతావరణం ఉంటుంది. ధనధాన్య లాభాలున్నాయి.
మిథునం (Gemini)
మిథునరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. స్పష్టమైన ఆలోచన విధానంతో ముందుకెళ్లి ఆశించిన ఫలితాలు అందుకుంటారు. చేపట్టిన పనుల్లో విజయం సిద్ధిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూల నిర్ణయాలు ఉంటాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది.
కర్కాటకం (Cancer)
కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. పట్టుదలతో చేపట్టిన పనుల్లో ఆటంకాలు అధిగమిస్తారు. పని ప్రదేశంలో మీకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. మాతృవర్గం నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఆదాయానికి సరిపడా ఖర్చులు కూడా ఉంటాయి. అనవసర విషయాల్లో జోక్యం తగ్గించుకోండి.
సింహం (Leo)
సింహరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. తారాబలం చక్కగా అనుకూలిస్తోంది. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆశించిన ధనలాభాలు అందుకుంటారు. ఆత్మవిశ్వాసంతో అద్భుత విజయాలు సాధిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు ఉండవచ్చు. వ్యాపారులకు లాభాలు, అదృష్టం, సంపద లభిస్తాయి. కొత్త పనులు ప్రారంభించడానికి శుభ సమయం.
కన్య (Virgo)
కన్యారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఉత్సాహంతో ముందుకెళ్తే ఆశించిన ఫలితాలు అందుకోవచ్చు. ఉద్యోగ వ్యాపారాలలో సమయానుకూలంగా నడుచుకోవాలి. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. కుటుంబ సభ్యుల అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది.
తుల (Libra)
తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన కార్యక్రమాల్లో సులభంగా విజయం సిద్ధిస్తుంది. కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టేందుకు మంచి రోజు. బాల్య మిత్రులను కలుసుకుని సరదాగా గడుపుతారు. కీర్తి ప్రతిష్టలు, గౌరవం పెరుగుతాయి. ఒక శుభవార్త మీ ఉత్సాహాన్ని పెంచుతుంది.
వృశ్చికం (Scorpio)
వృశ్చికరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో కొన్ని పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. కొన్ని నిర్ణయాలు బాధ కలిగించినా సహనంతో ఉంటే పరిస్థితులు చక్కబడతాయి. వృత్తి నిపుణులకు పని ఒత్తిడి పెరుగుతుంది. శ్రమకు తగిన ఫలితాలు రావడానికి ఆలస్యం కావచ్చు. కోపాన్ని అదుపులో ఉంచుకోండి.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సురాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. లక్ష్మీకటాక్షం ఉంది. భూ, గృహ, వాహనయోగాలున్నాయి. చేపట్టిన పనుల్లో విజయ పరంపరలు కొనసాగుతాయి. ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. వారసత్వపు ఆస్తులు కలిసి వస్తాయి. అనవసర ఖర్చులు తగ్గించుకుంటే మంచిది.
మకరం (Capricorn)
మకరరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో పురోగతి సామాన్యంగా ఉంటుంది. సానుకూల దృక్పధం, సరైన ఆలోచనా ధోరణితో పనిచేస్తే సత్ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో ఉత్సాహం తగ్గకుండా చూసుకోండి. వాహన ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండండి.
కుంభం (Aquarius)
కుంభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముందుచూపు, క్రమశిక్షణతో చేపట్టిన పనుల్లో పురోగతి ఉంటుంది. సామాజికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. కుటుంబంలో ప్రశాంతతకు భంగం కలగకుండా మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి. కీలక వ్యవహారాల్లో లౌక్యంగా వ్యవహరించడం వలన సమస్యలు తొలగుతాయి.
మీనం (Pisces)
మీనరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వ్యాపారంలో శుభ యోగాలున్నాయి. లాభాలు, ఆదాయం పెరగవచ్చు. ఉద్యోగులు క్రమశిక్షణ, అంకితభావంతో పని చేస్తే ఆశించిన ఫలితాలు ఉంటాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తే నష్టపోతారు. కుటుంబ సభ్యులతో కలహాలకు దూరంగా ఉండండి. ప్రయాణంలో ఆటంకాలు ఉండవచ్చు కాబట్టి వాయిదా వేయండి.