Horoscope | శ‌నివారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారు ల‌క్ష్మీదేవి క‌టాక్షంతో ఐశ్వ‌ర్య‌వంతులు అవుతారు..!

Horoscope | జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

Horoscope | శ‌నివారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారు ల‌క్ష్మీదేవి క‌టాక్షంతో ఐశ్వ‌ర్య‌వంతులు అవుతారు..!

మేషం (Aries)

మేషరాశి వారికి ఈ రోజంతా సుఖ శాంతిమయంగా గడుస్తుంది. ఉద్యోగ వ్యాపారాలలో ఆశించిన శుభ ఫలితాలు అందుకుంటారు. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారు. చేపట్టిన అన్ని పనులూ ఉత్సాహంతో పూర్తి చేస్తారు.

వృషభం (Taurus)

వృషభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్య సమస్యలతో కలత చెందుతారు. ఆదాయం సామాన్యంగా ఉంటుంది. ఖర్చులు అదుపులో ఉంచుకోండి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తే మంచిది.

మిథునం (Gemini)

మిథునరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. గ్రహసంచారం అంత అనుకూలంగా లేనందున చేపట్టిన పనుల్లో దూకుడు తగ్గించుకోవాలి. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. మొహమాటంతో చిక్కుల్లో పడతారు. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది.

కర్కాటకం (Cancer)

కర్కాటకరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారులు అనూహ్యమైన లాభాలు పొందుతారు. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది.

సింహం (Leo)

సింహరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. బుద్ధిబలంతో కీలక సమస్యలు పరిష్కరిస్తారు. జీవిత భాగస్వామితో తీర్థయాత్రలకు వెళ్తారు. కుటుంబ కలహాలు రాకుండా కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. ఆర్థిక వ్యవహారాల్లో ధనలాభాలుంటాయి.

కన్య (Virgo)

కన్యారాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో ఆశించిన ప్రయోజనాలు అందుకుంటారు. ఆర్థికంగా మీ కృషికి తగిన ఫలితాలు ఉంటాయి. స్థిరాస్తులు వృద్ధి చేస్తారు. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

తుల (Libra)

తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆశించిన ఫలితాలు ఉండడంతో ఆనందంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో విందు వినోదాలలో పాల్గొని సంతోషంగా గడుపుతారు. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది.

వృశ్చికం (Scorpio)

వృశ్చికరాశి వారికి ఈ రోజు చాలా మంచి రోజు. చెడు ప్రభావం తొలగిపోయింది. లక్ష్మీకటాక్షంతో ఐశ్వర్యవంతులు అవుతారు. కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు. ఒక శుభవార్త మీ సంతోషాన్ని రెట్టింపు చేస్తుంది.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సురాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా కలుగుతున్న అపజయాలకు కృంగిపోవద్దు. ఆత్మీయులతో కలహాలు రాకుండా జాగ్రత్త వహించండి. ప్రయాణాలు వాయిదా వేసుకోండి. ఖర్చులు అదుపు చేయండి.

మకరం (Capricorn)

మకరరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో సానుకూల ఫలితాల కోసం శ్రద్ధ, ఏకాగ్రత అవసరం. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. కుటుంబ సమస్యలు నిర్లక్ష్యం చేయవద్దు. వృత్తి ఉద్యోగాలలో ఇబ్బందులు రాకుండా ముందుచూపుతో వ్యవహరించాలి.

కుంభం (Aquarius)

కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ఆదాయం అనూహ్యంగా పెరుగుతుంది. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. నూతన వస్తువాహనాలు కొనుగోలు చేస్తారు.

మీనం (Pisces)

మీనరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. డబ్బు అధికంగా ఖర్చవుతుంది. శుభవార్తలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కుటుంబంలో శాంతి నెలకొల్పడానికి కోపావేశాలు అదుపులో ఉంచుకోండి. సహనం కోల్పోవద్దు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి.